Nizamuddin
-
11 మంది మహిళలు.. లడ్డుతో వ్యాపారం మొదలుపెట్టి.. ఏకంగా కార్పొరేట్ హోటళ్లలో..
‘ఐదువేళ్లు ఒక్కటైతే ఐకమత్యం, బలం’ అని చిన్నప్పటి పాఠాల్లో చదువుకున్నాం. బతుకు పాఠాల్లో అది ముఖ్యమైన పాఠం. పదకొండు మంది మహిళలు ఒకేమాట మీద నిలబడి ఐక్యత సాధించడమే కాదు... జీవితం హాయిగా సాగిపోవడానికి అవసరమైన బాటను నిర్మించుకున్నారు... దేశరాజధాని దిల్లీలో నిజాముద్దీన్ బస్తీ అని ఉంది. ఈ బస్తీని బస్తీ అనడం కంటే ‘రుచుల ఖజానా’ అనడం సబబు. ఏడువందల ఏళ్ల నాటి పాకశాస్త్ర ప్రావీణ్య పాఠాలకు ఈ గల్లీ ప్రసిద్ధి పొందింది. ఖమిరీ రోటీ నుంచి కబాబుల వరకు నోరూరించే బస్తీ ఇది.దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు ఇక్కడ నివసించడం వల్ల భిన్నమైన వంటల రుచుల సమ్మేళనానికి వేదికగా మారింది. దిల్లీలోని భోజనప్రియులు ఒక్కసారైనా సరే ఈ గల్లీకి రావాల్సిందే. ‘జైకా’ రాకతో గల్లీకి కొత్త రుచుల కళ వచ్చింది.దిల్లీలో చిన్నాచితకా పనులు చేసుకునే పదకొండుమంది మహిళలు ఒక గ్రూప్‌గా ఏర్పడి ‘జైకా–ఏ–నిజాముద్దీన్’ పేరుతో వంటల వ్యాపారంలోకి దిగారు. ‘ఆరోగ్యాన్ని పాడు చేసే చిరుతిండ్లకు ప్రత్యామ్నాయంగా పోషక విలువలతో కూడిన తిండి’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.లడ్డుతో వ్యాపారం మొదలుపెట్టారు. తియ్యటి విజయం సొంతం అయింది. ‘లడ్డూ కావాలా నాయనా’ అని ఒకరినొకరు ఊరించుకోవడం మొదలైంది. లడ్డు విజయం ఇచ్చిన ఉత్సాహం లో నిహరి, షమి కబాబ్, ఖీమా ఖరేలా, షిల్లమ్ గోష్... మొదలైన 50 ఐటమ్స్ తయారీలోకి దిగారు. అవి హాటెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్‌గా మారడానికి ఎంతో కాలం పట్టలేదు.ఈ ఉత్సాహంతో క్యాటరింగ్ వింగ్ మొదలు పెట్టారు. హోమ్ డెలివరీ, లైవ్కౌంటర్, కార్పోరేట్ ఆఫీసుల ఆర్డర్లతో వ్యాపారం నాన్–స్టాప్ స్పీడ్ అందుకుంది.‘జైకా’లో పనిచేసే పదకొండుమంది మహిళలు స్టార్‌హోటళ్లలో చెఫ్‌ల మాదిరిగానే యూనిఫాం ధరిస్తారు.తమ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలలో ఫండ్ ఏర్పాటు చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం సభ్యులు ఇందులో నుంచి వడ్డీ లేని రుణాలు తీసుకోవచ్చు. విశేషం ఏమిటంటే, దేశంలోని కార్పోరేట్ హోటళ్లలో ‘గెస్ట్ చెఫ్’గా వీరు గౌరవాన్ని అందుకుంటున్నారు. ‘మాకు ఇంకా ఎన్నో కలలు ఉన్నాయి’ అంటుంది బృందంలో సభ్యురాలైన నూర్జహాన్. చదవండి: Blood Washing: ‘బ్లడ్‌వాషింగ్’ అంటే?: విదేశాల్లో బ్లడ్వాషింగ్కు పాల్పడుతున్న కోవిడ్ బాధితులు! -
పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్
-
పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్: రెండు ప్రాణాలు బలి
న్యూఢిల్లీ: పెరోల్ మీద విడుదల అయిన ఓ రౌడీ షీటర్ కాల్పులకు పాల్పడ్డాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే తన భార్యతో పాటు మరొకరిని దారుణంగా తుపాకీతో కాల్చి హత్య చేశాడు.ఈ ఘటనలో ఓ నిండు గర్భిణి, యువకుడు మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని దక్షిణ నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన డ్రగ్ డీలర్ షరాఫత్ షేక జైలుకు వెళ్లాడు. మూడు రోజుల కిందట పెరోల్‌పై విడుదల అయ్యాడు. వచ్చి రాగానే తన భార్య ఎక్కడుందో ఆచూకీ తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్లాడు ఈ క్రమంలో మంగళవారం భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు షెరాఫత్. బయట కూర్చున్న భార్య షైనాతో కొద్దిసేపు మాట్లాడి ఆ వెంటనే తనతో తెచ్చుకున్న తుపాకీతో మొదట కాల్చాడు. అయితే పక్కన ఉన్న ఆమె సహాయకుడు వెంటనే షఫత్‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు. దీంతో షఫత్ అతడిపై కూడా కాల్పులు జరిపాడు. అనంతరం భార్యపై మళ్లీ నాలుగు, ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆమె చనిపోయేదాక తుపాకీతో పేలుస్తూనే ఉన్నాడు. అడ్డుకోబోయిన వారిని తుపాకీతో బెదిరించాడు. తుపాకీ తూటాలకు బలయిన భార్య షైనా నిండు గర్భిణి. ఇంత కర్కషంగా.. విచక్షణా రహితంగా గర్భిణి అయిన తన భార్యను హతమార్చడం కలకలం రేపింది. అయితే కాపాడేందుకు వచ్చిన వారంతా ప్రాణభయంతో వెనక్కి తిరిగారు. వారిద్దరినీ కాల్చిన అనంతరం దర్జాగా అతడు వెళ్లిపోయాడు. ఇదంతా ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: మే 2 తర్వాతనే కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం? చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ -
మర్కజ్లో ప్రార్థనలకు అనుమతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 50 మంది ప్రజలు రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అయితే, కరోనా నేపథ్యంలో ప్రార్థనా స్థలాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(డీడీఎంఏ) జారీ చేసిన నోటిఫికేషన్లో లేదని వివరించింది. చాలా వరకు ప్రార్థనాస్థలాలు తెరిచే ఉంటున్నాయని పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపింది. డీడీఎంఏ ఈనెల 10వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్, ఇతర ప్రామాణిక కార్యాచరణ నిబంధనలకు లోబడి తమ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ రంజాన్ నెలలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంగణంలోని బంగ్లేవాలీ మసీదులోని బేస్మెంట్ పైనున్న మొదటి అంతస్తులో 50 మందికి రోజుకు 5 పర్యాయాలు నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలని జస్టిస్ ముక్తా గుప్తా నిజాముద్దీన్ పోలీసులను ఆదేశించారు. డీడీఎంఏ ఉత్తర్వులతోపాటు, సామాజిక, మత, రాజకీయ, ఉత్సవ సంబంధ సమావేశాలను, ప్రజలు గుమికూడటాన్ని అనుమతించే విషయంలో అఫిడవిట్ సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, మరింత మందిని అనుమతించాలనీ, మసీదులోని ఇతర అంతస్తుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తరఫున న్యాయవాది రమేశ్‌గుప్తా కోరగా కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా కోర్టు నిరాకరించింది. ఈ మేరకు నిజాముద్దీన్ ఎస్‌హెచ్‌వోకు దరఖాస్తు చేసుకోవచ్చనీ, దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఇలా ఉండగా, కరోనా లాక్డౌన్ అమల్లో ఉండగా వేలాదిమందితో తబ్లిగీ జమాత్ నిర్వహించిన ఆరోపణలపై గత ఏడాది మార్చి 31వ తేదీ నుంచి మూతబడి ఉన్న నిజాముద్దీన్ మర్కజ్‌ను తిరిగి తెరిచేందుకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై జూలై 15వ తేదీన విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. చదవండి: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ -
తబ్లిగీ జమాత్ సభ్యులకు కేంద్రం షాక్!
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా భారత్‌లో ప్రవేశించిన దాదాపు 960 మంది తబ్లిగీ జమాత్ విదేశీ సభ్యులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాకినట్లు తెలుస్తోంది. పదేళ్లపాటు దేశంలోకి సదరు వ్యక్తుల ప్రయాణాలపై నిషేధం విధించి.. బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు సమాచారం. వీరిలో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా ప్రాణాంతక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వేలాది మంది హాజరుకావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరిలో అత్యధికులకు మహమ్మారి సోకడం సహా వారంతా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన నేపథ్యంలో.. తబ్లిగీల ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (వైరల్: జమాతే సభ్యులపై డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు) ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. అదే విధంగా దాదాపు 67 దేశాల నుంచి టూరిస్టు వీసా మీద భారత్‌కు వచ్చి మతపరమైన సమావేశంలో పాల్గొని వీసా నిబంధలను ఉల్లంఘించిన విదేశీయులపై కూడా కేసులు నమోదయ్యాయి. అంతేగాక గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు మళ్లించినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మౌలానాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో మౌలానాకు అత్యంత సన్నిహితులు, ముఖ్య అనుచరులుగా భావిస్తున్న ఐదుగురి పాస్‌పోర్టులను సీజ్ చేసి విచారణ వేగవంతం చేశారు.(తబ్లీగ్ జమాత్ చీఫ్‌పై సీబీఐ దర్యాప్తు) -
తబ్లిగీ జామత్ కేసులో వారిపై చార్జిషీట్!
సాక్షి, న్యూఢిల్లీ: తబ్లీగి జమాత్ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం 82 మంది విదేశీయులపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని నిజాముద్దీన్‌లో తబ్లీగి మసీదుకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే భారతదేశంలో కరోనా కేసులు వేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే పలు సాక్ష్యాధారాలతో ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. 15,449 పేజీలు ఉన్న ఈ చార్జ్‌షీట్‌ను జూన్ 12న పరిశీలించనున్నారు. ఈ చార్జ్‌షీట్‌లో 14 మంది ఫిజీ నుంచి వచ్చినవారు, 10 మంది సౌదీ అరేబియా, 8 మంది అల్జీరియా, ఏడుగురు బ్రెజిల్, చైనా, ఆరుగురు సూడాన్, ఫిలిఫైన్స్, అమెరికా నుంచి ఐదుగురు వేరే దేశాలకు చెందిన మరికొందరూ ఉన్నారు. దీనికి సంబంధించి మరో 14 చార్జీషీట్లను కూడా త్వరలో ఫైల్ చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారందరిపై ఫారినర్స్ యాక్ట్ 1946 సెక్షన్ 14(బి) కింద చార్జ్‌షీట్ ఫైల్ చేసినట్లు తెలిపారు. వీరందరిపై వీసా నిబంధనలు ఉల్లంఘించినందకు కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. (భారత్‌పై నేపాల్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు) కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న వేళ.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ భవనంలో తబ్లీగీ జమాత్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మత ప్రార్థనలు నిర్వహించారు. ఎక్కువ మంది మర్కజ్ భవనంలో గుమి గూడిన కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి జరిగింది. దీంతో దేశంలో కనీసం 30 శాతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వారిపై కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం) -
కరోనా: అతడిని ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ : తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కుమారుడిని ఢిల్లీ క్రైమ్ బబ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు. మంగళవారం రెండు గంటల పాటు అతడిని ప్రశ్నించినట్టు ‘హిందూస్తాన్ టైమ్స్’ వెల్లడించింది. నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌వద్ద పనిచేసిన 20 మంది ఆచూకీ అడిగినట్టు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన తర్వాత జమాత్‌కు వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ 20 మంది కనిపించకుండా పోయారు. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా వీరి గురించి పోలీసులకు తెలిసింది. వీరి ఫోన్ రికార్డులు, ఇమెయిల్‌ల ద్వారా కీలక సమాచారాన్ని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం. (3,900 కేసులు.. 195 మరణాలు) జమాత్ కార్యకలాపాల్లో మౌలానా సాద్ కుమారుడి ప్రమేయం ఉన్నందున పోలీసులు అతడిని విచారించారు. జమాత్ ప్రధాన కార్యాలయం కార్యకలాపాల గురించి, అక్కడ పనిచేసే సిబ్బంది గురించి పోలీసులు ఆరా తీసినట్టు తెలిసింది. మౌలానా సాద్‌కు మరోసారి కరోనా నిర్థారిత పరీక్షలు నిర్వహించాలని అతడిని పోలీసులు ఆదేశించినట్టు సమాచారం. దేశంలో కరోనా ఎక్కువగా వ్యాపించడానికి మార్చిలో నిర్వహించిన జమాత్ కారణమైందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులకు మౌలానా సాద్ పూర్తిగా సహకరిస్తున్నారని, మర్కజ్లో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగడం లేదని ఆయన తరపు న్యాయవాది ఇంతకుముందు ప్రకటించారు. (ఫేక్ న్యూస్: అతడి సొమ్ములు సేఫ్) -
జమాతే ప్రార్థనలు: మొత్తం సంఖ్య ఎంతో తెలుసా!
న్యూఢిల్లీ: తబ్లిగీ జమాతే ప్రార్థనల్లో పాల్గొన్నవారి మొత్తం సంఖ్య 16,500 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో మార్చి 13 నుంచి 24 వరకు జరిగిన ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దాంతో వారు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో మరికొంత మంది వైరస్ బారినపడ్డారు. ఇక జమాతే హెడ్ క్వార్టర్స్ మర్కజ్ మసీదును ఆయా తేదీల్లో సందర్శించిన వారిని సెల్‌ఫోన్ డేటా ఆధారంగా గుర్తించామని జమాతే విచారణలో భాగమైన ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ప్రార్థనల్లో పాల్గొన్న 16,500 మందిని గుర్తించడానికి భారీ కసరత్తు చేశామని తెలిపారు. (చదవండి: 30% కేసులకు మర్కజ్ లింక్) ప్రార్థనల్లో పాల్గొన్నవారితో కాంటాక్ట్ అయిన 15 వేల మంది వివరాలు సేకరించడానికి బాగా శ్రమించాల్సి వచ్చిందన్నారు. వారందరినీ ట్రేస్ చేయడానికి అన్ని రకాల పోలీసుల సేవలను వినియోగించుకున్నామని చెప్పారు. ఇక మార్చి 24న నుంచి అమల్లో కొచ్చిన లాక్‌డౌన్‌తో కొందరు మర్కజ్‌లోనే చిక్కుకుపోవడంతో.. మార్చి 29 నుంచి 31 వరకు ఢిల్లీ పోలీసులు అక్కడున్న 2300 మందిని ఖాళీ చేయించారు. ఇక దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 30 శాంత కేసులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మర్కజ్‌తో ముడిపడి ఉన్నవే కావడం గమనార్హం. కాగా, తబ్లిగీ జమాతే కార్యక్రమాన్ని లాక్డౌన్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించడంపై జమాతే చీఫ్ మౌలానా సాద్‌పై కేసు నమోదైన విషయం విదితమే. ఇప్పటికే సాద్‌పై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. ఆ సమ్మేళనానికి విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వారా విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. (చదవండి: తబ్లిగీ జమాత్ చీఫ్‌కు ఐదోసారి నోటీసులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
30% కేసులకు మర్కజ్ లింక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు నమోదైన 14,792 కరోనా పాజిటివ్ కేసుల్లో మర్కజ్ ఘటనతో సంబంధమున్నవే 4 వేల పైచిలుకు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇలాంటి కేసులున్నట్లు పేర్కొంది. కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మార్చిలో జరిగిన మత పరమైన కార్యక్రమంతో సంబంధమున్న 4,291 కేసుల్లో అత్యధికంగా తమిళనాడు(84%), తెలంగాణ (79%), ఢిల్లీ(63%), ఉత్తరప్రదేశ్(59%), ఆంధ్రప్రదేశ్(61%)ల్లోనే ఉన్నాయని వివరించారు. మొత్తం కేసుల్లో ఇవి 29.8% వరకు ఉన్నట్లు తెలిపారు. తక్కువ సంఖ్యలో నమోదైన రాష్ట్రాల్లోనూ మర్కజ్ ఘటనతో లింకులున్న కేసులున్నాయన్నారు. అస్సాంలో నమోదైన 35 కేసుల్లో 32, అండమాన్ దీవుల్లోని 12 కేసుల్లో 10 ఈ కార్యక్రమంతో సంబంధమున్నట్లు తేలిందని చెప్పారు. ఇక గడిచిన 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకాని 47 జిల్లాల్లో ఏపీలోని విశాఖపట్టణం ఉంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య శనివారానికి 488కి, పాజిటివ్ కేసులు 14,792కి చేరుకున్నాయి. దేశం మొత్తమ్మీద యాక్టివ్ కేసులు 11,906 కాగా 1,992 మంది ఇప్పటి వరకు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు కొత్తగా 991 నమోదు కాగా, 43 మంది మరణించారని ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 12 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఏడుగురు, ఢిల్లీలో నలుగురు, గుజరాత్లో ముగ్గురు, జమ్మూకశ్మీర్, బిహార్లలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు తెలిపింది. మరణాల రేటు 3.3 శాతం దేశంలో కోవిడ్ మరణాల రేటు 3.3%గా ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు. ఇందులో 0–45 ఏళ్ల గ్రూపులో 14.4%, 45–60 ఏళ్ల వారు 10.3%, 60–75 ఏళ్ల వారు 33.1%, 75 ఆపైన వయస్సు వారిలో 42.2% అని తెలిపారు. మొత్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారిలో 75.3% మంది 60 ఏళ్లు, ఆపై వారేనన్నారు. 83% మరణాలకు ఇతర ఆరోగ్య సమస్యలూ కారణం. మహారాష్ట్రలో అత్యధికం కరోనా సంబంధిత మరణాలు ఇప్పటిదాకా 488 కాగా, మహారాష్ట్రలో∙201 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (69), ఢిల్లీ (42), గుజరాత్ (48) ఉన్నాయి. తమిళనాడులో 15 మంది, పంజాబ్‌లో 13 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14 మంది, కర్ణాటకలో 13 మంది చనిపోయారు. కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 3,323 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ (1,707), తమిళనాడు (1,323), మధ్యప్రదేశ్ (1,310) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 100 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. ► రాజస్తాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన 3 వేల మంది విద్యార్థులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంపిన 100 బస్సుల్లో వారి స్వస్థలాకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ► కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించిన జహంగీర్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఢిల్లీ సీఎం తెలిపారు. ► రాష్ట్రంలోని 12 లక్షల మంది భవన నిర్మాణ నిర్మాణ కార్మికులకు రూ.2వేల చొప్పున అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అత్యవసర సహాయ కేంద్రాలు లాక్డౌన్ కారణంగా తలెత్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని జిల్లాల్లో అత్యవసర సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయని హోంశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీవాస్తవ తెలిపారు. హోం శాఖ ఏర్పాటు చేసిన 1930, 944 హెల్ప్‌లైన్ నంబర్లు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. గర్భిణులు, వృద్ధులు, ప్రత్యేక అంగవికలురకు అత్యవసర సేవలందించేందుకు 112 నంబర్ అందుబాటులో ఉందని, 112 మొబైల్ యాప్ ద్వారా ఫోన్ కాల్ లొకేషన్ గుర్తించవచ్చని వివరించారు. లాక్‌డౌన్‌పై అమిత్ షా సమీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్, అత్యవసర వస్తువుల అందుబాటుపై హోం మంత్రి అమిత్ షా శనివారం సమీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు సాయపడేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. -
తబ్లిగీ : రోహింగ్యాల వేటలో పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీలోని నిజాముద్దీన్ జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేంద్రం హెచ్చరికలతో హైదరాబాద్ పరిధిలోని రోహింగ్యాల వివరాలను రాష్ట్ర పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 6040 మంది రోహింగ్యాల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 వేల మంది రోహింగ్యాలు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1000 మంది.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది రోహింగ్యాలు ఉన్నట్లు నివేదికలో తేలింది. వీరిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్‌లో జరిగిన మత ప్రార్థనలలో పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. (ఆ రోహింగ్యాలు ఎక్కడ?) ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్యాంపు నుంచి వెళ్లిన రోహింగ్యాల కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్న రోహింగ్యాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మర్కజ్ యాత్రకు ఎవరైనా వెళ్ళారా? వారు మళ్లీ తిరిగి వచ్చారా?అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారుంటే స్వచ్చందంగా వైద్య పరీక్షలు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా స్వచ్చందంగా బయటకు రాకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దేవ్‌బంద్: అసలేం జరిగింది..?
సాక్షి, హైదరాబాద్: మొన్నటిదాకా ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్కి వెళ్లొచ్చిన వారందరినీ నానా తంటాలు పడి వెతికిపట్టుకున్న పోలీసులకు మరో చిక్కు వచ్చి పడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లింఆధ్యాత్మిక ఉద్యమానికి కేంద్రంగా ఉన్న దేవ్‌బంద్‌కి వెళ్లిన వారిలోనూ కరోనా లక్షణాలు వెలుగుచూడటం, వారికి మర్కజ్‌తో లింకులు బయటపడటంతో ఖాకీలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎవరెవరు దేవ్‌బంద్‌కి వెళ్లారు? వారిలో ఎందరు అక్కడ నుంచి మర్కజ్ వెళ్లారో తెలుసుకునే పనిలో పడ్డారు. నిర్మల్‌లో ఇలాంటి వారిని ముగ్గురిని గుర్తించారు. వీరిలో ఒకరికి కరోనా రావడంతో మరోసారి కలకలం రేగింది. దాదాపు పది మంది వరకు నిర్మల్ నుంచి దేవ్‌బంద్‌కి వెళ్లారని సమాచారం. దీంతో పోలీసులు వాళ్లని వెతికే పనిలో పడ్డారు. అసలేం జరిగింది..? మార్చి మొదటి వారంలో నిర్మల్ నుంచి దేవ్‌బంద్‌కి దాదాపు 10 మందికి పైగా వెళ్లినట్లు సమాచారం. వీరిలో కొందరు మర్కజ్ వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలాలకు వచ్చారు. ఇక్కడ జరుగుతున్న హడావుడి చూసి తాము మర్కజ్కి వెళ్లి వచ్చామన్న విషయం తెలిస్తే.. అరెస్టు చేస్తారన్న భయంతో ఆ విషయాన్ని దాచిపెట్టారు. తాము వెళ్లి వచ్చింది యూపీలోని దేవ్‌బంద్‌కి అని మాత్రమే వెల్లడించారు. ఇటీవల స్థానికంగా ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దేవ్‌బంద్‌కి వెళ్లి వచ్చినవారు సైతం వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో జిల్లాకు చెందిన అత్యున్నత అధికారి, మరో పోలీసు ఉన్నతాధికారి కూడా వీరితో సమావేశమయ్యారు. ఈలోపు ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నుంచి రాష్ట్ర పోలీసులకు నిర్మల్ నుంచి దేవ్‌బంద్‌కి వెళ్లిన వారు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారన్న సమాచారం వచ్చింది. దీంతో వీరిలో ముగ్గురికి పరీక్షలు చేయగా, ఒకరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన వారిని క్వారంటైన్‌కు తరలించారు. ఎలా తెలిసింది..? మర్కజ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో రంగంలోకి దిగిన నిఘా బృందాలు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి సెల్‌ఫోన్ నంబర్లు సేకరించాయి. వారి సెల్‌ఫోన్ నంబర్లు, వాటి సిగ్నల్స్, గూగుల్ మ్యాప్ లోకేషన్ ఆధారంగా వారు పర్యటించిన ప్రాంతాలపై ఆరా తీయగా పలువురు యూపీలోని దేవ్‌బంద్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సైతం వెళ్లివచ్చారని తేలింది. దేవ్బంద్లో జరిగిన ప్రార్థనల్లో కేవలం రాష్ట్రానికి చెందిన నిర్మల్‌వాసులు మాత్రమే పాల్గొన్నారని పోలీసులు పైకి చెబుతున్నా.. వారికి అందిన సమాచారం ఆధారంగా మిగిలిన జిల్లాల్లోనూ అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఏంటీ దేవ్‌బందీ? ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ జిల్లాలో ఉంది. ఢిల్లీకి 150 కి.మీ. దూరంలో ఉంటుంది. సున్నీ ఇస్లాంకు చెందిన ప్రాచీన దేవ్‌బందీ ఉద్యమానికి ఈ ప్రాంతం పుట్టినిల్లు. 1866లో దేవ్బందీలో సున్నీ ఇస్లాం మతప్రచారం కోసం దారుల్ ఉలూమ్ దేవ్‌బందీ అనే అరబిక్ యూనివర్సిటీని మౌలానా మహమ్మద్ ఖాసీం నానోతావి అనే వ్యక్తి ప్రారంభించారు. దీనినే దేవ్‌బందీ అని వ్యవహరిస్తారు. తరువాత దీని శాఖలు దేశమంతా ఏర్పడ్డాయి. కాలక్రమంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్తోపాటు యూకే, సౌతాఫ్రికాల్లోనూ తన కార్యకలాపాలను విస్తరించింది. అంతేకాకుండా ప్రపంచంలోని పలు ముస్లిం దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. -
తబ్లిగి సభ్యులకు ఆశ్రయం.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో ప్రార్థనలకు వెళ్లివచ్చినవారికి ఆశ్రయం కల్పించిన పలువురిపై హాబీబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి నెలలో ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిలో కొందరికి హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో స్థానిక జమాత్ నాయకులు ఆశ్రయం కల్పించినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ తబ్లిగి జమాత్ సభ్యులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. దీంతో తెలంగాణ తబ్లిగి జమాత్ అధ్యక్షుడు ఇక్రమ్ అలితోపాటు మరో 10 మందిపై ఏపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక్రమ్ అలీ మాత్రం తాము నిబంధనలు ఉల్లంఘించలేదని, ఎవరికి ఆశ్రయం కల్పించేదని తెలిపారు. కాగా, కొద్ది రోజుల కిందట ఇక్కడ ఆశ్రయం పొందిన అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. ఇక్రంతో సహా పలువురుని క్వారంటైన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అలాగే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం మర్కజ్‌తో సంబంధం ఉన్నవేనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో 531 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 16 మంది మృతిచెందారు. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
దాక్కున్న ఆ 21 మందికి కరోనా
ముంబై : మహమ్మారి కరోనా వైరస్ మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ల సంఖ్య కుప్పలుకుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగి జమాత్ అనంతరం మహారాష్ట్రలో కేసులు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. అయితే మర్కజ్‌కు వెళ్లిన వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న వారు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ సమావేశానికి వెళ్లిన వారి జాబితాను రూపొందించి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ముంబైకి సమీపంలోని ముబ్రా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. ముబ్రా పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ పోలీస్ సీనియర్ అధికారి చేసిన ప్రత్యేక తనిఖీల్లో 21 మంది విదేశీయులు పట్టుబడ్డారు. వీరందరూ మర్కజ్లో పాల్గొన్నవారిగా తేలింది. అయితే ఈ 21 మంది విదేశీయులకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం క్వారంటైన్‌కు తరలించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తనిఖీలను ముమ్మరం చేసింది. వీరు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారనే దాని ఆరా తీస్తున్నారు. కాగా, వీరికి అక్రమంగా ఆశ్రయం ఇచ్చిన స్థానిక మసీదులు, పాఠశాలలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మర్కజ్ సమావేశం తర్వాత తమిళనాడు నుంచి ముంబై మీదుగా ముబ్రాకు చేరుకున్నట్లు పోలీసుల విచారణ తేలింది. ఈ 21 మందిలో 13 మంది బంగ్లాదేశీయలు, 8 మంది మలేషియన్లుగా గుర్తించారు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడం చట్టపరంగా నేరమని ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చదవండి: తబ్లిగి జమాత్ సభ్యుల వికృత చర్య భార్యతో సైకిల్‌పై 120 కిలోమీటర్లు.. -
కరోనా: ‘మర్కజ్, నిజాముద్దీన్ అని చెప్పొద్దు’
న్యూఢిల్లీ: తబ్లిగి జమాత్ ప్రార్థనలు భారత్‌లో కరోనా వ్యాప్తి ఉధృతికి కారణమై వేలాది మంది వైరస్ బారిన పడేలా చేశాయి. గత నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ఈ ప్రార్థనలు జరగ్గా.. మనదేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా హాజరయ్యారు. ఈనేపథ్యంలో ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ (డీఎంసీ) రాష్ట్ర ఆరోగ్యకు శాఖకు ఓ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ రోజూవారీ హెల్త్ బులెటిన్‌లో ‘నిజాముద్దీన్ మర్కజ్’ అని ప్రత్యేకంగా పేర్కొంటూ కేసుల వివరాలు ఇవ్వకూడదని విన్నవించింది. ఈమేరకు డీఎంసీ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. వైరస్ సోకినవారి వివరాలు ఇస్తున్న క్రమంలో తబ్లిగి జమాత్ లేదా మర్కజ్ నుంచి వచ్చినవారు ఇంతమంది.. అంటూ ప్రత్యేకంగా చూపెట్టడం ఒక మతాన్ని తక్కువ చేసినట్టేనని అన్నారు. కాగా, బుధవారం వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఢిల్లీలో 669 కేసులు నమోదవగా.. 426 కేసులు మర్కజ్‌కు చెందినవే. (చదవండి: క్వారంటైన్‌లోని తబ్లిగి జమాత్ సభ్యుల వికృత చర్య) ‘దురాలోచనతోనే ఇలాంటి వర్గీకరణ వార్తలతో మా మతంపై పలు మీడియా సంస్థలు, హిందుత్వ శక్తులు ద్వేషం పెంచుతున్నాయి. వాటి కారణంగా కొన్ని ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. ముస్లిం వ్యక్తులను సోషల్ బాయ్‌కాట్ చేస్తున్నారు. మొన్న ఈశాన్య ఢిల్లీలో ఓ యువకుడిని కొట్టి చంపారు. ఇప్పటికైనా నిజాముద్దీన్ మర్కజ్ పేరును వార్తలు, బులెటిన్లలో పేర్కొనవద్దు’ అని ఇస్లాం ఖాన్ ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక వర్గం, మతం ఆధారంగా కరోనా కేసులు వివరాలు ప్రకటించొద్దని చెప్పింది. వైరస్‌కు గురికావడమనేది ఎవరి తప్పిదం కాదని, బాధితుల వివరాలు వార్తల్లో ప్రచురించొద్దని కేంద్ర హోంశాఖ కూడా చెప్పింది’అని ఆయన తెలిపారు. (చదవండి: వలస కార్మికులను తరలించండి) -
కరోనా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి కేసు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టిస్తున్న మహమ్మారి కరోనా జిల్లాలో తొలిసారి బయటపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వేములవాడకు చెందిన నలుగురు వ్యక్తులకు రెండవసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, వైరస్ బారినపడ్డ సదరు యువకుడికి ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలడం కలవరం పుట్టిస్తోంది. ఇక, తెలంగాణలో ఇప్పటివరకు 471 కరోనా కేసులు నమోదవగా.. 12 మంది మృతి చెందారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (చదవండి: కరీంనగర్లో కరోనా కేసులు ఇలా...) (చదవండి: లాక్డౌన్: దండంపెట్టి చెబుతున్నా..!) -
తబ్లిగి జమాత్ సభ్యుల వికృత చర్య
న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగి జమాత్ అనంతరం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాలు తబ్లిగి జమాత్ సమావేశానికి హాజరైన వారిని గుర్తించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కరోనా లక్షణాలు లేని తబ్లిక్ సభ్యులను క్వారంటైన్ చేశాయి. అయితే వీరిలో కొందరు వైద్య సిబ్బందితో, అధికారులతో అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు. దీంతో కోన్నిచోట్ల వారిని డీల్ చేయడం కష్టంగా మారింది. తాజాగా ఢిల్లీ ద్వారకాలోని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్‌లోని ప్లాట్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో ఉన్న కొందరు తబ్లిగి జామాత్ సభ్యులు వికృత చర్యకు పాల్పడ్డారు. బాటిల్స్‌లో మూత్రం నింపి వాటిని బయటకు విసిరివేశారు. ఇందుకు సంబంధించి సదరు క్వారంటైన్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారక నార్త్ పోలీసులు కేసు నమోదు చేశారు. తబ్లిగి సభ్యులు క్వారంటైన్లో ఉన్న ప్రాంతంలో మూత్రం నింపిన రెండు బాటిల్స్ లభ్యమైనట్టుగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ పనికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. కరోనాను విస్తరించే ఆలోచనతో తబ్లిగి జామాత్ సభ్యులు ఈ చర్యకు పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఢిల్లీలోని మర్కజ్లో ప్రార్థనల అనంతంరం ఇళ్లకు చేరకున్న పలువురు తబ్లిగి జమాత్ సభ్యుల్లో కొందరు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించకుండా రహస్యంగా ఉంటున్నారు. -
తబ్లీగి జమాత్: క్రిమినల్ కేసు నమోదు.. అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నిజాముద్దీన్‌లో తబ్లీగి జమాత్‌కు హాజరై హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న ఆరుగురు మలేషియన్లపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. టోలిచౌకి సమీపంలోని హకీంపేట మజీదు వద్ద మలేషియాకు చెందిన హమీద్‌బిన్ జేహెచ్ గుజిలి, జెహ్రాతులామని గుజాలి, వారామద్ అల్ బక్రి వాంగ్, ఏబీడీ మన్నన్ జమాన్ బింతి అహ్మద్, ఖైరిలి అన్వర్ బాన్ అబ్దుల్ రహీం, జైనారియాలు తదితర ఆరుగురు మలేషియా వాసులు టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి న్యూఢిల్లీలో జరిగిన తబ్లీగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా మలేషియా వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తూ దేశంలో లాక్డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురు న్యూఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ హకీంపేటకు వచ్చి ఇక్కడ మసీదులో షెల్టర్ తీసుకున్నారు. మజీదు ఇన్చార్జి అనుమతితో రెండు రోజులుగా ఈ ఆరుగురు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తలదాచుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సమాచారం ఇవ్వకుండానే ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి సోదాలు నిర్వహించారు. వీరిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్ 420, 269, 270, 188, 109, ఫారెనర్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరందరిని గాంధీలో క్వారంటైన్లో ఉంచారు. పోలీసులకు తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా తబ్లీగి జమాతేకు వెళ్లి వచ్చిన ఆరు మంది మలేషియన్లకు ఆశ్రయం కల్పించినందుకు హకీంపేట మజీదు ఇన్చార్జి మీద కూడా క్రిమినల్ కేసు నమోదైంది. (తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు) -
ఢిల్లీ ప్రార్థనలు: క్వారంటైన్‌కు 25 వేల మంది
ఢిల్లీ: నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లిన తగ్లిబి జమాత్ సభ్యులతో పాటు, వారితో సన్నిహితంగా మెదిలిన 25వేల మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. అంతేకాక జమాత్ సభ్యులు బస చేసిన హర్యానాలోని ఐదు గ్రామాలు నిర్బంధంలో ఉన్నాయని, ఆయా గ్రామాల ప్రజలు క్వారంటైన్లో ఉన్నారని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యా సలీలా శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా గత నెలలో తగ్లిబి జమాత్ సభ్యులు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి పలు రాష్ట్రాల ప్రజలతో పాటు కరోనా ప్రభావిత దేశాల నుంచి విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలో హాజరైన విషయం తెలిసిందే. అనంతరం కరోనాతో స్వస్థలాలకు వెళ్లడంతో కేసులు అమాంతం పెరిగిపోయాయి. (ఢిల్లీ మసీదుల్లో భారీ సంఖ్యలో విదేశీయులు) తాజా పరిస్థితి గురించి పుణ్యా సలీలా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటివరకు నమోదైన 4067 కేసుల్లో 1445 తగ్లిబి జమాత్ సభ్యులకు సంబంధించినవేనని స్పష్టం చేశారు. మర్కజ్ మసీదు కార్యక్రమానికి 2083 విదేశీ జమాత్ సభ్యులు హాజరైనట్లు గుర్తించగా, అందులో 1750 మందిని బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు వెల్లడించారు. లాక్డౌన్ వంటి పలు కీలక చర్యల వల్ల కరోనా వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జమాత్‌కు అత్యధికంగా గుజరాత్ నుంచి 1500 మందికి పైగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి 1089 ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించగా అందులో 172 మందికి కరోనా సోకింది. వారితో సన్నిహితంగా ఉన్న 93 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. (‘తబ్లిగి జమాత్’తో పెరిగిన కేసులు) -
జమాత్ అధ్యక్షుడి కూతురు పెళ్లి వాయిదా
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలు నిర్వహించి దేశ ప్రజల ఆగ్రహావేశాలకు గురైన తబ్లిగి జమాత్ అధ్యక్షుడు మౌలానా సాద్ కంధల్వి తన కూతురు వివాహాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. ఢిల్లీలో ఏప్రిల్ 5న మౌలానా కూతురు పెళ్లి జరగాల్సి ఉంది. దీనికి షామ్లీ, ముజఫర్‌నగర్, శహరన్‌పూర్ నుంచి అతిథులను సైతం ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ వల్ల రాకపోకలు నిలిచిపోవడంతో పెళ్లిని వాయిదా వేసినట్లు ఆయన సన్నిహితుడు పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిసిన వెంటనే మరో తేదీని నిశ్చయించుకుని మత పెద్దలు, బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిన మౌలానా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా ఆయన కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలంటూ జమాత్ సభ్యులను ఉద్దేశిస్తూ ఓ ఆడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. (కరోనా బాధితుల్లో ఎక్కువమంది ఈ వయస్సు వారే!) దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ సభ్యుల సమావేశం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదులో గత నెల 13 నుంచి 15 వరకు మతపరమైన ప్రార్థనలు జరిగాయి. దీనికి వివిధ రాష్ట్రాల నుంచే కాక విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ సమావేశాల్లో పాల్గొన్న వారు కరోనాతో తిరిగి స్వస్థలాలకు వెళ్లడంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య అమాంతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ప్రకటించింది. ఈ మతపరమైన ప్రార్థనలు నిర్వహించిన తబ్లిగి జమాత్ అధ్యక్షుడు మౌలానా సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (‘తబ్లిగి జమాత్’తో పెరిగిన కేసులు) -
మర్కజ్‌కు హాజరైన విదేశీయుడు మృతి
కేప్‌టౌన్ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన ఓ విదేశీయుడు కరోనా వైరస్ సోకి మృతి చెందారు. దక్షిణాఫ్రికాకు చెందిన మౌలానా యూసఫ్ టుట్లా (80) ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్‌కు హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్లిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కాగా మర్కజ్‌కు వెళ్లిన వారికి కరోనా సోకడం భారత్‌లోనూ తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసింది. ఇప్పటికే అనేక పాజిటివ్ కేసులతో పాటు మరణాలూ సంభవించాయి. (భారత్ సహాయాన్ని కోరిన ట్రంప్) -
17 రాష్ట్రాల్లో మర్కజ్ ప్రకంపనలు..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాల మూలాలన్నీ మర్కజ్ నుంచే ఉన్నట్లు వైద్యాధికారులు భావిస్తున్నారు. శనివారం నాటికి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన వారు 17 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు నివేదికను తయారు చేశారు. మర్కజ్‌కు సంబంధించి ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 1023 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన సుమారు 22వేల మందిని క్వారెంటైన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 30శాతానికిపైగా ఢిల్లీ వెళ్లొచ్చిన వారికి సంబంధించినవే అని కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ బాధిత రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు తెలిపింది. కరోనా నిర్థారిత కేసుల్లో 30 శాతం వరకు ఒక ప్రాంతానికి సంబంధించినవే కాబట్టి, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక శనివారం నాటికి కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 3,072గా నమోదు కాగా, మృతుల సంఖ్య 75కు చేరుకుంది. ఈ వ్యాధి నుంచి 183 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (లాక్డౌన్ దశలవారీగా సడలింపు!) -
ముందుచూపు లేని మోదీ సర్కారు
ముంబై: మోదీ సర్కారు ముందుచూపు లేకుండా లాక్డౌన్ విధించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డాన్ వల్ల తలెత్తె పరిణామాలను అంచనా వేయకుండా గుడ్డిగా ముందుకెళ్లిందని దుయ్యబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధం చేసినట్టుగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఇలాంటి సమయంలో ఆర్థిక లోటు గురించి ఆలోచించకుండా ప్రజలకు అన్నిరకాలుగా సాయం అందించాలని అన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయే వారికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. 21 రోజుల నిర్బంధం గడువు ముగిసిన తర్వాత లాక్డౌన్ బాధితులకు అండదండలు అందించాలని కేంద్రానికి సూచించారు. ‘ఇది(కోవిడ్‌పై పోరు) యుద్ధం లాంటిదే. ఇందులో మరో ప్రశ్నకు తావులేదు. ఆర్థిక లోటును సవరించుకుని అత్యవసర పరిస్థితిని తక్షణం ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. కరోనా నివారణ చర్యలకు ప్రైవేటు రంగం సరైన విధంగా స్పందించలేద’ని వీరప్ప మొయిలీ అభిపప్రాయపడ్డారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ‘తబ్లిగీ జమాత్’ను అనుమతించడాన్ని పెద్ద తప్పిదంగా ఆయన వర్ణించారు. ‘ఈ తెలివైనోళ్లంతా అప్పుడు ఏం చేస్తున్నారు. కరోనా పరిణామాల గురించి పూర్తిగా తెలిసినా అధికార యంత్రాంగం ఎందుకు తబ్లిగీ జమాత్‌ను అనుమతించింద’ని మొయిలీ ప్రశ్నించారు. కాగా, కరోనాపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి లైట్లు ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యాఖ్యానించింది. (భారత్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కాదు) -
మృతులంతా మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్లే..!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టినా.. ఢిల్లీ మర్కజ్ మత ప్రార్థనలు దేశాన్ని కుదిపేశాయి. గత వారం వరకు పరిస్థితి సాధారణంగానే ఉన్నా.. మర్కజ్‌కు హాజరైన వారికి కరోనా వైరస్ సోకడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా గడిచిన నాలుగురోజుల్లో సంభవించిన మరణాల్లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన 11 మరణాల్లో ఇద్దరు మినహా మిగతావారంతా అక్కడికి వెళ్లివచ్చిన వారేకావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడతోంది. ఇక దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లోనూ వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణలో తాజాగా నమోదైన కేసులన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారే అత్యధికంగా ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్, నిజామాబాద్‌లో శనివారం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల కూడా ఢిల్లీ బాధితులే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మరణించిన కరోనా బాధితుడు కూడా ఢిల్లీ వచ్చిన వారే కావడం గమనార్హం. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సింహ భాగం మర్కజ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. మత ప్రార్థనలకు వెళ్లిన వారిని నిర్బంధ కేంద్రాలకు పంపే చర్యలను వేగవంతం చేశాయి. (‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్ ) ఇక తెలంగాణలో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,030 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో దాదాపు 900 మందిని ఇప్పటివరకు గుర్తించి తమ అధీనంలోకి తీసుకున్నారు. వారి కుటుంబసభ్యులను, వారితో కాంటాక్ట్ అయినవారిని కూడా కొందరిని గుర్తించారు. బుధవారం 300 మందికి పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం పరీక్షల్లో 75 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం సంఖ్య 229కి చేరింది. -
ఢిల్లీ మసీదుల్లో భారీ సంఖ్యలో విదేశీయులు
న్యూఢిల్లీ : గత నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొని లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయిన 2,300 మందిని క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో 800 మందికి పైగా విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలు వెలుగులోకి వచ్చారు. పోలీసులు, ఆరోగ్య సిబ్బంది రాజధాని నలువైపుల్లోని వివిధ మసీదుల్లో రహస్యంగా తలదాచుకుంటున్న వీరిని గుర్తించారు. మొదట 187మంది విదేశీ జమాత్ కార్యకర్తలు, 24 మంది దేశీయులను గుర్తించేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే పోలీసుల అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీ సంఖ్యలో విదేశీ కార్యకర్తలు బయటపడటం గమనార్హం. అధికారులు వీరిని హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించారు. మరో రెండు రోజుల్లో వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ ఇక్కడో భయంకరమైన విషయం ఏంటంటే 800 మంది విదేశీయుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వారు చాలా మందికి వైరస్‌ను అంటించి ఉంటార’’ ని అభిప్రాయపడ్డారు. ( తబ్లిగీ: కీలకంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు ) కాగా, నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 9,000 మందిని క్వారంటైన్లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 13,702 మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. -
యూపీలో నర్సులపై వెకిలి వేషాలు
న్యూఢిల్లీ/ఘజియాబాద్: బ్లాక్ లిస్ట్‌లో చేర్చి, టూరిస్ట్ వీసాలను రద్దు చేసిన 960 మంది తబ్లిగీ జమాత్‌కు చెందిన విదేశీ కార్యకర్తల్లో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నారని కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. వారితో పాటు, ప్రస్తుతం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉన్న తబ్లిగీ విదేశీ కార్యకర్తల్లో 379 మంది ఇండోనేసియన్లు, 110 మంది బంగ్లాదేశీయులు, 63 మంది మయన్మార్ వారు, 33 మంది శ్రీలంక వారు ఉన్నారని పేర్కొంది. కిర్గిస్తాన్(77), మలేసియా(75), థాయిలాండ్(65), ఇరాన్(24), వియత్నాం(12), సౌదీ అరేబియా(9), ఫ్రాన్స్(3)లకు చెందిన విదేశీ తబ్లిగీ కార్యకర్తల వీసాలను కూడా రద్దు చేశామంది. ఆ 960 మందిలో కజకిస్తాన్, కెన్యా, మడగాస్కర్, మాలి, ఫిలిప్పైన్స్, ఖతార్, రష్యా తదితర దేశాల వారు కూడా ఉన్నారని తెలిపింది. టూరిస్ట్ వీసాపై వచ్చిన వీరిని ఇప్పుడు ఆయా దేశాలకు తిరిగి పంపే ఆలోచన లేదని, వారిపై ఫారినర్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద వీసా నిబంధనలను ఉల్లంఘించిన నేరాల కింద చర్యలు తీసుకోనున్నామని హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలిల శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ‘వారిపై చర్యలు ప్రారంభమైన ప్రస్తుత సమయంలో వారిని వెనక్కు పంపే ప్రశ్నే లేదు. ఎప్పుడు పంపిస్తామన్నది నిబంధనలకు లోబడి నిర్ణయిస్తాం’ అన్నారు. తబ్లిగీ జమాత్ కార్యక్రమాల్లో పాల్గొని తమ దేశాలకు వెళ్లిన 360 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసే కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించామని శ్రీవాస్తవ తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి కొత్తగా 1930 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రారంభించామన్నారు. కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో రాష్ట్రాల హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఉన్నాయన్నారు. ► కరోనా, లాక్‌డౌన్‌కు సంబంధించి ఢిల్లీ ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ 8800007722ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాజస్తాన్‌లోని టోంక్ జిల్లాలో పర్యటించారు. కరోనా వ్యాప్తిపై సర్వే నిర్వహించారు. యూపీలో నర్సులపై వెకిలి వేషాలు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక ఆసుపత్రిలో నర్సులపై తప్పుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ జమాత్ సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేసింది. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. నర్సులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ప్యాంటు వేసుకోకుండా ఆసుపత్రుల్లో తిరిగారని, వెకిలి వ్యాఖ్యలు చేస్తూ, బూతు పాటలు పాడుతూ, వెకిలి చర్యలకు పాల్పడ్డారని, భౌతిక దూరం పాటించలేదని, తామిచ్చే ఔషధాలను తీసుకునేందుకు నిరాకరించారని ఆ ఆరుగురిపై నర్సులు ఫిర్యాదు చేశారు. దేశ భద్రతకు, శాంతి భద్రతలకు ప్రమాదమని భావిస్తే ఎన్ఎస్ఏ కింద ఎవరినైనా ఎలాంటి అభియోగాలు లేకుండానే, సంవత్సరం పాటు నిర్బంధంలోకి తీసుకోవచ్చు. కనౌజ్‌లోని జామామసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు గుమికూడటాన్ని నిరోధించేందుకు ప్రయత్నించిన పోలీసులపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ► మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోవిడ్–19 బాధితుల కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగును క్వారంటైన్ చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడి చేసిన నలుగురిపై జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు. కోవిడ్‌పై పోరుకు ఆ ఘటనలతో విఘాతం ఆనంద్ విహార్ వద్ద భారీ సంఖ్యలో వలస కార్మికులు గుమికూడటం, నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ యావత్ దేశం కరోనా కట్టడికి చేస్తోన్న ప్రయత్నాలకు విఘాతం కలిగించాయని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. -
తబ్లిగీ: కీలకంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు
హైదరాబాద్: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 9,000 మందిని క్వారంటైన్లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం మొత్తం 13,702 మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. మొబైల్ టవర్ సిగ్నల్స్ విశ్లేషణ ద్వారా సమావేశానికి హాజరైన వారి లెక్కలను అంచనా వేయడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఢిల్లీకి వెళ్లిన వారి సంఖ్య భారీగా ఉండటం... వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో... వారందరినీ గుర్తించడం అధికారులకు సవాలుగా పరిణమించింది. ఇక ప్రస్తుతం గుర్తించిన 13,702 మందిలో దాదాపు 7930 మందిపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి కారణంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక మంది కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని... ఢిల్లీకి వెళ్లిన వారు బాధ్యతగా వ్యవహరించి వైద్య పరీక్షల కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (తబ్లిగ్ జమాత్ : ఆడియో విడుదల) కాగా గుంటూరులోని ఓ నియోజవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి సమీప బంధువుకు కరోనా సోకడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా మహమ్మారి బారిన పడినట్లు గుర్తించారు. దీంతో పాలనా యంత్రాంగాలు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగాయి. కేంద్ర సంస్థలతో సమన్వయమై తబ్లిగ్ జమాత్‌కు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కోవిడ్–19ను సమగ్ర వ్యూహంతో ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిపిన విషయం తెలిసిందే. తబ్లీగ్ జమాతేకు ఏపీ నుంచి వెళ్లినవారు 1085 వీరిలో రాష్ట్రంలో ఉన్నవాళ్లు వాళ్లు 946 ఇందులో 881 మందికి పరీక్షలు పూర్తి వీరిలో 108 మందికి కరోనా వైరస్ పాజిటివ్ జమాతేకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు వారితో, కాంటాక్ట్ అయినవారు 613 మందికి పరీక్షలు వీరిలో 32 మంది పాజిటివ్ మొత్తం 161 పాజిటివ్ కేసుల్లో 140 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లినవారు, వారిలో కాంటాక్ట్ అయినవారే -
‘తబ్లిగి’తో 400 పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 400 మంది వరకు నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో నమోదైన వివరాలు ఆధారంగా ఈ విషయం వెల్లడైందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తబ్లిగి జమాత్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారా తమిళనాడులో అత్యధికంగా 264 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 67, తెలంగాణలో 33, ఢిల్లీలో 47, జమ్మూకశ్మీర్‌లో 22, అసోంలో 16, రాజస్థాన్‌లో 11, అండమాన్‌నికోబార్‌లో 9, పుదుచ్చేరిలో 2 కేసులు తబ్లిగి జమాత్‌కు వెళ్లొచ్చిన వారి కారణంగా వ్యాపించినట్టు గుర్తించామన్నారు. మరికొన్ని కరోనా కేసులు వెలుగులోకి వచ్చే అవకాశముందన్నారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడటమే కాకుండా మరణాలు కూడా నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో మరణాలు సంభవించాయి. కాగా, తబ్లిగి జమాత్ నిర్వాహకుడు మౌలానా సాద్, ఇతరులపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, 960 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి వీసాలు రద్దు చేశారు. (కరోనా భయం: వరుస ఆత్మహత్యలు) -
‘తబ్లిగ్’ తెచ్చిన ‘తక్లీఫ్’ అంతా ఇంతా కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చి పదవ తేదీ నుంచి 13వ తేదీ వరకు ‘తబ్లిగ్ జమాత్’ నిర్వహించిన మూడు రోజుల మత సమ్మేళనం నేడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కార్యక్రమానికి కరోనా వైరస్ విస్తరించిన దేశాల నుంచే కాకుండా భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 2000 మంది ముస్లింలు హాజరవడం, వారిలో దాదాపు 150 మందికి వైరస్ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ అవడం, వారిలో ఏడుగురు మరణించడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఆ ఢిల్లీ మత సమ్మేళనానికి హాజరైనవారివి అవడం గమనార్హం. ఢిల్లీ కన్నా ముందు మలేసియాలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన తబ్లిగ్ జమాత్ సమ్మేళనంలో పాల్గొన్న వారిలో కూడా 650 మందికి కరోనా సోకినట్లు అక్కడి నుంచి అందిన వార్తలు తెలియజేస్తున్నాయి. సున్నీల విస్తరణ ఉద్యమంలో భాగంగా ఇండోనేసియా ప్రధాన కేంద్రంగా 1926లో ఏర్పాటయిన తబ్లిగ్ జమాత్‌కు ఇండోనేసియా, భారత్, మలేసియాతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, సింగపూర్ దేశాల్లో ఫొలోవర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సంస్థ ఈ దేశాల్లో ప్రతి ఏటా ఇలాంటి సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఈసారి ఢిల్లీలోని సమ్మేళనానికి ఇరాన్, అఫ్గానిస్థాన్, లండన్ నుంచి ఎనిమిది మంది ముస్లిం ప్రతినిధులు రావడం, వారందరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెల నాటికే ఇరాన్, లండన్‌లకు కరోనా వైరస్ విస్తరించింది. ఆ 8 మందిని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలోకి లాలా లజ్‌పత్‌రాయ్ ఆస్పత్రి ‘క్వారెంటైన్’లో ఉంచారు. (లాక్డౌన్ అతిక్రమిస్తే రెండేళ్ల జైలు) విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా 14 రోజుల క్వారెంటైన్‌కు వెళ్లాల్సిందే అన్న ట్రావెల్ హెచ్చరికను భారత ప్రభుత్వం మార్చి 16వ తేదీన జారీ చేసింది. విదేశీ ప్రతి నిధులు అంతకుముందే వచ్చారుకనుక వారికి ‘క్వారెంటైన్’ నిబంధన వర్తించకపోవచ్చు. ఎలాంటి వేడుకలు, మత కార్యక్రమాలు, సభలు, సమావేశాల పేరుతో 200 మందికి మించి గుమికూడరాదంటూ ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం మార్చి 13వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. జమాత్ సమ్మేళనం మార్చి పది నుంచి 13వ తేదీ వరకు జరిగినందున, ఉత్తర్వులు వెలువడిన రోజు, 13న సమ్మేళనంపై చర్య తీసుకున్నా పెద్ద ప్రయోజనం ఉండేది కాదు. అయినా భారత్‌లో కరోనా విస్తరణకు ‘తబ్లిగ్ జమాత్’ కారణం అయింది కనుక అది ‘ఇస్లాం జిహాద్’లో భాగంగా జరిగిందని కొందరు చెబుతుంటే ‘ఇస్లామిక్ ఇన్సరెక్షన్ (ఇస్లాం తిరుగుబాటు), కరోనా టెర్రరిజమ్’ అని మరికొందరు విమర్శిస్తున్నారు. వారందరిపై దేశ ద్రోహం నేరం కింద కేసులు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విదేశాల నుంచి విజిటింగ్ వీసాలపై వచ్చి ఎలాంటి మత కార్యక్రమాల్లో పాల్గొన రాదు. మత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రావాలంటే ప్రత్యేక అనుమతి అవసరం. అందుకని ఇంతవరకు ఢిల్లీలోని జమాత్ సమ్మేళనానికి హాజరైన వందమందిపై విదేశీయుల చట్టం, భారతీయ శిక్షాస్మృతి కింద 23 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. (ఏపీలో135కి చేరిన కరోనా కేసులు) ఈ చర్యల వల్ల ఇప్పుడు ఢిల్లీ జమాత్‌కు హాజరైన వారందరిని గుర్తించడం కష్టం అవుతోంది. తమ మీద కూడా కేసులు పెడతారనే భయంతో వారు ముందుకు రావడం లేదు. సామాజిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘించడం హిందూ మత కార్యక్రమాల్లో కూడా చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా ఆలయంలో ఓ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. యూపీలోని అయోధ్యలో సాక్షాత్తు ఆదిత్యయోగి నిర్వహించిన పూజా కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మోదీ లాక్డౌన్ ప్రకటించిన రెండోరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ ప్రజా సమూహాల ద్వారా కరోనా విస్తరించక పోవడం అదృష్టంగా భావించాల్సిందే. -
రాష్ట్రమంతా ఆపరేషన్ నిజాముద్దీన్
-
మర్కజ్ : ఈశాన్యానికి పాకిన విషపు వైరస్
డిస్పూర్ : ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు ప్రశాంతంగా హిమాలయ రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగాయి. అస్సాంలో బుధవారం వరకు కేవలం ఒక్క కరోనా కేసు మాత్రమే ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 16కి చేరింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోనూ తొలి పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. కాగా వీరంతా ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌కు హాజరై తిరిగి వచ్చిన వారే కావడం గమనార్హం. దీంతో నిజాముద్దీన్‌లోని మర్కజ్ ప్రకంపనలు ఈశాన్య భారతాన్నీ తాకాయి. ఒక్క అస్సాం నుంచే మర్కజ్‌కు 547కు మంది హాజరైట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. వీరిలో చాలామందిని గుర్తించి నిర్బంధం కేంద్రానికి తరలించామని, ఇంకా 117 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. 196 మంది నమూనాలను పరీక్షా కేంద్రాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే మణిపూర్, మిజోరంలో ఒక్కో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిదే. అయితే ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారికి కరోనా సోకడంతో ఆయా ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. మరోవైపు ఇప్పటి వరకు ఈశాన్య ప్రాంతంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20కి చేరింది. (‘ఆపరేషన్ మర్కజ్’) కాగా ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌కు హాజరై కరోనాతో తిరిగి స్వస్థలాలకు వెళ్లిన వారి వల్ల దేశంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో 335, కేరళ 280 కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 234కి చేరింది. వీటిలో 110 కేసులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌కు హాజరైనవారికి సంబంధించినవే కావడం గమనార్హం. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తబ్లిక్ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. మర్జజ్కు వెళ్లివచ్చిన వారితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. -
నల్లగొండలో 17 మంది బర్మా దేశీయులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండలో 17మంది బర్మా దేశీయులను మంగళవారం రాత్రి పోలీసులు గుర్తించారు. వీరంతా మార్చి 17న నల్లగొండకు మత ప్రచార నిమిత్తం వచ్చారు. వీరిని కరోనా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వీరి కరోనా పరీక్షల రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తమ సమాచారాన్ని వెల్లడించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు.. కరోనా (కోవిడ్ –19) వైరస్ వ్యాధి నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జిల్లా అధికార యంత్రాంగం ఈ పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పరీక్షలు చేయించుకుని గృహ నిర్బంధంలోనే ఉండాలని పదేపదే కోరుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యానికి వేలాది మంది బలవుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో వ్యాధిని అరికట్టేందుకు చేస్తున్న హెచ్చరికలు కొందరి చెవికి ఎక్కడం లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి జిల్లా పోలీసులు నల్లగొండలో మరికొందరు విదేశీయులను గుర్తించారు. జిల్లాలో మొదట వియత్నాం నుంచి మత ప్రచారానికి వచ్చిన çపన్నెండు మంది, వారికి గైడ్లుగా వచ్చిన మరో ఇద్దరు.. వెరసి పధ్నాలుగు మంది గుట్టుచప్పుడు కాకుండా ఆయా ప్రార్థనా మందిరాల్లో తలదాచుకున్నారు. పోలీసు నిఘా విభాగం వీరిని గుర్తించి కరోనా వైరస్ పరీక్షల నిర్వహణకు హైదరాబాద్‌కు తరలించింది. ఈ సమయంలో జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, వీరందరికీ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు రావడంతో అటు అధికారులు, ఇటు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వీరికి కరోనా లక్షణాలు లేకున్నా.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లోనే ఉంచి వైద్య సేవలు అందించారు. ఇది మరచిపోక ముందే.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశాలకు వెళ్లి వచ్చిన వారి ఉదంతం సంచలనం సృష్టించింది. వీరెవరూ తాము బయటి ప్రాంతాలకు వెళ్లివచ్చామని స్వచ్ఛందంగా ముందుకు రాలేదు. నిజాముద్దీన్‌లో సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిలో హైదరాబాద్, ఇతర జిల్లాల్లో మొ త్తంగా ఆరుగురు మృత్యువాత పడడంతో అసలు ఎవరెవరు నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చారని పోలీసులు జల్లెడ పట్టారు. నల్లగొండ పట్టణం నుంచే ఏకంగా 44 మంది వెళ్లివచ్చారని గుర్తించి మంగళవారం వా రందరినీ అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు పరీ క్షలకోసం పంపించారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలో మరో పదిహేడు మంది బర్మా దేశస్తులు ఉన్నారని తేలడం సంచలన వార్తగా మారింది. మార్చి 17వ తేదీన నల్లగొండకు చేరుకున్న బర్మా దేశస్తులు.. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా వైరస్ తీవ్రతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా బర్మా దేశం నుంచి వచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే, ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చిన వారిని గుర్తించడంలో భాగంగా పోలీసులు ఆయా ప్రార్థన మందిరాల్లో ఎవరెవరు ఉంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. బర్మా దేశం నుంచి మత ప్రచారం కోసం నల్లగొండకు వచ్చిన 17 మందిని నల్లగొండ పోలీసులు మంగళవారం అర్థ్దరాత్రి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరికి నార్కట్‌పల్లిలోని ఒక ఫంక్షన్ హాలులో వసతి కల్పించి బుధవారం కరోనా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. బర్మా దేశం నుంచి హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలోని బాబానగర్‌కు చేరుకున్న వీరు మార్చి 17వ తేదీన మత ప్రచారం కోసం నల్లగొండకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మక్కా, జమ, కువా మసీదుల్లో బర్మా దేశీయులు ఉండి మతప్రచారం చేపట్టారని పోలీసులు పేర్కొన్నారు. ఆందోళన కలిగిస్తున్న గోప్యత.. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రదేశాల్లో తిరిగి వచ్చిన వారు, లేదా కరోనా పీడితులతో కలిసి గడిపిన వారు తమకు తాముగా అధికారులకు సమాచారం అందించి పరీక్షలు జరిపించుకుని క్వారంటైన్‌కు వెళ్లకుండా గోప్యత పాటిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వియత్నాం నుంచి వచ్చిన వారి గురించి, బర్మా నుంచి వచ్చిన వారి గురించిన సమాచారం స్థానిక ప్రజల నుంచి అందకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. చివరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారు కూడా తమ ‘ఐడెంటిటీ ’ని బయట పెట్టలేదని, పోలీసులే వారందరినీ గుర్తించారని చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిగురించి, లేదా బయటి రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి గురించిన సమాచారం జిల్లా అధికారులకు తెలియజేయాలని కోరుతున్నారు. ఆ.. 44 మందికి కరోనా లక్షణాలు లేవు.. నిజాముద్దీన్ మర్కజ్లో ప్రార్థనలకు నల్లగొండ నుంచి వెళ్లి వచ్చిన 44 మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. వీరిని మంగళవారం జిల్లా కేంద్రం నుంచి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ తరలించారు. కాగా వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. వీరిని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు తరలించనున్నారు. అక్కడ కొద్ది రోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు. -
ఆ నలుగురు మృతుల నుంచి మరెంత మందికో..
సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: జమాత్‌కు వెళ్లి వచ్చినవారిని గుర్తించడం అధికారులకు తలకుమించిన భారంగా పరిణమించింది. హోంశాఖ ఇచ్చిన చిరునామాలతో పోలీసు, జీహెచ్ఎంసీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మూడు రోజులుగా గల్లీలన్నీ గాలించారు. దాదాపుగా వీరిని గుర్తించినట్లు సమాచారం.మరికొందరిని గుర్తించాల్సి ఉంది. చైనా, ఇంగ్లండ్, అమెరికా, ఇటలీ, దుబాయి, ఇండోనేషియా తదితర దేశాల నుంచి వచ్చి ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడిన బాధితులతో పాటు వారికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబ సభ్యులు, ఇతర బంధువులను గుర్తించి క్వారంటైన్‌కు తరలింపు వ్యవహారం అధికారులకు సవాల్‌గా మారింది. వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ దగ్గర పడటం, గ్రేటర్లో రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు గుర్తించిన వారు కూడా అధికారులకు సహకరించడం లేదు. ఇటు పోలీసులు, అటు వైద్యారోగ్యశాఖ అధికారులుగ్రేటర్లోని బస్తీలన్నీ జల్లెడ పట్టగా వీరు ఇప్పటికే మరో పది వేల మందిని కలిసి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం ఎక్కడున్నారు? వీరి కుటుంబాల్లో ఎంత మంది ఉన్నారు? ఇప్పటి వరకు వీరు ఎంత మందిని కాంటాక్ట్ అయ్యారు? వంటి అంశా లను గుర్తించేందుకు పాతబస్తీ సహా ఇతర బస్తీలను జల్లెడ పడుతున్నారు. వీరిని గుర్తించడం ఒక ఎత్తయితే.. క్లోజ్ కాంటాక్ట్‌లను మరో 21 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచడం మరో ఎత్తుగా మారింది. ఆ నలుగురు మృతుల నుంచి మరెంత మందికో.. మార్చి 13 నుంచి 17 వరకు ఢిల్లీ జమాత్‌కు వెళ్లివచ్చిన వారిలో తెలంగాణ వ్యాప్తంగా 1030 మంది ఉండగా, వీరిలో 603 మంది గ్రేటర్ వాసులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 160 మందిని గుర్తించాల్సిఉంది. గుర్తించిన వారిలో ఇప్పటికే 35 మందిలో పాజిటివ్ వచ్చింది. బాధితుల్లో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు హైదరాబాద్ వాసులు కాగా, మరో ఇద్దరు నిజామాబాద్, గద్వాల్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. కరోనా వైరస్ సోకి చనిపోయిన హైదరాబాద్‌కు చెందిన ఆ నలుగురు మృతుల నుంచి సుమారు 60 మందికిపైగా క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. వీరిందరినీ ఇప్పటికే గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు వీరు ఎక్కడెక్కడ తిరిగారు? ఎంత మందిని కలిశారు? వంటి ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన నెలకొంది. ♦ ఖైరతాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోయిన అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడి (74)కి క్లోజ్ కాంటాక్ట్‌లో సుమారు 25 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఆయన భార్య, కొడుకు, కోడలుకు పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్లిన ఇందిరానగర్ బస్తీకి చెందిన మరో వ్యక్తిని గుర్తించారు. ఇప్పటికే ఆయన భార్య గాంధీలో చికిత్స పొందుతుండటం గమనార్హం. ♦ గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన చంచల్‌గూడకు చెందిన జర్నలిస్టు(58)కు ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరో 20 మంది వరకు సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. ఈయన జమాత్‌కు హాజరు కాకపోయినప్పటికీ.. నూర్ఖాన్ బజార్‌లోని ఓ కుటుంబ పెద్దతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇటీవలే వేరే దేశం నుంచి వచ్చారు. ఆయన కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరి ద్వారా జర్నలిస్టుకు కూడా కరోనా వైరస్ విస్తరించి ఉంటుందని అంచనా. ఆయనకు క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ ఇప్పటికే కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ♦ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తి (55)కి ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కోడళ్లు, అల్లుళ్లు, కూతుళ్లు, మనవలు.. ఇలా మొత్తం 13 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ♦ గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన దారుషిఫాకు చెందిన వృద్ధుడి (65)కి ఎనిమిది మంది కుటుంబ సభ్యులు సహా మొత్తం 13 మంది క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ ఇప్పటికే కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి, హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఎక్కువ లక్షణాలు ఉన్న వారికి ఆయా ఆస్పత్రుల్లోనే చికిత్సలు అందిస్తున్నారు. పాతబస్తీలో భయం.. భయం.. పాతబస్తీలో కరోనా కలవరం మొదలైంది. ఢిల్లీలోని జమాత్ ప్రార్థనకుల నగరంలోని పాతబస్తీ నుంచి 128 మంది హాజరైన విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు పొంది మూడు రోజుల క్రితం చనిపోయిన ఇద్దరుపాతబస్తీకి చెందిన వారు కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఢిల్లీలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశానికి హాజరై తిరిగి వచ్చిన వృద్దుడు కాగా.. మరో వ్యక్తికి ఎలాంటి ట్రావెలింగ్ హిస్టరీ లేకపోయినప్పటికీ.. కరోనా వైరస్ భారిన పడి మృతి చెందడంతో పాతబస్తీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. దీంతో పలువురు అపార్ట్‌మెంట్‌వాసులు పట్టించుకోకుండా ఫ్లాట్స్ ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. అధికార యంత్రాంగం అప్రమత్తం.. జీహెచ్ఎంసీ, పోలీసు, వైద్య బృందాలు అప్రమత్తమయ్యాయి. పాతబస్తీలోని పరిసర ప్రాంతాలను శానిటైజేషన్ చేశారు. చనిపోయిన వారితో నేరుగా కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరించారు. అవసరమైన మేరకు అందరికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో విదేశాల నుంచి 1,166 మంది పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకు వచ్చారు. ఇందులో సంబందిత అధికారులు, సిబ్బంది ఆయా ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు అవసరమైన వారికి వైద్య చికిత్సలు, గృహ నిర్బంధం చేశారు. వీరికి కోవిడ్ వైరస్ ప్రభావం వీరిపై ఉందా.. లేదా అనే వివరాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ముస్లిం ప్రజలు సహకరించాలి.. ఢిల్లీలోని ఉన్నతాధికారులు పూర్తిగా తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయం తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సింది. తబ్లీగ్ జమాత్ సభకు విదేశాల ముస్లిం ప్రజలు, ప్రతినిధులు కూడా వస్తున్నప్పుడు ఎందుకు కట్టడి చేయలేదు? అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? నష్టం జరిగిన తర్వాత మేల్కొంటే ఏం ప్రయోజనం? కుల, మతాలకతీతంగా కరోనా వైరస్ సోకుతోంది. ఏ ఒక్క మతాన్ని బద్నాం చేయొద్దు. ఢిల్లీ సభకు హాజరైనవారు స్వచ్ఛందంగా అధికారులకు సహకరించాలి. లాక్ డౌన్‌ను పూర్తిగా పాటించాలి.– మౌలానా ముఫ్తీ మహబూబ్ ఆలం ఆష్రఫీ,మత గురువు, దూద్‌బౌలీ -
వెళ్లాడు.. వచ్చాడు.. జనంలో తిరిగాడు!
కరోనా మహమ్మారి జిల్లాలో అలజడి సృష్టిస్తోంది. మెదక్ పట్టణానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలడంతో మెతుకుసీమ వ్యాప్తంగా కలవరం మొదలైంది. జిల్లా ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం బాధితుడి నివాస ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేసింది. అతడి కుటుంబ సభ్యులను వైద్య చికిత్సల నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించింది. బాధితుడు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? వంటి అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సాక్షి, మెదక్: ఢిల్లీలో మతపరమైన ప్రార్థనకు వెళ్లి కరోనా బారిన పడిన వ్యక్తి నివాస స్థలం మెదక్ పట్టణంలోని ఆజంపుర. అతడి వ్యవసాయ భూమి మాచవరం గేటు వద్ద ఉంది. దీని పక్కనే ర్యాలమడుగులో అతడి బంధువులు ఉన్నారు. మత గురువు కావడం.. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అతడు పలువురితో సమావేశమైనట్లు.. బంధువుల ఇంటికి సైతం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ మేరకు ఎవరూ బయటకు రాకుండా.. ఆయా ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకరు దుబాయిలో ఉంటుండగా.. మిగిలిన పది మందిని అదుపులోకి తీసుకుని మెదక్ ఏరియా ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించి.. వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం అందరిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. వీరితో పాటు కరోనా బాధిత వ్యక్తికి సంబంధించిన బంధువులు.. ర్యాలమడుగుకు చెందిన నలుగురిని కూడా ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వార్డుల వారీగా సర్వే మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు మరింత కట్టడి చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా మున్సిపల్, వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే చేపడుతున్నారు. పట్టణంలో వార్డుల వారీగా ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు జల్లెడ పడుతున్నారు. రసాయన ద్రావణం పిచికారీ.. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆయా శాఖల అధికారులు రంగంలోకి దిగారు. మెదక్ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఆజంపురతోపాటు పట్టణ వ్యాప్తంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడం, చెత్త తొలగించారు. అంతేకాదు.. హైడ్రోక్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ ద్రావణాన్ని ఫైరింజన్ సాయంతో పిచికారీ చేశారు. ప్రధానంగా మెదక్ పట్టణంలోని ఆజంపురతోపాటు ర్యాలమడుగు.. ఆ తర్వాత పరిస్థితులకనుగుణంగా ఇతర చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసేలా వైద్య శాఖ అడుగులు వేస్తోంది. మెదక్ పట్టణం, పాపన్నపేట మండలంలోని ఏడుపాయలలో ఉన్న హరిత హోటళ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు మెదక్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో 15 పడకలతో ఐసోలేషన్, 8 పడకలతో ఐసీయూ వార్డులు సిద్ధం చేశారు. ఆందోళనలో ప్రజలు మెదక్‌లో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు జిల్లాలకు చెందిన ప్రజలు వివిధ పనులు, వ్యాపారాల నిమిత్తం మెదక్‌కు వస్తూ పోతుంటారు. లాక్డౌన్, కర్ఫ్యూ నేపథ్యంలో ఇంటికే పరిమితమైనప్పటికీ.. పలువురు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరెవరు.. ఎవరిని కలిశారో.. ఎలాంటి ముప్పు వస్తుందనే భయం ప్రజల్లో నెలకొంది. ఆ 12 మంది ఎక్కడ ?! ఢిల్లీకి మతప్రార్థనలకు వెళ్లిన వారిలో జిల్లాకు చెందిన వారు మొత్తం 26 మంది ఉన్నట్లు సమాచారం. అయితే.. అధికారులు ఇప్పటివరకు 14 మందిని మాత్రమే గుర్తించారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. 13 మందికి నెగెటివ్, ఒకరికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన 12 మంది ఎవరో.. ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటివరకు 14 మందిని మాత్రం గుర్తించామని.. ఇంకెందరు ఉన్నారో తమకు తెలియదని.. సర్వే కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. వెళ్లాడు.. వచ్చాడు.. జనంలో తిరిగాడు! ♦ కరోనా వైరస్ బారిన పడిన మెదక్ పట్టణానికి చెందిన వ్యక్తి మత గురువు. అతడు మార్చి 13న ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ తబ్లిక్ జమాతే ఇస్లాం ఏ హింద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు. ♦ 21న ఢిల్లీ నుంచి కాచిగూడకు తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. అతడు ప్రయాణించిన బోగిలో మెదక్ జిల్లాకు చెందిన నలుగురితోపాటు సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు ఉన్నట్లు సమాచారం. ♦ కాచిగూడలో దిగిన తర్వాత కరోనా బాధిత వ్యక్తితోపాటు మెదక్ జిల్లాకు చెందిన మరో ముగ్గురు నిజామాబాద్ వెళ్లే రైలు ఎక్కి చేగుంటలోని వడియారం రైల్వే స్టేషన్లో దిగారు. మిగిలిన వారు కాచిగూడ స్టేషన్ నుంచే వారి వారి ప్రాంతాలకు తరలివెళ్లారు. ♦ కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి, మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు వడియారం నుంచి చేగుంటకు చేరుకున్నారు. అక్కడ ఫిజియోథెరపీగా పనిచేస్తున్న తమ స్నేహితుడిని కలిశారు. అతడి కారులో మెదక్‌కు వచ్చారు. ♦ ఆ తర్వాత కరోనా బాధిత వ్యక్తి.. ఢిల్లీలో జరిగిన సమావేశ వివరాలను స్థానికంగా సమావేశం నిర్వహించి వివరించినట్లు తెలిసింది. ♦ అనంతరం 23, 24న మాచవరం గేటు వద్ద గల తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో ర్యాలమడుగులోని తన బంధువులు, సన్నిహితుల వద్దకు వెళ్లి ఢిల్లీ ముచ్చట్లు పంచుకున్నట్లు సమాచారం. ♦ 25 నుంచి 29వ తేదీ వరకు తన ఇంట్లోనే ఉన్నాడు. ♦ 29న వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా... మంగళవారం రాత్రి పాజిటివ్‌గా తేలింది. -
‘ఆపరేషన్ మర్కజ్’
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా మారిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్‌కు హాజరై, స్వస్థలాలకు తిరిగివెళ్లిన వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జల్లెడ పడుతున్నాయి. వారిలో ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 6 వేల మందిని అధికారులు గుర్తించారు. వారిలో 5 వేల మందిని క్వారంటైన్ చేశారు. వివిధ రాష్ట్రాల్లోని మిగతా సుమారు 2 వేల మంది కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆ 2 వేల మందిలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలవారే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, తబ్లిగి జమాత్ సదస్సుకు హాజరై స్వస్థలాలకు వెళ్లిన వారు.. ఆ తరువాత ఎవరెవరిని కలిశారో యుద్ధ ప్రాతిపదికన ఆరా తీయాలని కేంద్రం రాష్ట్రాలను మరోసారి ఆదేశించింది. తబ్లిగి జమాత్‌లో పాల్గొన్న వారిలో చాలామంది వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తబ్లిగి జమాత్ మర్కజ్‌కు హాజరైన వారు ఆ తరువాత ఎవరెవరని కలిశారన్న విషయం గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆయన కోరారు. తబ్లిగి జమాత్‌లో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలిందని, వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపైన, నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరారు. వారం రోజుల్లోగా రాష్ట్రాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను అమలు చేయాలని కోరారు. ఈ పథకం కింద రూ. 27,500 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. సరుకులను ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రాల మధ్య రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ సందర్భంగా అంతా భౌతికదూరం పాటించేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. కరోనాపై పోరుకు భారీ నష్టం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశం భారీ నష్టం చేకూర్చిందని జాతీయ మైనారిటీ కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మదర్సాలు, ఇతర మత ప్రదేశాలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని రాష్ట్రాలను కోరింది. నిజాముద్దీన్ ఘటన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించడమే కాకుండా, సహ పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఎన్సీఎం చీఫ్ సయ్యద్ ఘయోరుల్ హసన్ రిజ్వీ పేర్కొన్నారు. ఉల్లంఘనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేసేందుకు మత పెద్దల సహకారం తీసుకోవాలన్నారు. జమాత్‌కు హాజరైనవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవాలని కోరారు. ► కరోనా హాట్‌స్పాట్స్, క్వారంటైన్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాలను వైరస్ రహితంగా చేసేందుకు ఫైర్ సర్వీస్ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇతర ఉన్నతాధికారులతో బుధవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ► తబ్లిగి జమాత్ మర్కజ్ నుంచి గత 36 గంటల్లో 2,361 మందిని తరలించామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. వారిలో 617 మందిని ఆసుపత్రులకు, మిగతావారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపించామన్నారు. ► రాజస్తాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఉన్న సర్వార్ పట్టణంలోని ఒక దర్గాలో మంగళవారం జరిగిన మతపరమైన కార్యక్రమానికి 100 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వారిని పంపించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. -
వారి వివరాలు సేకరించండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కారదర్శులు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలన్నింటినీ సేకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల వివరాలు సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వీసా నిబంధనలు ఉల్లంఘించి మత కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.(మర్కజ్ @1,030) ఇక కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సామాజిక దూరాన్ని పాటిస్తూనే.. రవాణా వాహనాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో లోపల కూడ అనుమతించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. వచ్చే వారంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను దశల వారీగా అమలు చేయాలని సూచించారు. -
మరో వారం రోజులు కీలకం..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఢిల్లీలోని నిజామొద్దీన్ ప్రాంతంలోని మర్కజ్లో ప్రార్థనలు కరోనా వ్యాధి సోకడానికి కారణమయ్యాయి. ప్రార్థించిన చోటి నుంచే ప్రాణాలు తీసే కరోనా వ్యాధి వెంటబెట్టుకు వచ్చారు. రాష్ట్రంలో మృతిచెందిన ఆరుగురు ఈ ప్రార్థనలకు వెళ్లిన వారే కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ నుంచి మొత్తం 1030 మంది హాజరుకాగా కరీంనగర్ జిల్లా నుంచి 17 మంది ప్రార్థనల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యింది. వారిలో ముగ్గురు హుజూరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. వీరంతా ప్రార్థనల అనంతరం రైళ్లలో తమ తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు. వీరి ద్వారా రైలు ప్రయాణ సమయంలో తమతోపాటు ప్రయాణించిన వందలాది మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడు మర్కజ్లో ప్రార్థనలకు హాజరైన వారు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా నుంచి ఢిల్లీలో ప్రార్థనలకు హాజరైన వారి గురించి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆరా తీసి వారి చిరునామాలను కనుక్కుంది. 17 మందిని ఐసోలేషన్‌కు తరలించి కరోనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ వీరు ఎవరెవరిని కలిశారు.. ఎంతమందితో సత్సంబంధాలు కలిగి ఉన్నారనేది పెద్ద సమస్యగా మారింది. ప్రార్థనలకు వెళ్లి వచ్చి ఐసోలేషన్‌లో ఉంటున్న అనుమానితులకు చెందిన కుటుంబ సభ్యులను మాత్రం వారి వారి ఇళ్లలోనే క్వారంటైన్ చేశారు. వారి సమీప బంధువులు, సన్నిహితంగా మెలిగిన వారి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఢిల్లీలోని మర్కజ్లో ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో రాష్ట్రం నుంచి వెళ్లినట్లు తెలియడం, చనిపోయిన ఆరుగురు అక్కడే ప్రార్థనలు చేసి రావడంతో ప్రార్థనల్లో పాల్గొన్నవారు అనుమానితులుగా మారారు. వీరి ద్వారా ఎంతమందికి సోకిందో ఏమో అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో గత రెండు రోజుల్లో కరోనా అనుమానితులుగా ఐసోలేషన్‌కు తరలుతున్న వారు ఢిల్లీలోని మర్కజ్లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడంతో ఇప్పుడు కలకలం చెలరేగుతోంది. ఇప్పటికే ఎంతో అప్రమత్తంగా ఉన్న జిల్లా యంత్రాంగం అనుమానితులను క్వారంటైన్లో ఉంచుతూ.. లక్షణాలు ఉన్న వారిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రార్థనల్లో పాల్గొన్న వారితో సన్నిహితంగా మెలిగిన వారు ఎవరైనా ఉంటే తక్షణమే అధికారులను సంప్రదించాలని అధికార యంత్రాంగం ప్రకటించింది. ఏది ఏమైనా కనిపించని శుత్రువుతో ఇటు ప్రభుత్వం అటు ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇండోనేషియన్లకు నెగెటివ్ రిపోర్టు... కరీంనగర్‌కు మత ప్రచారం కోసం వచ్చి మార్చి 16న కరోనా అనుమానితులుగా కరీంనగర్ నుంచి గాంధీ ఆసుపత్రికి పది మంది ఇండోనేషియన్లను తరలించగా వారందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారు సంచరించిన ప్రాంతాలను క్వారంటైన్ చేసి, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. కాగా, 15 రోజుల చికిత్స అనంతరం వారికి తిరిగి పరీక్షలు నిర్వహించగా, 9 మందికి నెగెటివ్ రిపోర్టు వచ్చింది. వీరితో సన్నిహితంగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు మాత్రం క్వారంటైన్ తప్పడం లేదు. మరో వారం రోజులు కీలకం.. కరీంనగర్లో సోమవారం ఇద్దరికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో పరిస్థితులు మరో వారం రోజులు కీలకంగా మారాయి. కరీంనగర్ జిల్లాలోకి ఇండోనేషియా దేశస్తులు మత ప్రచారం కోసం రావడంతోనే వారి ద్వారా కరోనా కలకలం మొదలైంది. మార్చి 14న కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులకు కరోనా లక్షణాలు ఉండడంతో... 16న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో మూడు రోజుల వ్యవధిలో పది మంది విదేశీ బృందంతోపాటు వారికి సహాయకుడిగా పనిచేసిన స్థానిక వ్యక్తికి సైతం పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. స్థానిక వ్యక్తికి పాజిటివ్ తేలిన తర్వాత వారి కుటుంబ సభ్యులపై జిల్లా యంత్రాంగం నిఘా పెట్టింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆదివారం స్థానిక వ్యక్తి తల్లి, సోదరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మరోమారు జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. ఇప్పటి నుంచి మరో వారం రోజులపాటు పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారో వారిపై నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి తోడు ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి కుటుంబసభ్యులపై ప్రత్యేకంగా దష్టి సారించారు. పరిస్థితిపై మంత్రుల ఆరా... కరీంనగర్లో మరో రెండు పాజిటివ్ కేసులు నమో దు కావడం, ఢిల్లీలోని మర్కజ్లో ప్రార్థనలు చేసిన వారిలో 17 మంది కరీంనగర్‌కు చెందిన వారే కావడంతో ఇక్కడి పరిస్థితిపై జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌లు అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారు ఎవరెవరిని కలిశారు.. వారితో సన్నిహితంగా మెలిగిన వారెంతమంది ఉంటే అంత మందిని క్వారంటైన్ చేయడం లేదా పరిస్థితి తీవ్రంగా ఉంటే ఐసోలేషన్‌కు తరలించడం చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్లో కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. హుటాహుటిన అధికార యంత్రాంగా న్ని అప్రమత్తం చేశారు. దీంతో అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ కె.శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ సుజా త రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా కలకలం
-
తెలంగాణాలో మర్కజ్ కలకలం
-
జనగామలో హైఅలర్ట్..
జనగామ: ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జనగామలో హైఅలర్ట్ నెలకొంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో నిజాముద్దీన్ ఘటన ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. జనగామ జిల్లా కేంద్రంతోపాటు నర్మెట మండలం వెల్దండకు చెందిన ఐదుగురు ఈనెల 15న ఢిల్లీకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నాక 17వ తేదీన విమానంలో హైదరాబాద్ మీదుగా స్వస్థలాలకు చేరుకున్నారు. ఐదుగురిలో జనగామకు చెందిన ఇద్దరు అక్కడే ఉండిపోగా, ముగ్గురు మాత్రం ఇక్కడకు వచ్చారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు ప్రైవేట్ పని చేసుకునే వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అయితే, వీరు ఢిల్లీ నుంచి వచ్చినట్లు ముందే తెలుసుకున్న అధికారులు.. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తాము ఢిల్లీకి వెళ్లలేదనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లి వచ్చిన నాటి నుంచి వీరంతా హోం క్వారంటైన్లో ఉండకుండా, జనాల్లో కలిసి తిరిగినట్లు తెలుస్తోంది. అధికారుల ఆరా ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనల్లో పాల్గొన్న కుటుంబాల వద్దకు వైద్యారోగ్యశాఖ తో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి, నర్మెట మండలం వెల్లండకు చెందిన వాసిగా తేలింది. ఇందులో వెల్లండ గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు ఆయన భార్య, కుమారుడిని రెస్క్యూ టీం పర్యవేక్షణలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. జనగామకు చెందిన ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వారి కుటుంబీకులను హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు. వీరికి సంబంధించిన నివేదికలు వచ్చాక అధికారులు వివరాలు వెల్లడించనున్నారు. వెల్దండలో ఇంటింటి సర్వే ఢిల్లీ ఘటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో బ్లీచింగ్ చేస్తుండగా, వెల్లండ గ్రామంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. వెల్దండకు చెందిన వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాక ఆ విషయాన్ని దాచి గ్రామంలో మటన్, చికెన్ విక్రయాలు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా తెలియగా సోమవారం గ్రామానికి వెళ్లిన అధికారులు ఆయనను హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించారు. ఇక మంగళవారం సదరు వ్యక్తితో పాటు ఆయన భార్య, కుమారుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనతో సన్నిహితంగా తిరిగిన 35 కుటుంబాల వ్యక్తులకు హోం క్వారంటైన్ విధిస్తూ నోటీసులు జారీ చేశారు. డీసీపీ శ్రీనివాస్, సీఐ రాపెల్లి సంతోష్ కుమార్, ఎస్సై జక్కుల పరమేశ్వర్, సిబ్బంది జి.నర్సింగారావు, జి.భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ లగిశెట్టి అశోక్‌కుమార్, కరోనా బృందానికి చెందిన డాక్టర్ మోజెస్ రాజ్, ఎస్‌యూఓలు రవీందర్, సంతోష్ కుమార్, సర్పంచ్ నర్రా వెంకట రమణారెడ్డి, ఆరోగ్యమిత్ర లక్ష్మారెడ్డి, వీఆర్వో రవీందర్, వీఆర్ఏ అబ్బయ్య, ఏఎన్ఎం అమృత పాల్గొన్నారు. -
ఆ బస్తీల్లో భయం..భయం
సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: గ్రేటర్‌కు ఢిల్లీ ఫీవర్ పట్టుకుంది. బస్తీవాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. చైనా, ఇటలీ, దుబాయ్, స్కాట్లాండ్, ఇండోనేషియా, యూకే, యూఎస్ఏల నుంచి వచ్చిన వారితో పోలిస్తే..మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీ నిజాముద్దీన్ మార్కెట్లోనిర్వహించిన తబ్లీఘీ జమాత్‌కు హాజరై వచ్చిన వారితోనే ఎక్కువ ఆందోళన నెలకొంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కన్నా.. జమాత్‌కు హాజరై వచ్చిన వారిలోనే కరోనా కేసులు ఎక్కువ వెలుగు చూస్తుండటంఇందుకు కారణం. తెలంగాణ నుంచి 1030 మంది హాజరు కాగా, వీరిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే 603 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే పలువురికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.థర్డ్ కాంటాక్ట్ కూడా చాపకింది నీరులా విస్తరిసంది. సెకండ్ కాంటాక్ట్ బాధితులే కాదు..వారికి క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నవారిలో చాలా మంది వివరాలు దొరకడం లేదు. దీంతో ఇటు పోలీసులు, అటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. జమాత్‌కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ముగియడం, కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటం, ప్రస్తుతం వైరస్ మరింత చురుగ్గా విస్తరించే అవకాశం ఉండటంతో గ్రేటర్వాసుల్లోఆందోళన నెలకొంది. ఆ బస్తీల్లో భయం..భయం ఖైతరాబాద్‌కు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు గత శుక్రవారం ఖైరతాబాద్ గ్లోబల్‌ఆస్పత్రిలో మృతి చెందగా, యూసఫ్‌గూడ వాసి సోమవారం అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. ఇక చంచల్‌గూడకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి సహా నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన మరో 69 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో వారు నివసిస్తున్న అపార్ట్మెంట్లు, బస్తీల్లో ఆందోళన మొదలైంది. మృతుల కుటుంబ సభ్యులను ఇప్పటికే క్వారంటైన్లో ఉంచారు. అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. కేవలం మృతుల నుంచి కాకుండా వారికి క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఇతరులకు వైరస్ విస్తరించే ప్రమాదం ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ఒక్కరి అశ్రద్ధ..కుటుంబం మొత్తానికి సమస్య కరోనా అనుమానితులు ఇంట్లో విడిగా ఉండక పోవడం, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరుల మధ్య తిరగడం వల్లే హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు పెరుగుదలకు ప్రధాన కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ నుంచి దుబాయ్ మీదుకు హైదరాబాద్‌కు చేరుకున్న సికింద్రాబాద్ ఎంజీ రోడ్‌కు చెందిన వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆయన నుంచి ఆయన కుమారునికి, ఆ తర్వాత ఆయన భార్యకు పాజిటివ్ వచ్చింది. ఇక యశోద ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడు ఇటీవల తిరుపతి వెళ్లివచ్చి, అక్కడ ఓ విదేశీయునితో కలిసి, ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఆస్పత్రిలో సహ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి, కుటుంబ సభ్యులతో యథావిధిగా గడిపాడు. దీంతో ఆయన నుంచి ఆయన భార్యకు, తల్లికి వైరస్ సోకింది. ఇక జమాత్‌కు వెళ్లి వచ్చిన నాంపల్లికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఆయన కుటుంబంలో ఆరుగురు సభ్యలకు వైరస్ సోకింది. ఇదే కార్యక్రమానికి వెళ్లి వచ్చిన కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి నుంచి మరో నలుగురు కుటుంబ çసభ్యులకు వైరస్ సోకింది. గోల్కొండకు చెందిన ఓ కుటుంబ బాలుడు సహా ఇటీవల సౌది అరేబియా వెళ్లి వచ్చింది. మూడేళ్ల బాలుడు సహా తల్లిదండ్రులు ఇద్దరూ çకరోనా వైరస్ భారిన పడ్డారు. ఇక రంగారెడ్డిజిల్లా కోకాపేటకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి నంచి ఆయన భార్యకు వైరస్ విస్తరించింది. రెండు రోజుల క్రితం నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ 18 నెలల బాలునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసింది. బాలుని తల్లికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. లక్షణాలను గుర్తించక పోవడం, కుటుంబ సభ్యుల మధ్య నిర్లక్ష్యంగా గడపడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరిస్తుంది. ఎక్కడ ఈ వైరస్ తమకు సోకుతుందోనని పక్క ఇంట్లోని వారు బస్తీ వాసులు, ఇతర బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇండోనేసియా నుంచి ఢిల్లీకి..అటు నుంచి హైదరాబాద్‌కు... మార్చి తొమ్మిదో తేదీన పది మంది ఇండోనేసియా నుంచి ఢిల్లీలో దిగారు. వీరు జమాత్‌లో పాల్గొని, 13వ తేదీన సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి రామగుండం, కరీంనగర్‌కు చేరుకున్నారు. ఈ పది మంది సహా వీరికి బస ఏర్పాటు చేసిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగక ముందే వీరికి జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. థర్మల్స్కాన్కు ఏమాత్రం పట్టుబడకుండా విమానంలో ఉండగానే వీరంతా పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకున్నట్లు తెలిసింది. మాత్రలు వేసుకోవడంతో వీరు స్క్రీనింగ్‌లో పట్టుబడకుండా బయటికి వచ్చారు. జమాత్‌లో పాలొన్నారు. వీరి నుంచే అనేక మందికి వైరస్ విస్తరించినట్లు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెలుగు చూస్తున్న పాజిటివ్ బాధితులంతా ఢిల్లీలో వారితో కలిసి సమావేశంలో పాల్గొన్న వారే కావడం గమనార్హం. ఇలా ఇండోనేసియా నుంచి ఢిల్లీకి...అటు నుంచి హైదరాబాద్‌కు వైరస్ విస్తరించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏ బస్తీ నుంచి ఎంత మంది వెళ్లి వచ్చారంటే..? ♦ మియాపూర్‌లో అదుపులోకి తీసుకున్న 15 మందిలో 10 మంది ఆరోగ్య పరిస్థితి అనుమానాస్పదంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ♦ కూకట్పల్లి జోన్ నుంచి 40 మంది వెళ్లిరాగా, వీరిలో ఒకరికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. మరో తొమ్మిది మందికి గాంధీలో వైద్య పరీక్షలు చేయించగా వారికి నెగిటివ్ వచ్చింది. 30 మందిని క్వారంటైన్లో ఉంచారు. ♦ కుత్బుల్లాపూర్ నుంచి ఒక వ్యక్తి వెళ్లి వచ్చాడు. ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన కుటుంబంలో మరో ముగ్గరికి పాజిటివ్ వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రార్థనామందిరంలో మరో 40 మందితో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధి బృందంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు వారిలో 8 మందిని మాత్రమే గుర్తించి, వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. మిగిలిన వారి ఆచూకీ లభించకపోవడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. ♦ ఎల్బీనగర్ నుంచి నలుగురు వ్యక్తులు ఢిల్లీ వెళ్లి రాగా, వీరిలో ఇప్పటికే ఇద్దరు గాంధీలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు విజయవాడలో ఉన్నారు. ♦ సికింద్రాబాద్ నుంచి 14 మంది, మల్కాజ్గిరి నుంచి 5, ముషీరాబాద్ నుంచి 6, బేగంపేట నుంచి 14 మంది, అంబర్‌పేట నుంచి 21 మంది ఢిల్లీ జమాత్‌కు వెళ్లి రాగా, వీరిలో 11 మంది గాంధీ, ఛాతి ఆస్పత్రుల్లో ఉండగా, మరో 39 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ♦ పాతబస్తీ నుంచి మొత్తం 128 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే పలువురికి పాజిటివ్ వచ్చింది. చంచల్‌గూడ, నూర్ఖాన్ బజార్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే మృతి చెందారు. మరో 15 మంది పాజిటివ్ వచ్చింది. వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ♦ రాజేంద్రనగర్ నుంచి ఆరుగురు వ్యక్తులు వెళ్లిరాగా, వారిని ఇప్పటికే గుర్తించారు. వీరిలో ఇప్పటికే పలువురు కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో చికిత్స కోసం గాంధీకి తరలించారు. ♦ గచ్చిబౌలి నుంచి 8 మంది ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చారు. వీరు మరో ఏడుగురికి క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నారు. వీరందరినీ గాంధీకి పంపి వైద్య పరీక్షలు చేయించారు. వీరిలో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఛావుని ప్రాంతంలో ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు తెలియగానే జీహెచ్ఎంసీ, పోలీసు, వైద్య శాఖ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిసర ప్రాంతాలన్నింటినీ శానిటైజేషన్ చేసారు. అతనితో నేరుగా కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అవసరమైన మేరకు అందరికి వైద్య పరీక్షలు చేయించడానికి సిద్ధమవుతున్నారు. అతనితో నేరుగా కలిసిన వారందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. 15 మందికి పాజిటివ్: జమాత్ నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు సోకిన కరోనా వైరస్ సాక్షి, సిటీబ్యూరో: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే 15 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యుల్లోనే ఈ కేసులన్నీ నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి సంఖ్య తెలంగాణలో 97కు చేరింది. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా, మరో 14 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం గాంధీ, ఛాతి ఆస్పత్రుల్లో 77 మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తి ఇంట్లోనే మరో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. వీరికి లోకల్ కాంటాక్ట్ ద్వారానే వైరస్ వ్యాపించింది. తెలంగాణ సచివాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురిలో కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనిఖీల్లో 200 బృందాలు ఢిల్లీకి వెళ్లివచ్చిన నగరవాసులు 603 మందిలో ఎవరెవరెవరు..ఎక్కడ ఉన్నదీ తెలుసుకునేందుకు 200 బృందాలు రంగంలోకి దిగాయి. రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ, వైద్యశాఖలకు చెందిన ఉద్యోగులతో ఏర్పాటు చేసిన బృందాలు ఇప్పటికే 463 మంది ఇళ్లను తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 74 మందికి ఆరోగ్య సమస్యలు, కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షల నిమిత్తం గాంధీ, ఛాతి హాస్పిటల్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వీరిలో 348 మందిని హోం క్వారంటైన్ చేయగా, మరో 41 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. మిగిలిన వారి అడ్రసులు సరిగా లేనందున, వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ టీమ్స్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారి కుటుంబ సభ్యులను కూడా హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. వృద్ధులు, తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారిని, ఇళ్లల్లో తక్కువ స్థలం వున్న వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. -
కౌలాలంపూర్ నుంచి అంటుకుందా?
సాక్షి, న్యూఢిల్లీ: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఒక్క సదస్సు దక్షిణాసియాలోని అనేక దేశాలు ఇప్పుడు వణికిపోయేలా చేస్తోంది. దక్షిణాసియాలోని పలు దేశాల్లో కరోనా సోకిన వారిలో అత్యధికులు తబ్లిగి జమాత్ సదస్సులకు హాజరైన వారే ఉన్నారు. నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంగా అంతర్జాతీయంగా ఇస్లాం మత బోధన చేస్తున్న తబ్లిగి జమాత్ సంస్థకు వందేళ్ల చరిత్ర ఉంది. ప్రవక్త చెప్పిన ఇస్లాం జీవనశైలి కలిగి ఉండాలని బోధిస్తుంది. ఈ సంస్థ కౌలాలంపూర్‌లోని పెటాలింగ్ మసీదులో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు 16 వేల మందితో సదస్సు నిర్వహించింది. దీనికి 1500 మంది విదేశీయులు హాజరయ్యారు. సదస్సుకు హాజరైన 34 ఏళ్ల మలేసియన్ 17న మృతిచెందాడు. అక్కడి పాజిటివ్ కేసుల్లో మూడో వంతు కేసులు జమాత్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తులవేనని వార్తలొచ్చాయి. సదస్సుకు హాజరైనS ప్రతినిధులు తమ సొంత దేశాల్లో, ఇతర దేశాల్లో ఆ వైరస్ వ్యాప్తికి కారణమయ్యారు. కౌలాలంపూర్ సదస్సుకు హాజరైన ఇండోనేసియన్లలో 31 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్æ సమావేశాల్లో పాల్గొన్నారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు ఇలా.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న తబ్లిగి జమాత్ మర్కజ్‌కు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది ఏడాది పొడవునా జరుగుతుంది. తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జనవరి 1 నుంచి మన దేశానికి 2,100 మంది ప్రతినిధులు రాగా.. మార్చి 21 నాటికి 1040 మంది ప్రతినిధులు దేశంలోనే ఉన్నారని, మిగిలిన వారు లాక్ డౌన్‌కు ముందే వెళ్లిపోయి ఉంటారని కేంద్ర హోం శాఖ తెలిపింది. మార్చి 21 నాటికి దేశవ్యాప్తంగా 824 మంది విదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉండగా.. మర్కజ్లో 216 మంది ఉన్నారని ప్రకటించింది. 1500 మంది స్వదేశీ ప్రతినిధులు మర్కజ్లో ఉన్నట్టు తెలిపింది. 2,100 మంది స్వదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించే పనిలో ఉన్నట్టు తెలిపింది. ఢిల్లీలో మార్చి 13–15తేదీల్లో ‘ఇజ్తెమా’ పేరుతో జరిగిన సమావేశాలకు నాలుగైదు వేల మంది స్వదేశీ, విదేశీ ప్రతినిధులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ముందే కౌలాలంపూర్ సదస్సులో పాల్గొన్న 31 మంది ఇండోనేసియా దేశస్తులు, ఇతర దేశస్తులు ఢిల్లీ చేరుకుని మర్కజ్లో సమావేశాలకు హాజరైనట్టు తెలుస్తోంది. దేశం నలుమూలలకు.. : ‘ఇజ్తెమా’ ముగిసిన తరువాత మార్చి 16 నుంచి అనేకమంది తమ స్వస్థలాలకు వెళ్లడం ప్రారంభించారు. మార్చి 22 నాటి జనతా కర్ఫ్యూ అనంతరం మార్చి 23న 1500 మంది స్వస్థలాలకు వెళ్లిపోయారని, లాక్డౌన్ ప్రకటనతో సమావేశాలు నిలిపి వేశామని, కానీ విధిలేని పరిస్థితుల్లో వెయ్యి మంది అందులోనే ఉండిపోవాల్సి వచ్చిందని తబ్లిగి జమాత్ వెల్లడించింది. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు వాహనాలను అనుమతించాల్సిందిగా తాము సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశామని, ఇదే విషయాన్ని హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇచ్చిన నోటీస్‌కు జవాబులో తెలిపామని వివరించింది. చట్టబద్ధమైన ఆదేశాలను తాము ఉల్లంఘించలేదని పేర్కొంది. అయితే తాజాగా వీరిలో 24 మందికి కరోనా పాజిటివ్ తేలిందని, కరోనా లక్షణాలు ఉన్న 411 మందిని ఆసుపత్రులకు పంపామని ఢిల్లీ సీఎం ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 1339 మంది జమాత్ ప్రతినిధులను క్వారంటైన్‌కు తరలించామని హోం శాఖ ప్రకటించింది. టూరిస్ట్ వీసాపై వచ్చి మతపరమైన మిషనరీ పనుల్లో పాల్గొనరాదని ఇదివరకే హోం శాఖ ఆదేశాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆయా ప్రతినిధుల వీసా కేటగిరీని తనిఖీ చేయాలని రాష్ట్రాల పోలీస్ యంత్రాంగానికి సూచనలు ఇచ్చామని తెలిపింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధులను, వారికి జిల్లాల వారీగా, స్థానికంగా సమన్వయం చేస్తున్న 2,137 మంది స్వదేశీ ప్రతినిధులను స్క్రీనింగ్ చేసి క్వారంటైన్‌కు తరలించినట్టు తెలిపింది. వీరందరూ ఎక్కడెక్కడ తిరిగారో వారి కదలికలను గుర్తించాలని రాష్ట్రాలను మార్చి 29న ఆదేశించినట్టు తెలిపింది. పాజిటివ్ కేసులు ఇలా వెలుగులోకి.. నిజాముద్దీన్æ సమావేశాలకు హాజరై స్వస్థలాలకు వెళ్లిన వారిలో పలువురికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో రామగుండంకు వచ్చిన ఇండోనేసియన్లలో 10 మందికి మార్చి 20నే పాజిటివ్ అని తేలింది. ఈ సదస్సుకు హాజరైన కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి మార్చి 26న తన స్వస్థలంలో కరోనాతో మరణించారు. మార్చి 27న మర్కజ్ నుంచి ఆరుగురిని, 28న 33 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అండమాన్‌లో బయటపడ్డ పాజిటివ్ కేసులకు మర్కజ్ సమావేశాలకు సంబంధం ఉన్నట్టు తేలింది. ఇతర దేశాల్లోనూ ఇదే తీరు.. దక్షిణాసియాలోని వివిధ దేశాల్లో కేసులకు కౌలాలంపూర్ సదస్సుకు లింక్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. మలేషియాలో 2,400 కేసుల్లో మూడో వంతు కేసులకు ఈ సదస్సుకు సంబంధం ఉందని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. లాహోర్ సమీపంలో గల రాయ్‌విండ్‌లో తబ్లిగీ జమాత్ అక్కడి మర్కజ్లో వార్షిక సదస్సు నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ సభ్యులు 27 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏ ప్రాంతాల వారు హాజరయ్యారు మర్కజ్‌కు గడిచిన రెండు నెలలుగా ఇండోనేసియా, నేపాల్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, మయన్మార్, అల్జీరియా, కిర్గిస్తాన్, ఇంగ్లండ్, సింగపూర్ దేశాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే మన దేశం నుంచి 20కి పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు ఐదారు వేలకు మందికి పైగా ప్రతినిధులు హాజరైనట్టు ప్రాథమిక అంచనా. తబ్లిగి సమావేశాలకు హాజరైన వారిని గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్, అసోం, మణిపూర్‌లతోపాటు కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కర్ణాటక నుంచి 54 మంది పాల్గొనగా 13 మందిని గుర్తించామని వీరందరికీ వైరస్ సోకలేదని పరీక్షల ద్వారా స్పష్టమైందని ఆ రాష్ట్రం తెలిపింది.హిమాచల్ ప్రదేశ్ నుంచి 17 మంది ఈ సమావేశాలకు హాజరయ్యారని అంచనా. కాగా దేశవ్యాప్తంగా తబ్లిగి జమాత్ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధుల వివరాలను కేంద్రం సేకరించింది. ఇలా తెలంగాణలో 82 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 24 మంది విదేశీ ప్రతినిధులు ఉన్నట్టు తెలిపింది. -
‘అందువల్లే కరోనా కేసులు పెరిగాయి’
నెల్లూరు: కరోనా వైరస్ అనేది ఊహించని విపత్తని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. ఏపీలో ఈ వైరస్ ఎక్కువ మందికి సోకకుండా నిరోధించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ముందస్తు చర్యలు మంచి ప్రయోజనం ఇస్తున్నాయన్నారు. కాగా, ఒక్కసారిగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంపై మంత్రి ఆళ్లనాని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటివరకూ రాష్ట్రంలో 23 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, ఇవాళ ఒక్కసారిగా ఆ సంఖ్య 40కి చేరిందన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారితోనే ఒక్కసారిగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయన్నారు. (ఢిల్లీ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి 1030 మంది!) ఢిల్లీకి వెళ్లివచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైనా దానిని నెగిటివ్ మార్చిన ఘనత జిల్లా యంత్రాంగానిదేనన్నారు. ఇందుకు వారి అందర్నీ అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి 30, 995 మంది విదేశాల నుంచి వచ్చారని, వారిలో 30, 693 మంది హోమ్ క్వారంటైన్లో ఉంచి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు 30 మంది ఐపీఎస్ అధికారులను నియమించామని, పట్టణాలు, నగర పాలక సంస్థలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా నిర్ధారణ ల్యాబ్ ల సంఖ్య పెంచడంతో పాటు అవసరమైన వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రజలను ఇళ్లలో ఉంచడం అంటే తాళాలు వేయడం కాదన్నారు. వారికవసరమైన నిత్యావసరాలను అందజేయడం కూడా ప్రభుత్వ బాధ్యతేనన్నారు. కరోనా నివారణలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వైద్యులు పారిశుద్ధ్య సిబ్బంది సహా అందరినీ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించామని, దుకాణాల ముందు ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఆళ్లనాని హెచ్చరించారు. (సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్) -
ఢిల్లీ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి 1030 మంది!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అక్కడకు మత ప్రార్థనలకు వెళ్లినవారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి ఢిల్లీ ప్రార్ధనలకు 1030 మంది వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. వారిలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి నుంచి 603 మంది హాజరైనట్టు మంగళవారం వెల్లడించింది. (చదవండి: ఆరుకు చేరిన మరణాలు..) నిజామాబాద్ 80, నల్లగొండ 45, వరంగల్ అర్బన్ 38, ఆదిలాబాద్ 30, ఖమ్మం 27, నిర్మల్ 25, సంగారెడ్డి 22 మంది మర్కజ్ మసీదు ప్రార్థనల్లో పాల్గొన్నారని తెలిపింది. కాగా, ‘ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. (చదవండి: ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు) -
మసీదుకు సీల్ వేసిన ఢిల్లీ అధికారులు
-
నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదు మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మర్కజ్లో ఈ నెల నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మసీదును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు మసీదుకు సీల్ వేశారు. అలాగే మర్కజ్లో ప్రార్థనలు నిర్వహించిన మతపెద్దలపై పోలీసు కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో మర్కజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో అక్కడి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. (తెలంగాణలో కరోనా కల్లోలం) కాగా మర్కజ్ ప్రార్థనలకు ఇండోనేషియా, థాయ్‌లాండ్, నేపాల్, మలేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన దాదాపు 280 మంది హాజరయ్యారు. దీంతో ఆ ప్రార్థనలో పాల్గొన్న వారికి వైరస్ సోకే అవకాశం ఉందని ఢిల్లీ వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసిన కరోనా మూలాలు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మర్కజ్లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీనిలో తెలంగాణకు చెందిన ఆరుగురు, కశ్మీర్‌కు చెందిన ఒకరు మరణించడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరోవైపు ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందికిపైగా కరోనా అనుమానితులను అధికారులు క్వారెంటైన్‌ను తరలించారు. వీరిలో ఇప్పటి వరకు 24 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని ప్రభుత్వ కోరుతోంది. ఇక ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం అధికారులు జల్లెడపడుతున్నారు. -
కరోనా ఎఫెక్ట్; అక్కడ పోలీసుల తనిఖీలు
సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ వైద్య శాఖ అధికారుల సహాయంతో దాదాపు 200 మందిని కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రాంతంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడం, మరికొందరిలో కోవిడ్ లక్షణాలు కనబడటంతో ‘నిజాముద్దీన్’పై పోలీసులు దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో కార్డన్ సర్చ్ చేపట్టి విస్తృత తనిఖీలు చేపట్టారు. నిజాముద్దీన్ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసుల జల్లెడ పడుతున్నారు. ప్రార్ధనలకు హాజరైన వారిని వివరాలపై ఆరా తీస్తున్నారు. మార్చి 10న స్థానిక నిజాముద్దీన్ మార్కజ్ మసీదులో జరిగిన మత కార్యక్రమానికి మలేసియా, ఇండోనేసియా, సౌదీ అరేబియా, కిర్గిజిస్తాన్ దేశాలకు చెందిన యాత్రికులు హాజరయ్యారు. వీరి ద్వారా కరోనా వైరస్ స్థానికులకు వ్యాపించినట్టు అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక్కడికి వచ్చివెళ్లిన మతగరువు గతవారం శ్రీనగర్‌లో మృతి చెందారు. నిజాముద్దీన్‌కు రావడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లోని దియోబండ్ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ‘రెండు రోజుల క్రితం 30 మందిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఢిల్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించాం. వీరిలో ఏడుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణయింది. నిజాముద్దీన్ ప్రాంతం నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జనాన్ని బృందాల వారీగా కరోనా నిర్ధారణ పరీక్షలకు తరలించాలని నిర్ణయించామ’ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఎంతమందిని తరలించారనేది కచ్చితంగా వెల్లడించలేదు. (కోవిడ్-19: ఖైదీలకు శుభవార్త) కాగా, ఇప్పటివరకు ఒక్క కోవిడ్-19 కేసు నమోదు కాలేదని నిజాముద్దీన్ మార్కజ్ మసీదు అధికార ప్రతినిధి డాక్టర్ మహ్మద్ షోయబ్ తెలిపారు. జలుబు, దగ్గుతో సహా ఎటువంటి అనారోగ్య లక్షణాలున్నా అటువంటి వివరాలు ప్రభుత్వాధికారులకు అందజేశామని చెప్పారు. వయసు, ప్రయాణ చరిత్ర(ట్రావెల్ హిస్టరీ) ఆధారంగా కొంత మంది ఆస్పత్రుల్లో చేరారని తెలిపారు. (కేజ్రివాల్ ప్రభుత్వం కీలక చర్యలు) -
వైఎస్సార్సీపీలో చేరిన పార్థసారధి రెడ్డి
సాక్షి, నంద్యాల: ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల వెల్లువ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. నంద్యాల సభలో పార్థసారధి రెడ్డికి వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన వెలుగోడు మండల జెడ్పీటీసీ లాల్‌స్వామి, డాక్టర్ రవికృష్ణ తదితరులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్‌ను సీఎంగా చూడాలి: నిజాముద్దీన్ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దీన్ అభిప్రాయపడ్డారు. తన అనుచరులతో కలిసి ఆయన గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు వైఎస్ జగన్ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిజాముద్దీన్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి అనుభవం లేకపోయినా తనను నమ్మి ఎంపీగా అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవడానికి వైఎస్సార్సీపీలో చేరినట్టు చెప్పారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని చెప్పారు. మహానేత వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. -
అనంతపురం జిల్లా టీడీపీకి భారీ షాక్
-
కన్నకొడుకును కడసారి చూసుకోలేదు..
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నిజామోద్దీన్ తల్లి మృతి కోరుట్ల : చివరిక్షణంలోనైనా చిన్నకొడుకు తన చెంతకు చేరతాడని ఆశపడ్డ ఆ తల్లి ఆశలు ఆవిరయ్యాయి. ‘కొడుకా... వనం వీడి జనంలోకి రా..’ అంటూ ఆ మాతృమూర్తి పడ్డ ఆరాటం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నిజాముద్దీన్‌ను కరిగించలేకపోయింది. ఏ క్షణంలోనైనా కొడుకు తనను చూసేందుకు వస్తాడని ఆశపడ్డ ఆ తల్లి చివరికి తుదిశ్వాస విడిచింది. 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లి ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నిజాముద్దీన్ తల్లి రాజుబీ(88) బుధవారం అనారోగ్యంతో కన్నుమూసింది. కోరుట్ల రవీంద్రరోడ్ ఏరియాలో నివాసముంటే ఫక్రుద్దీన్–రాజుబీ దంపతులకు ఎనిమిది మంది సంతానం. వీరిలో ఐదుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. మగవాళ్లలో అందరికీ కంటే చిన్నవాడైన నిజాముద్దీన్‌పై తల్లి రాజుబీకి అంతులేని ప్రేమ. 30 ఏళ్ల క్రితం 1980–83 సమయంలో కోరుట్లలో డిగ్రీ చదువుతున్న సమయంలో నిజాముద్దీన్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా కొనసాగాడు. 1985లో పీపుల్స్‌వార్‌లో అజ్ఞాత సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత పీపుల్స్‌వార్ టెక్ ఇన్చార్జిగా కొనసాగారు. పలు కీలక కేడర్లలో పనిచేసిన నిజాముద్దీన్ ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అజ్ఞాతంలోకి వెళ్లిన నాటి నుంచి తన తల్లిదండ్రులను ఏనాడు కలుసుకోకపోవడం గమనార్హం. ఏడాదికోసారి పోలీసులు వచ్చి నిజాముద్దీన్‌ను జనజీవన స్రవంతిలో కలవాలని కోరాలని చెప్పినప్పుడల్లా కొడుకు కోసం రాజుబీ కన్నీరుమున్నీరుగా విలపించేది. ఎప్పటికైనా కొడుకు తన వద్దకు చేరతాడని ఆశపడేది. మూడేళ్ల క్రితం తండ్రి ఫక్రుద్దీన్ చనిపోయిన సమయంలోనూ నిజాముద్దీన్ జాడ తెలియరాలేదు. ప్రస్తుతం తల్లి రాజుబీ చనిపోవడంతో మరోసారి ఈ ప్రాంతవాసులు నిజాముద్దీన్ ఎక్కడున్నాడో అని చర్చించుకుంటున్నారు. -
హైదరాబాద్‌లో మళ్లీ ఐసిస్ కలకలం
-
హైదరాబాద్‌లో మళ్లీ ఐసిస్ కలకలం
బంగ్లాదేశ్‌లో పేలుళ్లకు పాల్పడి పలువురి ప్రాణాలు బలిగొన్న ఐఎస్ఐఎస్ తదుపరి లక్ష్యం భారతదేశమేనా? ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ సానుభూతిపరుల ద్వారా ఉగ్రదాడులు చేయించడానికి ఐఎస్ పావులు కదుపుతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని సంతోష్‌నగర్ ప్రాంతంలో మరో ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈదీబజార్ ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్‌గా ఆ సానుభూతిపరుడిని గుర్తించారు. అతడిని విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయానికి తరలించారు. ఇటీవలే కేంద్ర నిఘా విభాగం నుంచి అందిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ వర్గాలు హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాలలో సోదాలు చేసి ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకోవడంతో నగరంలో ఐసిస్ వేళ్లూనుకోడానికి ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
90 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్
గోషామహల్ ప్రాంతంలో పామోయిల్తో కల్తీ చేసిన 90 లీటర్ల నెయ్యిని హైదరాబాద్ టాస్క్ పోలీసులు పట్టుకున్నారు. కల్తీ నెయ్యిని విక్రయిస్తున్న దినేష్ పాండియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 90 లీటర్ల నెయ్యిని సీజ్ చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. నగరంలోని ముర్గీచౌక్ నుంచి హసన్‌నగర్‌కు చెందిన మహ్మాద్ నిజాముద్ధీన్, మహ్మాద్ యూసుఫ్‌తో కలిసి చికెన్ వెస్టేజ్తో తయారు చేసిన 555 లీటర్ల అయిల్ను తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చే శారు. ఈ దాడి నుంచి మహ్మాద్ యూసుఫ్ తప్పించుకున్నారు. దోరికిన మహ్మాద్ నిజాముద్ధీన్ నుంచి స్వాధీనం చేసుకున్న 555 లీటర్ల అయిల్ను సీజ్ చేసి , ఆయనను ఆరెస్టు చేసి ,స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మీతోనే వస్తానంటే.. నేతాజీ వద్దన్నారు
అజాంగఢ్: నేను మీతోనే వస్తాను....వద్దు... నీవు వెనక్కి వెళ్లు... మిగతా వాళ్ల సంగతి చూడు అంటూ భారత స్వాతంత్ర్య సమర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ తనను ఆదేశించారు.... ఆయన అజ్ఞని శిరసా వహించానని నేతాజీ సన్నిహిత సహచరుడు నిజాముద్దీన్ తెలిపారు. సోమవారం ఉత్తరప్రదేశ్ అజాంగఢ్ జిల్లాలోని దుక్వాలో 114 ఏళ్ల నిజాముద్దీన్‌ను నేతాజీ సమీప బంధువు రాజశ్రీ చౌదరి కలిశారు. నేతాజీతో తనకు గల అనుబంధాన్ని నిజాముద్దీన్ ఈ సందర్భంగా నెమరేసుకున్నారు. బర్మా - థాయలాండ్ సరిహద్దు సమీపంలో సితంగ్‌పూర్ నది వద్ద ఆయన్ని దింపానని... ఆ తర్వాత మళ్లీ ఆయన్ని కలుసుకోలేక పోయానని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా తాను మీతోనే వస్తానంటూ నేతాజీపై విధంగా స్పందించారన్నారు. నేతాజీని కడసారి అప్పుడే చూశానని చెప్పారు. ఆ తర్వాత ఆయన్ని మళ్లీ జీవితంలో చూడలేకపోయాన్నారు. నిజాముద్దీని స్వహాస్తాలతో తన తలను నిమిరి ఆశీర్వదించారని రాజశ్రీ తెలిపారు. -
ఆత్మహత్య చేసుకుంటా...
విద్యుత్ స్తంభం ఎక్కి వికలాంగుడి హల్చల్ స్తంభించిన ట్రాఫిక్ కాటేదాన్: అప్పుల బాధకు తోడు... చోరీ నింద మోపండంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ శారీరక వికలాంగుడు బుధవారం ఆరాంఘర్ చౌరస్తాలోని 33 కేవీ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్రసంచలనం సృష్టించింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, బాధితుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం....మైలార్‌దేవ్‌పల్లి ఉడెంగడ్డకి చెందిన నిజాముద్దీన్(35), సల్మా దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. నిజాముద్దీన్ గతంలో ఓ కంపెనీలో పనిచేస్తుండగా అతని ఎడమ చేయి మిషన్‌లో పడి వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. ప్రస్తుతం ఇతను ఆరాంఘర్ చౌరస్తాలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఇతను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా... నిజాముద్దీన్ పనిచేసే కంపెనీ పక్కనే స్క్రాప్ గోదాం ఉంది. గత మంగళవారం ఆ గోదాంలో రూ.20 వేలు చోరీ అయ్యాయని, ఆ డబ్బు నిజాముద్దీన్ అపహరించాడని గోదాం యజమాని ఆరోపించాడు. దీంతో తీవ్రమనోవేదనకు గురైన నిజాముద్దీన్ బుధవారం 5 గంటలకు ఆరాంఘర్ వైష్ణవి హోటల్ పక్కనేగల 33 కేవీ విద్యుత్ స్తంభంపైకి ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. విషయం తెలుసుకున్న ఏఈ కిషోర్ వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో సుమారు 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్‌దేవ్‌పల్లి సీఐ జావీద్.... స్తంభం దిగి కిందకు రావాలని నిజాముద్దీన్‌ను ఎంతగా కోరినా వినిపించుకోలేదు. దీంతో అతడిని కిందకు దించేందుకు ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రిజ్వాన్ స్తంభంపైకి ఎక్కాడు. అయితే, ఎమ్మెల్యే వచ్చి తన సమస్యలు పరిష్కరిస్తానని, ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానని హామీ ఇస్తేగాని స్తంభంపై నుంచి కిందకు దిగే ప్రసక్తేలేదన్నాడు. చివరకు పోలీసు అతడిని బుజ్జగించి రాత్రి 7 గంటలకు కిందకు దించి, స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనతో కాటేదాన్, ఎన్డీఏ సబ్స్టేషన్లకు సుమారు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.