
మహిళల మరుగుదొడ్డి పక్కన సహిద్ లక్ష్మణ్ నాయక్ విగ్రహం
భువనేశ్వర్ : కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆదివాసీ నేత, దేశ స్వాతంత్య్ర సమరంలో అమరుడైన ప్రథమ ఆదివాసీ నాయకుడు సహిద్ లక్ష్మణ నాయక్‌కు తీవ్ర అవమానం జరిగింది. కొట్‌పాడ్ కళాశాలలో సహిద్ లక్ష్మణ్ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నారు. అయితే శనివారం ఎవరో దుండగులు ఆ విగ్రహాన్ని పెకిలించి మహిళల మరుగుదొడ్డి పక్కన పడవేశారు. ( భారత్‌లో ఆకలి కేకలు )
ఈ పని ఎవరు చేసినా ఒక ఆదివాసీ సాతంత్య్ర సమర యోధునికి అవమానం జరిగినట్లేనని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుళ ఆదివాసీ కొరాపుట్ జిల్లాలో పుట్టి దేశ స్వాతంత్య్రం కోసం చిరునవ్వుతో ఉరికంబమెక్కి ప్రాణాలు అర్పించిన దేశ భక్తుడికి జరిగిన అవమానం ఇదంటూ కేవలం ఆదివాసీ ప్రజలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.