
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవనిగడ్డ నుంచి టీడీపీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న బుద్ధ ప్రసాద్.. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే టిక్కెట్ వస్తుందని బుద్ధ ప్రసాద్ ఆశపడ్డారు. పొత్తుల సీట్ల ప్రకటనలో అవనిగడ్డ సీటును చంద్రబాబు, పవన్ పెండింగ్‌లో పెట్టారు.
మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు.
ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట!
Comments
Please login to add a commentAdd a comment