సాక్షి, సినిమా: నటి టబు తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆయనే అంటోంది. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలోనూ బహుళ పాచుర్యం పొందింది. టబుకి ప్రస్తుతం 46 ఏళ్లు. ఇంకా అవివాహితనే. పెళ్లి చేసుకోకపోవడానికి కారణాన్ని ఇటీవల ఒక భేటీలో చెబుతూ.. నేనిప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నాను. అయితే ఇలా ఉండటం వల్ల ప్రతి నిమిషం నాకు సంతోషంగానే ఉంది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని గడపడం మంచిదా.? ఒంటరిగా గడపడం మంచిదా.? అని అడుగుతున్నారు. అయితే నాకు ఒక వైపు జీవితం గురించే తెలుసు. పెళ్లి చేసుకోకపోవడంతో మరో వైపు జీవితానుభవం తెలియదు. అందువల్ల ఆ ప్రశ్నకు నేనెలా జవాబు చెప్పగలను. నేను వివాహం చేసుకుని ఉంటే ఏది సంతోషకరమైన జీవితమో చెప్పేదాన్నని సమాధానమిచ్చారు.
నాకు వివాహం జరగక పోవడానికి నటుడు అజయ్ దేవ్‌గన్ కారణం. తను నా సోదరుడుకి (దగ్గర బంధువు) మిత్రుడు. నా జీవిత ఆరంభం నుంచే అజయ్ నాతో కలిసి ఉన్నాడు. మేమిద్దరం 25 ఏళ్లు స్నేహితులుగా మెలిగాం. అజయ్ దేవ్‌గన్ కారణంగానే నేను వివాహం చేసుకోలేదు. అందుకు నాకు బాధ లేదని నటి టబు పేర్కొన్నారు. ఈ అమ్మడు హిందిలో అజయ్ దేవ్‌గన్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించింది. అజయ్‌దేవ్‌గన్ నటి కాజోల్‌ను 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment