
అజయ్ వల్లే ఒంటరిగా మిగిలిపోయాను: నటి
మీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించగా స్పందించిన టబూ ‘నేను ఈ రోజు ఒంటిరిగా ఉండిపోవాల్సి వచ్చిందంటే అందుకు అజయ్ దేవగన్ మా కజిన్ కారణం. నాతో ఏ అబ్బాయి అయినా మాట్లాడినట్లు కనిపిస్తే అతడిని కొడతామని హెచ్చరించేవారు. దాంతో నేను ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వారు అలా అప్పుడు చేసిన పనికి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పటికీ నేను అజయ్‌కు చెప్పాను.. పెళ్లి చేసుకునేందుకు నా కోసం ఓ అబ్బాయిని వెతికి పెట్టమని’ అంటూ ఆమె సరదాగా చెప్పుకొచ్చారు. ఇది వరకే విజయపథ్, దృశ్యం వంటి చిత్రాల్లో అజయ్‌తో కలిసి టబూ నటించిన విషయం తెలిసిందే.