
కాగా, వైరస్ బారినపడ్డ సదరు యువకుడికి ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలడం కలవరం పుట్టిస్తోంది.
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టిస్తున్న మహమ్మారి కరోనా జిల్లాలో తొలిసారి బయటపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వేములవాడకు చెందిన నలుగురు వ్యక్తులకు రెండవసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, వైరస్ బారినపడ్డ సదరు యువకుడికి ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలడం కలవరం పుట్టిస్తోంది. ఇక, తెలంగాణలో ఇప్పటివరకు 471 కరోనా కేసులు నమోదవగా.. 12 మంది మృతి చెందారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
(చదవండి: కరీంనగర్‌లో కరోనా కేసులు ఇలా...)
(చదవండి: లాక్‌డౌన్: దండంపెట్టి చెబుతున్నా..!)