
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘భోలా’. అజయ్ దేవగన్ ఫిలిమ్స్, టీ–సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్ర చేస్తున్నారు.
ఆమె చేస్తున్న పోలీస్ ఆఫీసర్ లుక్‌ని అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘ఏక్ ఖాకీ.. సౌ సైతాన్స్’(ఒక పోలీసు.. వంద మంది దెయ్యాలు) అంటూ రాసుకొచ్చారు. పోలీస్ డ్రెస్, చేతిలో గన్‌తో టబు పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘భోలా’ తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది.
Ek khaaki. Sau shaitaan.#TabuInBholaa #Bholaain3D #Tabu pic.twitter.com/W5wLWqENyQ
— Ajay Devgn (@ajaydevgn) January 17, 2023