'మేం బయటపెడతాం.. కానీ టైం కావాలి' | Britain Seeks More Time to Decide on Declassifying Netaji Files | Sakshi
Sakshi News home page

'మేం బయటపెడతాం.. కానీ టైం కావాలి'

Published Sun, Oct 4 2015 5:37 PM | Last Updated on Sat, Oct 20 2018 7:32 PM

'మేం బయటపెడతాం.. కానీ టైం కావాలి' - Sakshi

'మేం బయటపెడతాం.. కానీ టైం కావాలి'

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివరాలకు సంబంధించి తమవద్ద ఉన్న ఫైళ్లు బహిర్గతం చేసేందుకు మరింత గడువుకావాలని బ్రిటన్ కోరింది. ఈ విషయాన్ని బోస్ కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. 1945 తర్వాత బోస్ కనిపించకపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బోస్కు సంబంధించిన వివరాలతో ఉన్న దస్త్రాలు అన్నింటిని బయటపెట్టాలని ఇటీవల బోస్ కుటుంబ సభ్యులు బ్రిటన్ అధికారులను కలిశారు.

'మా సోదరి మాధురి బోస్ బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. దానికి వారు పలు విధాలుగా బదులిచ్చారు. అయితే, ఫైళ్లను బహిర్గతం చేసే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కోరారు' అని నేతాజీ ముని మేనల్లుడు సూర్య కుమార్ బోస్ తెలిపారు. గత కొద్ది రోజులుగా నేతాజీ అకస్మికంగా కనిపించకపోవడం వెనుక ఉన్న రహస్యాలను చేదించేందుకు రష్యా, జపాన్, అమెరికాలోని బోస్కు చెందిన పైళ్లను బయటపెట్టాల్సిందిగా కోరుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement