
మీతోనే వస్తానంటే.. నేతాజీ వద్దన్నారు
నేను మీతోనే వస్తాను....వద్దు... నీవు వెనక్కి వెళ్లు... మిగతా వాళ్ల సంగతి చూడు అంటూ భారత స్వాతంత్ర్య సమర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ తనను ఆదేశించారు...
అజాంగఢ్: నేను మీతోనే వస్తాను....వద్దు... నీవు వెనక్కి వెళ్లు... మిగతా వాళ్ల సంగతి చూడు అంటూ భారత స్వాతంత్ర్య సమర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ తనను ఆదేశించారు.... ఆయన అజ్ఞని శిరసా వహించానని నేతాజీ సన్నిహిత సహచరుడు నిజాముద్దీన్ తెలిపారు. సోమవారం ఉత్తరప్రదేశ్ అజాంగఢ్ జిల్లాలోని దుక్వాలో 114 ఏళ్ల నిజాముద్దీన్ను నేతాజీ సమీప బంధువు రాజశ్రీ చౌదరి కలిశారు.
నేతాజీతో తనకు గల అనుబంధాన్ని నిజాముద్దీన్ ఈ సందర్భంగా నెమరేసుకున్నారు. బర్మా - థాయలాండ్ సరిహద్దు సమీపంలో సితంగ్పూర్ నది వద్ద ఆయన్ని దింపానని... ఆ తర్వాత మళ్లీ ఆయన్ని కలుసుకోలేక పోయానని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా తాను మీతోనే వస్తానంటూ నేతాజీపై విధంగా స్పందించారన్నారు. నేతాజీని కడసారి అప్పుడే చూశానని చెప్పారు. ఆ తర్వాత ఆయన్ని మళ్లీ జీవితంలో చూడలేకపోయాన్నారు. నిజాముద్దీని స్వహాస్తాలతో తన తలను నిమిరి ఆశీర్వదించారని రాజశ్రీ తెలిపారు.