ఓటీటీలో భారీ డిజాస్టర్‌ సినిమా.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా..? | Auron Mein Kahan Dum Tha Movie Now Streaming In OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో భారీ డిజాస్టర్‌ సినిమా.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా..?

Published Fri, Sep 13 2024 3:34 PM | Last Updated on Fri, Sep 13 2024 3:50 PM

Auron Mein Kahan Dum Tha Movie Now Streaming In OTT

అజయ్ దేవగన్, టబు నటించిన బాలీవుడ్‌ సినిమా ' ఔరో మే కహా దమ్ థా' ఓటీటీలో విడుదలైంది. ఆగష్టు 2న విడుదలైన ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా నీరజ్‌ పాండే తెరకెక్కించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో శీతల్ భాటియా, నరేంద్ర హిరావత్, సంగీతా అహిర్, కుమార్ మంగత్ సంయుక్తంగా నిర్మించారు. పనోరమా స్టూడియోస్ ఈ చిత్రాన్ని పంపిణీ చేసింది. అయితే, సినిమా భారీ డిజాస్టర్‌ కావడంతో నిర్మాతలు నష్టాలను మిగిల్చింది.

ఇదీ చదవండి:   ఓటీటీలో అడ్వెంచర్ థ్రిల్లర్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

'ఔరో మే కహా దమ్ థా' సినిమాను ఎలాంటి ప్రకటన లేకుండానే సెప్టెంబర్‌ 13న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలోకి తీసుకొచ్చింది. అయితే, ఈ సినిమాను చూడాలంటే భారీ మొత్తంలో రెంట్‌ చెల్లించాలి. అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులు ఈ సినిమాను చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. థియేటర్‌లో భారీ డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి అధిక మొత్తంలో రెంట్‌ పెట్టడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

అగష్టు 2న విడుదలైన తొలి ఆట నుంచే సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది. కనీసం  రూ.2 కోట్ల కూడా  ఓపెనింగ్స్ రాలేదు. బాలీవుడ్‌లో ఈ ఏడాది భారీ డిజాస్టర్‌ చిత్రాల లిస్ట్‌లో  ' ఔరో మే కహా దమ్ థా' ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వాణిజ్య పరంగా నిర్మాతలు,పంపిణీదారులకు సుమారు రూ. 150 కోట్ల వరకు నష్టం మిగిల్చిందని ప్రచారం ఉంది. ఫైనల్‌గా ఈ చిత్రం రూ. 12.91 కోట్ల కలెక్షన్స్‌ మాత్రమే రాబట్టింది. అయితే, ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement