Ajay Devgan's Drishyam 2 OTT Release Date, OTT Platform - Sakshi
Sakshi News home page

Drishyam 2 Movie: బాక్సాఫీస్‌ను దున్నేసిన దృశ్యం 2 ఓటీటీలోకి, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Fri, Jan 13 2023 4:59 PM | Last Updated on Fri, Jan 13 2023 6:23 PM

Amazon Prime Video Announces Ajay Devgn Drishyam 2 Movie OTT Release Date - Sakshi

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌, హీరోయిన్‌ శ్రియ జంటగా నటించిన చిత్రం దృశ్యం 2. మలయాళ సూపర్‌ హిట్‌ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టబు, ఇషితా దత్తా, అక్షయ్‌ ఖన్నా, రజత్‌ కపూర్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. అభిషేక్‌ పాఠక్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా తాజాగా ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పించింది.

ఈ విషయంపై అజయ్‌ దేవ్‌గణ్‌ మాట్లాడుతూ.. 'మా సినిమాను థియేటర్లలో ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌ ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్న ప్రేక్షకుడైనా ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. కాగా దృశ్యం చిత్రాన్ని దివంగత డైరెక్టర్‌ నిషికాంత్‌ కామత్‌ తెరకెక్కించగా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వచ్చిన ఏడేళ్లకు సీక్వెల్‌ రాగా ఇది కూడా సూపర్‌ డూపర్‌ హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లదాకా కలెక్షన్లు రాబట్టింది.

చదవండి: ఇడియట్‌, వెళ్లు.. అంటూ నా భార్య ముందే నాన్న కోప్పడ్డారు: రామ్‌చరణ్‌
నటుడితో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement