కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు
కోదాడ రూరల్: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు (87) శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతిచెందారు. రామలక్ష్మీపురం సింహయ్యగా పిలిపించుకునే కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు అప్పట్లోనే ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేసి కొన్నాళ్లు హిందు పత్రికలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు.
కోదాడ నియోజకవర్గ పరిధిలోని గణపరం రామలక్ష్మీపురంలో జన్మించిన ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా జైలుకెళ్లి వచ్చారు. అదేవిధంగా కోదాడ, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి అక్కిరాజు వాసుదేవరావుగా సమీప బంధువు. విద్యార్థి దశ నుంచే క్రియాశీలక రాజకీయాల్లో పనిచేశారు. ఆయన మృతికి టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు విరేపల్లి లక్ష్మీనారాయణరావు, వేనేపల్లి చందర్‌రావు, ఉత్తమ్ పద్మావతి, నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం నాయకులు కొండపల్లి వాసుదేవరావు, కొండపల్లి మురళీధర్‌రావు, విద్యాత్తవేత్తలు మంత్రిపగఢ భరతరావు, శ్రీరామకవచం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తమ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.
చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల
చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment