
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్)లో జాయిన్ అయ్యారు హీరో అజయ్ దేవగన్. కానీ సినిమా కోసమే. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ విజయ్ కర్నిక్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా తెరకెక్కనుంది. భూషణ్ కుమార్ నిర్మిస్తారు. ఇందులో విజయ్ పాత్రలో నటించనున్నారు అజయ్ దేవగన్. 1971లో ఇండియా–పాకిస్తాన్ యుద్ధం సమయంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది.
యుద్ధం సమయంలో గుజరాత్‌లోని భూజ్ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్తాన్ భారీ బాంబు దాడి చేసింది. అప్పుడు విజయ్ ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 300 మంది మహిళలను ప్రేరేపించి, భారత ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ల సçహాయంతో ఆ ఎయిర్‌స్ట్రిప్‌లను పునరుద్ధరించి ఆ యుద్ధంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఈ ధైర్యశాలి పాత్రలోనే అజయ్ నటించబోతున్నారు.