18 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా నటి..! | Kajol shares pic with Ajay Devgn on instagram | Sakshi
Sakshi News home page

18 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా నటి..!

Published Sat, Feb 25 2017 11:40 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

18 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా నటి..! - Sakshi

18 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా నటి..!

ముంబై: బాలీవుడ్‌లో అన్యోన్యంగా ఉండే జంటగా కాజోల్-అజయ్ దేవగణ్ లకు మంచి పేరుంది. ఎన్ని సమస్యలొచ్చినా ఒకరికి మరొకరు తోడుగా నిలిస్తూ 18 ఏళ్లుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దంపతులు ఈ ఫిబ్రవరి 24న తమ 18వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఓ సెల్ఫీని నటి కాజోల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన భర్త అజయ్ దేవగన్ కోసం దర్శకనిర్మాత కరణ్ జోహర్ తో 25 ఏళ్ల స్నేహాన్ని ఇటీవల ఆమె వదులుకున్న విషయం తెలిసిందే.

అజయ్ స్వీయ నిర్మాణంలో నటించిన చిత్రం శివాయ్ కి వ్యతిరేకంగా కరణ్ జోహర్ ప్రచారం చేయించారన్న వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ విషయంలో తన భర్తకు నైతిక మద్ధతు తెలుపుతూ రెండున్నర్ దశాబ్దాల స్నేహాన్ని వదులుకోవడానికే కాజోల్ మొగ్గుచూపింది. 1999 ఫిబ్రవరి 24న కాజోల్- అజయ్ దేవగన్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా, వీరికి 14 ఏళ్ల నైసా దేవగన్, 6 ఏళ్ల యుగ్ దేవగన్ సంతానం. అయితే నిన్న (శుక్రవారం) వారి పెళ్లిరోజు సందర్భంగా అభిమానులతో షేర్ చేసుకున్న ఫొటోకు మంచి స్పందన వచ్చింది. తమ దంపతులను మంచి మనసుతో ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది కాజోల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement