వైఎస్సార్‌సీపీలో చేరిన పార్థసారధి రెడ్డి | Bijjam Parthasarathi Reddy Joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన పార్థసారధి రెడ్డి

Published Thu, Apr 4 2019 4:52 PM | Last Updated on Thu, Apr 4 2019 5:19 PM

Bijjam Parthasarathi Reddy Joins YSR Congress Party - Sakshi

ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికల వెల్లువ కొనసాగుతోంది.

సాక్షి, నంద్యాల: ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికల వెల్లువ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. నంద్యాల సభలో పార్థసారధి రెడ్డికి వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన వెలుగోడు మండల జెడ్పీటీసీ లాల్‌స్వామి, డాక్టర్‌ రవికృష్ణ తదితరులు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

జగన్‌ను సీఎంగా చూడాలి: నిజాముద్దీన్‌
రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దీన్‌ అభిప్రాయపడ్డారు. తన అనుచరులతో కలిసి ఆయన గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు వైఎస్‌ జగన్‌ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిజాముద్దీన్‌ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి అనుభవం లేకపోయినా తనను నమ్మి ఎంపీగా అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవడానికి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు చెప్పారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని చెప్పారు. మహానేత వైఎస్సార్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement