Declassify
-
నేతజీ రహస్య పత్రాలు బహిర్గతం
-
బహిర్గతం కానున్న రహస్య పత్రాలు
-
నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్న మోదీ
న్యూ ఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిర్గతం చేయనున్నారు. జనవరి 23న బోస్ జయంతి సందర్భంగా ప్రధాని ఈ రహాస్య ఫైళ్లను వెల్లడించనున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం ప్రకటించారు. నేతాజీ కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గత అక్టోబర్‌లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా నేతాజీ రహస్య ఫైళ్లను వెల్లడిస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మమతా బెనర్జి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అయితే ప్రధాని బహిర్గతం చేయనున్న సమాచారంలో నేతాజీ అదృష్యానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
'మేం బయటపెడతాం.. కానీ టైం కావాలి'
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివరాలకు సంబంధించి తమవద్ద ఉన్న ఫైళ్లు బహిర్గతం చేసేందుకు మరింత గడువుకావాలని బ్రిటన్ కోరింది. ఈ విషయాన్ని బోస్ కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. 1945 తర్వాత బోస్ కనిపించకపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బోస్‌కు సంబంధించిన వివరాలతో ఉన్న దస్త్రాలు అన్నింటిని బయటపెట్టాలని ఇటీవల బోస్ కుటుంబ సభ్యులు బ్రిటన్ అధికారులను కలిశారు. 'మా సోదరి మాధురి బోస్ బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. దానికి వారు పలు విధాలుగా బదులిచ్చారు. అయితే, ఫైళ్లను బహిర్గతం చేసే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కోరారు' అని నేతాజీ ముని మేనల్లుడు సూర్య కుమార్ బోస్ తెలిపారు. గత కొద్ది రోజులుగా నేతాజీ అకస్మికంగా కనిపించకపోవడం వెనుక ఉన్న రహస్యాలను చేదించేందుకు రష్యా, జపాన్, అమెరికాలోని బోస్‌కు చెందిన పైళ్లను బయటపెట్టాల్సిందిగా కోరుతున్న విషయం తెలిసిందే.