
అజయ్ దేవగన్
బాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారు అజయ్ దేవగన్. ఒకవైపు హీరో, మరోవైపు నిర్మాతగా బాధ్యతలను ఆయన బ్యాలెన్స్ చేస్తున్నట్లున్నారు. ప్రస్తుతం అజయ్ ‘దే దే ప్యార్ దే, టోటల్ ధమాల్, తానాజీ: ది అన్‌సంగ్ వారియర్, ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో టోటల్ ధమాల్ ఈ ఏడాది రిలీజ్ కావాల్సింది. దే దే ప్యార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సింది.
అయితే రెండూ వాయిదా పడ్డాయి. ‘‘గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ‘టోటల్ ధమాల్’ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అలాగే ఇదే తేదీకి రిలీజ్ చేస్తామని చెప్పిన ‘దే దే ప్యార్ దే’ సినిమాను ఏప్రిల్ 26న విడుదల చేయాలనుకుంటున్నాం’’అని అజయ్ దేవగన్ తెలిపారు. ఇంద్రకుమార్ దర్శకత్వంలో ధమాల్ ఫ్రాంౖచైజీలో వస్తోన్న థర్డ్ పార్ట్ ‘టోటల్ ధమాల్’. ‘దే దే ప్యార్ దే’ సినిమాకు లవ్ రంజన్ దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment