Mandali Buddha Prasad
-
‘పవర్’లేని పవన్ పాలిటిక్స్.. ఇదేనా జనసేన నీతి?
కూటమి రాజకీయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనసైనికులకు షాకిస్తూ పవన్ కల్యాణ్ మరో నిర్ణయం తీసుకున్నారు. అవనిగడ్డ అభ్యర్థి ఎవరు? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకే టికెట్ వరిస్తుందా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం దక్కుతుందా? అనే ఉత్కంఠకు పవన్ తెరదించారు. అంతా అనుకున్నట్టుగానే అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధినేత పవన్ ఖరారు చేశారు. ఇక, మొదటి నుంచి అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలంటూ స్థానిక నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, మొదట మండలి బుద్ధప్రసాద్‌కు టీడీపీ నుంచి అవనిగడ్డ సీటు దక్కలేదు. అయితే, చంద్రబాబు ప్లాన్‌లో భాగంగా ఆయన జనసేనలో చేరారు. దీంతో, కూటమి పొత్తులో భాగంగా ఆయనకే సీటు వచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేసి టికెట్ ఇప్పించారు. ఈ విషయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో చంద్రబాబు ఉంటే తెరమీద పవన్ నటించారు. మరోవైపు.. మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరిన నాటి నుంచి జనసేన టికెట్ ఆశించిన విక్కుర్తి శ్రీనివాస్, బండ్రేడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో జనసేనపై తీవ్ర విమర్శలు చేసిన బుద్ధప్రసాద్‌కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. కానీ, కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరునే పవన్ ఖరారు చేశారు. ఇక, గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన బుద్ధ ప్రసాద్.. ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. మిగిలిన పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థి పేర్లపై పవన్ రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో పవన్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంలో మిత్ర పక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. కొద్ది గంటలో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
Pawan Kalyan: ‘మా బిడ్డకు వేరొకరు తండ్రా?’
కృష్ణా, సాక్షి: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్‌కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి. విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్‌కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్‌కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్‌కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే.. ‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్‌కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్‌ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. -
రగిలిపోతున్న ‘మండలి’.. జంపేనా?
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తితో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ రగిలిపోతున్నారు. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్.. తొలి జాబితాలో అవకాశం దక్కక పోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలని మండలి బుద్ధప్రసాద్, టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే అవనిగడ్డ టీడీపీ నేతలు,కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబు, పవన్‌కు పంపించగా, అవనిగడ్డ తమ్ముళ్ల డిమాండ్‌ను చంద్రబాబు పట్టించుకోలేదు. సీటు దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు బుద్ధ ప్రసాద్ దూరంగా ఉంటున్నారు. దీంతో అక్కడ టీడీపీ క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోయింది. మరో వైపు, కృష్ణా జిల్లాలో టీడీపీకి మరోషాక్ తగలనుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే యోచనలో బుద్ధ ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. ‘‘తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ బుద్ధ ప్రసాద్ గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఇదీ చదవండి: పొత్తుల పితలాటకం -
టీడీపీ తొలి జాబితాపై మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవనిగడ్డ నుంచి టీడీపీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న బుద్ధ ప్రసాద్.. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే టిక్కెట్ వస్తుందని బుద్ధ ప్రసాద్ ఆశపడ్డారు. పొత్తుల సీట్ల ప్రకటనలో అవనిగడ్డ సీటును చంద్రబాబు, పవన్ పెండింగ్‌లో పెట్టారు. మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
బుద్ధప్రసాద్‌కు షాకిచ్చిన దివిసీమ రైతులు
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్‌కు దివిసీమ రైతాంగం షాకిచ్చింది. పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద రైతు సమస్యలపై సామూహిక సత్యాగ్రహ దీక్ష పేరిట బుద్ధ ప్రసాద్ డ్రామాకు తెరతీశారు. బుద్ధ ప్రసాద్‌కు వత్యిరేకంగా పులిగడ్డ సెంటర్లో దివిసీమ రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాడు-నేడు పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దివిసీమ రైతాంగం.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి, సీఎం జగన్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితులపై ఫోటోలు ప్రదర్శించారు. రైతులకు మేలు చేయకపోగా దొంగ దీక్షలు ఎందుకంటూ మండలి బుద్ధ ప్రసాద్‌ను దివిసీమ రైతులు నిలదీశారు. చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ -
హృద్యమైన పద్యము భాష వికాసానికి మూలం
మెల్బోర్న్ : నేటి ప్రపంచంలో నలుమూలలా తెలుగు భాష వృద్ధి చెందుతున్న పరిణామం మంచి భవిష్యత్తును సూచిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సభాపతి డా. మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆస్ట్రేలియా తెలుగు సంస్థ ‘తెలుగుమల్లి’ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రారంభమైనా ‘తెలుగు కావ్యసౌరభాలు’ జూమ్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బుద్ధప్రసాద్ ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ రోజుల్లో రచయితలు విరివిగా రచనలు చేయటం ముదావహమే అయినా తెలుగు కావ్యాలను, పూర్వసాహిత్యాన్ని చదివే పాఠకులు మళ్ళీ రావాలని పద్య సాహిత్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. వెయ్యేళ్ళ తెలుగుసాహిత్యాన్ని అధ్యయనం చేస్తే తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు, పద్య ప్రాముఖ్యత సజీవంగా అర్థమవుతాయని ఒక్కాణించారు. ఈ విషయంలో విదేశాల్లోని తెలుగువారి కృషిని ఆయన ప్రశంసించారు. ఆస్ట్రేలియాలోని “తెలుగుమల్లి” సంస్థ ద్వారా నిర్వాహకులు కొంచాడ మల్లికేశ్వరరావు తెలుగు పద్యప్రచారానికి పూనుకొని అవధానాలు, పద్యకావ్యరచనలు, కావ్యసమీక్షలు కరోనా బాధితసమయంలో కూడా నిర్వహించటాన్ని బుద్ధప్రసాద్ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో సాహిత్య ప్రక్రియలకు కొదవలేదని, ఇక్కడ కథలు, కవితలు, పద్యాలు వ్రాసే శతక కర్తలు కూడా చాలామంది ఉన్నారని గత సంవత్సరం తెలుగు భాష ప్రపంచ దేశాలలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో సామాజిక భాషగా గుర్తించడం, అందులో ఇక్కడి తెలుగువారందరూ పాలుపంచుకోవడం శ్లాఘనీయమని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు పంచకావ్యాలను వారానికొకటి చొప్పున విశ్లేషించటానికి పూనుకున్న డా. చింతలపాటి మురళీకృష్ణ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నెలనెలా అవధానాలు నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా అవధాని తటవర్తి కళ్యాణ చక్రవర్తి సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రావిపాటి శ్రీకృష్ణ, డా. చారి ముడుంబి, డా.వేణుగోపాల్ రాజుపాలెం,డా.ఉష శ్రీధర్, డా.శనగపల్లి కోటేశ్వరరావు, సునిల్ పిడుగురాళ్ళ, విశ్వనాధశర్మ, పిలుట్ల ప్రసాద్ ప్రభృతులు జూమ్ ద్వారా పాల్గొన్నారు.సింగపూర్, మలేసియా, అమెరికా, ద.ఆఫ్రికా దేశాలవారు కార్యక్రమాన్ని ఆసక్తితో వీక్షించారు. -
ఆంధ్రుల సమగ్ర చరిత్రకు గ్రామాలే పునాదులు
► శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ► జలదంకి చెన్నకేశవ దేవాలయం చరిత్ర శాసనాలు పుస్తకావిష్కరణ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రుల సమగ్ర రచనకు గ్రామాల చరిత్రే పునాదులని శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం జమ్మిచెట్టు సెంటర్ సమీపంలో ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో ‘జలదంకి చెన్నకేశవ దేవాలయం చరిత్ర–శాసనాలు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో పుస్తక రచయిత, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డితో పాటుగా మానసిక వైద్య నిపుణుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి, శ్రీచెన్నకేశవ భక్త మండలి ట్రస్ట్ చైర్మన్ ఎం.రంగయ్య, ఉపా«ధ్యక్షుడు డి.బ్రహ్మారెడ్డి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి నారాయణ, లయోల కళాశాల వైస్స్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, అధ్యాపకులు మువ్వా శ్రీనివాస రెడ్డి, వల్లభరావు పాల్గొన్నారు. బుద్ధవిహార ప్రాజెక్టు నమూనా చిత్రపటం ఆవిష్కరణ జిల్లాలోని ఘంటశాలలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన బుద్ధ విహార ప్రాజెక్టు నమూనా చిత్రపటాన్ని శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ శనివారం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో ఆవిష్కరించారు. ఘంటసాల గ్రామానికి చెందిన ఎన్నారై రంగనాథబాబు స్థాపించిన గొర్రెపాటి ఉదయ భాస్కరమ్మ, వెంకట్రాయుడు ట్రస్ట్ తరఫున ఈ ప్రాజెక్టుకు రెండున్నర ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారని ప్రాజెక్టు రూపశిల్పి రేగుళ్ల మల్లికార్జునరావు తెలిపారు. 100 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు వచ్చే వారం ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. -
‘తెలుగు ప్రాచీన కేంద్రానికి స్థలం ఇవ్వండి’
హైదరాబాద్: తెలుగు ప్రాచీన కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటుచేసేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని శాసనసభ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలుగు ప్రాచీన కేంద్రం ప్రస్తుతం మైసూర్లో ఉందని, దీన్ని ఏపీకి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని బుద్ధప్రసాద్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. నాగార్జున వర్సిటీలో తెలుగు ప్రాచీన కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి స్థలాన్ని ఇవ్వాలని, దీనిపై త్వరితంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ లేఖపై తదుపరి చర్యలకు సంబంధించి మంత్రి గంటా శనివారం అధికారులతో చర్చించారు. అయితే కేంద్రప్రభుత్వం దీనికి సంబంధించి అధికారికంగా రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదని, అవేవీ లేకుండా ముందుగా స్థలం కేటాయింపు ఎలా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తపరిచినట్లు తెలిసింది. తెలుగు ప్రాచీన కేంద్రం తరలింపునకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చాకనే తదుపరి చర్యలు తీసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో మంత్రి గంటా ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
'కులాల పేరుతో ప్రజలను చీల్చొద్దు'
విజయవాడ: కాపు ఐక్య గర్జన సందర్భంగా తునిలో చోటుచేసుకున్న ఘటనలు ఆందోళన కలిగించాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫిర్యాదుల కమిటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాపుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ సమావేశానికి తరలివెళ్లినవారు తిరిగి క్షేమంగా తిరిగివస్తారా లేదా అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. తమను నమ్మి వచ్చినవాళ్ల బాగోగులను నాయకులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాపు ఐక్య గర్జనకు కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. తుని ఘటనలకు బాధ్యులైన వారు ఖండించకపోవడం విచారకరమని అన్నారు. నాయకులు హుందాగా వ్యవహరించాలని కులాల పేరుతో ప్రజలను చీల్చొద్దని విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి లేకుండా చేస్తూ యువత మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నం క్షమరాని నేరమని అన్నారు. -
రాజకీయాలంటే భయమేస్తోంది-మండలి బుద్ధప్రసాద్
-నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవు -రాజకీయాలంటే భయమేస్తోంది -ఉపసభాపతి బుద్ధప్రసాద్ ఆవేదన అవనిగడ్డ(కృష్ణా జిల్లా) : కులాలు, మతాల వారీగా ప్రజలను విభజిస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్న నేటి రాజకీయాలంటే భయమేస్తోందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం రచ్చబండపై సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉండేవని, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసేవారని చెప్పారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కులమతాలను ప్రోత్సహించకుండా రాజకీయాలు లేవని, అన్ని పార్టీలూ వీటిని ప్రోత్సహిస్తూ అశాంతికి కారణమవుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు అభివృద్ధి, పనిచేసే నాయకుడిని చూసి ప్రజలు ఓటేసేవారని, నేడు డబ్బులు పంచకపోతే ఓటేసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవని, అధికారమే పరమావధిగా ఎదుటి పార్టీలను దూషించడానికే ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు. రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయాయని, ప్రజల బాగోగులను పట్టించుకునే తీరిక లేదని చెప్పారు. ఓటర్లను ఎలా బుట్టలో వేసుకోవాలా అనే ఆలోచనలతోనే పనిచేస్తున్నాయని, మారిన ఈ రాజకీయాలంటేనే భయమేస్తోందని తెలిపారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, జాతిని జాగృతం చేసేలా మంచి వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని యువతకు సూచించారు. తహశీల్దార్ వెన్నెల శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఖాదర్ బాషా, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
'బీసీ సంక్షేమం ప్రభుత్వ కర్తవ్యం'
తెనాలి (గుంటూరు) : బీసీ వర్గాల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వాతంత్య్రయోధుడు, బీసీ ఉద్యమ ప్రముఖుడు దాలిపర్తి శేషయ్య విగ్రహాన్ని మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం చినరావూరులో బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం దాలిపర్తి ధన్వంతరి అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నాయీబ్రాహ్మణ సంక్షేమం, బీసీ ఉద్యమానికి శేషయ్య చేసిన కృషి నిరుపమానం అని చెప్పారు. అనంతరం మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు తదితరులు మాట్లాడారు. -
మల్లన్న సేవలో డిప్యూటీ స్పీకర్
శ్రీశైలం : శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మంగళవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రధానాలయ గోపురం వద్ద ఈఓ సాగర్‌బాబు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేషపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేశారు. -
ఉనికి కోసం కాంగ్రెస్ తహతహ
రఘువీరాను కలిసిన మండలి బుద్దప్రసాద్ నందిగామ బరిలో కాంగ్రెస్ విజయవాడ : కాంగ్రెస్ పార్టీ లేని ఉనికిని చాటుకునేందుకు తహతహలాడుతోంది. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు తమ వ్యూహాన్ని రూపొందిం చారు. ఏపీ పీసీసీ ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించి అమలు చేయడానికి ఇప్పటికే సమాయత్తమైంది. నందిగా మ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మికంగా మృతి చెందారు. ఆ స్థానంలో టీడీపీ తమ పార్టీ అభ్యర్థినిగా తంగిరాల కుమార్తె సౌమ్యను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో నందిగామ ఉప ఎన్నికల్లో పోటీచేసి ప్రజల్లోకి వెళ్లి టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల పాలనను ఎండగట్టాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా తన బలం పెరిగిందని చాటి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ అభ్యర్థిని బరిలోకి దింపారు. దీంతో పాటు టీడీపీ, బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చాటిచెప్పే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. బుధవారం హైదరాబాద్‌లో ఉపసభాపతి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డిని ఇంటికి వెళ్లి కలిశారు. నందిగామ ఉప ఎన్నికలో పోటీ చేయవద్దని అభ్యర్థించారు. రఘువీరారెడ్డి సున్నితంగా తిరస్కరించారు. తమ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక వెనకడగు వేయదని రఘువీరా స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన వెనుదిరిగారు. మండలి, రఘువీరాను కలవడం వెనుక మాజీ ఎంపీ లగడపాటి వర్గీయులు మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు నందిగామ తరలివెళ్లి బోడపాటి బాబూరావుతో నామినేషన్ దాఖలు చేయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటు దక్కలేదు. గత ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం ఒక శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టటం చర్చనీయాంశమైంది. టీడీపీ వైఫల్యాలపై ప్రచారం ... కాగా ఉప ఎన్నికలో పోటీచేసి బీజేపీ, టీ డీపీ వైఫల్యాలను ఎండగట్టాలనేది కాంగ్రెప్ పార్టీ రోడ్ మ్యాప్ వ్యూహంగా చెపుతున్నారు. ప్రధానంగా టీడీపీ రుణమాఫీ హామీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రణాళిక సిద్ధం చేశారు. వంద రోజుల్లో టీడీపీ పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని పెద్దఎత్తున ప్రచారం చేయనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రాష్ట్ర నాయకులు రానున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లి ప్రచారం చేయనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తెలిపారు. ప్రధానంగా ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు ఉప ఎన్నికలను వేదికగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పోటీకి సమాయత్తమైనట్లు తెలిసింది. చంద్రబాబు మోసం చేశారు.... కాగా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఏపీ పీసీసీ నాయకుడు కొలనుకొండ శివాజీ అన్నారు. రుణమాఫీ అంటూ ప్రజలకు నమ్మబలికిన చంద్రబాబు ఆచరణలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ, ప్రభుత్వానికి ఎదురుగాలి మొదలైందన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు. -
వెంకన్న సేవలో బుద్ధప్రసాద్, రామానాయుడు
తిరుమల : శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఉదయం నైవేద్య విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారు లడ్డూ ప్రసాదాలు అందచేశారు. -
డిప్యూటీ స్పీకర్ గా బుద్ధప్రసాద్ ఎన్నిక
-
రాజకీయాల్లో విలక్షణ నేత బుద్ధప్రసాద్:చంద్రబాబు
-
డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్ధప్రసాద్ ఎన్నిక
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా మండలి బుద్ధప్రసాద్ ఎన్నికయ్యారు. బుధవారం ఆయన డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఉప సభాపతిగా బుద్ధప్రసాద్ ఎన్నికైనట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఉదయం సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌కు శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. కాగా మండలి బుద్ధప్రసాద్ గతంలో కాంగ్రెస్ తరపున మంత్రిగా, అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీలో చేరి అవనిగడ్డ నుంచి విజయం సాధించారు. -
ఉపసభాపతిగా మండలి బుద్ధప్రసాద్?
సోమవారం ప్రకటించనున్న సభాపతి కోడెల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సాయంత్రం నామినేషన్ దాఖలు గడువు ముగిసేనాటికి ఆయన ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయటంతో ఉప సభాపతిగా బుద్ధప్రసాద్ ఎన్నికైనట్లు సోమవారం (23వ తేదీ) సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించనున్నారు. మండలి గతంలో కాంగ్రెస్ తరపున మంత్రిగా, అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీలో చేరి అవనిగడ్డ నుంచి విజయం సాధించారు. జగన్‌కు యనమల ఫోన్: ఉప సభాపతి ఎన్నిక వ్యవహారంపై శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సమయాభావం వల్ల నామినేషన్ వేయడానికి ముందే ఉప సభాపతి ఎంపికపై సమాచారం ఇవ్వలేకపోయామని, ఎన్నిక ఏక గ్రీవానికి సహకరించాలని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. చీఫ్ విప్‌గా కాలువ, విప్‌లుగా నలుగురు: ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. వారి పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శితోపాటు శాసనసభ సచివాలయానికి అందచేశారు. ఒకటి, రెండు రోజుల్లో వీరి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. చీఫ్‌విప్‌గా అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు, విప్‌లుగా చింతమనేని ప్రభాకర్ (దెందులూరు), కూన రవికుమార్ (ఆముదాల వలస), మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట), యామినీబాల (శింగనమల)లను ఎంపిక చేశారు. -
మండలి రాజీనామా ఆమోదించిన గవర్నర్
అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన గవర్నర్ ఈఎస్ఎల్ నరిసింహన్కు పంపారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమెదించారు.అనంతరం అధికార భాషా సంఘాన్ని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మండలి బుద్ధ ప్రసాద్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 2004లో కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆయన పశుసంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పని చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. దాంతో నామినేటడ్ పోస్ట్‌లో ఉన్న వారు తమతమ పదవులకు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.