నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిర్గతం చేయనున్నారు.
న్యూ ఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిర్గతం చేయనున్నారు. జనవరి 23న బోస్ జయంతి సందర్భంగా ప్రధాని ఈ రహాస్య ఫైళ్లను వెల్లడించనున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం ప్రకటించారు. నేతాజీ కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
గత అక్టోబర్లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా నేతాజీ రహస్య ఫైళ్లను వెల్లడిస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మమతా బెనర్జి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అయితే ప్రధాని బహిర్గతం చేయనున్న సమాచారంలో నేతాజీ అదృష్యానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.