డిప్యూటీ స్పీకర్గా మండలి బుద్ధప్రసాద్ ఎన్నిక
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా మండలి బుద్ధప్రసాద్ ఎన్నికయ్యారు. బుధవారం ఆయన డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఉప సభాపతిగా బుద్ధప్రసాద్ ఎన్నికైనట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఉదయం సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్కు శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. కాగా మండలి బుద్ధప్రసాద్ గతంలో కాంగ్రెస్ తరపున మంత్రిగా, అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీలో చేరి అవనిగడ్డ నుంచి విజయం సాధించారు.