దాక్కున్న ఆ 21 మందికి కరోనా | Coronavirus : 21 Tablighi Jamaat Members Tests Positive In Maharashtra | Sakshi
Sakshi News home page

కరోనా కలకలం: దాక్కున్న ఆ 21 మందికి పాజిటివ్‌

Published Sat, Apr 11 2020 9:42 AM | Last Updated on Sat, Apr 11 2020 9:42 AM

Coronavirus : 21 Tablighi Jamaat Members Tests Positive In Maharashtra - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : మహమ్మారి కరోనా వైరస్‌ మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ల సంఖ్య కుప్పలుకుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగి జమాత్‌ అనంతరం మహారాష్ట్రలో కేసులు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. అయితే మర్కజ్‌కు వెళ్లిన వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న వారు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ సమావేశానికి వెళ్లిన వారి జాబితాను రూపొందించి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ముంబైకి సమీపంలోని ముబ్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది.
 
ముబ్రా పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ పోలీస్‌ సీనియర్‌ అధికారి చేసిన ప్రత్యేక తనిఖీల్లో 21 మంది విదేశీయులు పట్టుబడ్డారు. వీరందరూ మర్కజ్‌లో పాల్గొన్నవారిగా తేలింది. అయితే ఈ 21 మంది విదేశీయులకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలడంతో చికిత్స నిమిత్తం క్వారంటైన్‌కు తరలించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తనిఖీలను ముమ్మరం చేసింది. వీరు ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారనే దాని ఆరా తీస్తున్నారు.  

కాగా, వీరికి అక్రమంగా ఆశ్రయం ఇచ్చిన స్థానిక మసీదులు, పాఠశాలలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మర్కజ్‌ సమావేశం తర్వాత తమిళనాడు నుంచి ముంబై మీదుగా ముబ్రాకు చేరుకున్నట్లు పోలీసుల విచారణ తేలింది. ఈ 21 మందిలో 13 మంది బంగ్లాదేశీయలు, 8 మంది మలేషియన్లుగా గుర్తించారు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడం చట్టపరంగా నేరమని ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.  

చదవండి:
తబ్లిగి జమాత్‌ సభ్యుల వికృత చర్య
భార్యతో సైకిల్‌పై 120 కిలోమీటర్లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement