తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: మోదీ | PM Narendra Modi Pays Tribute Gidugu Ramamurthy His Birth Anniversary | Sakshi
Sakshi News home page

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: మోదీ

Aug 29 2020 6:56 PM | Updated on Aug 29 2020 7:53 PM

PM Narendra Modi Pays Tribute Gidugu Ramamurthy His Birth Anniversary - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ఉత్తరాంధ్ర బిడ్డ గిడుగు రామ్మూర్తి జయంతి. ఈ సందర్భంగా ప్రధాని నర్రేంద మోదీ.. ‘తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. (గొప్ప భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్‌)

మన్‌ కీ బాత్‌:
అదే విధంగా రేపు(ఆదివారం) మన్‌ కీ బాత్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11గంటలకు జరనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రేడియోలో మాట్లాడనున్నారు. జాతని ఉద్దేశించి ఆయన పలు అంశాలపై ప్రసంగించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement