న్యూఢిల్లీ: తబ్లిగీ జమాతే ప్రార్థనల్లో పాల్గొన్నవారి మొత్తం సంఖ్య 16,500 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో మార్చి 13 నుంచి 24 వరకు జరిగిన ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దాంతో వారు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో మరికొంత మంది వైరస్ బారినపడ్డారు. ఇక జమాతే హెడ్ క్వార్టర్స్ మర్కజ్ మసీదును ఆయా తేదీల్లో సందర్శించిన వారిని సెల్‌ఫోన్ డేటా ఆధారంగా గుర్తించామని జమాతే విచారణలో భాగమైన ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ప్రార్థనల్లో పాల్గొన్న 16,500 మందిని గుర్తించడానికి భారీ కసరత్తు చేశామని తెలిపారు.
(చదవండి: 30% కేసులకు మర్కజ్ లింక్)
ప్రార్థనల్లో పాల్గొన్నవారితో కాంటాక్ట్ అయిన 15 వేల మంది వివరాలు సేకరించడానికి బాగా శ్రమించాల్సి వచ్చిందన్నారు. వారందరినీ ట్రేస్ చేయడానికి అన్ని రకాల పోలీసుల సేవలను వినియోగించుకున్నామని చెప్పారు. ఇక మార్చి 24న నుంచి అమల్లో కొచ్చిన లాక్‌డౌన్‌తో కొందరు మర్కజ్‌లోనే చిక్కుకుపోవడంతో.. మార్చి 29 నుంచి 31 వరకు ఢిల్లీ పోలీసులు అక్కడున్న 2300 మందిని ఖాళీ చేయించారు. ఇక దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 30 శాంత కేసులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మర్కజ్‌తో ముడిపడి ఉన్నవే కావడం గమనార్హం.
కాగా, తబ్లిగీ జమాతే కార్యక్రమాన్ని లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించడంపై జమాతే చీఫ్ మౌలానా సాద్‌పై కేసు నమోదైన విషయం విదితమే. ఇప్పటికే సాద్‌పై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. ఆ సమ్మేళనానికి విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వారా విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు.
(చదవండి: తబ్లిగీ జమాత్ చీఫ్‌కు ఐదోసారి నోటీసులు)
Comments
Please login to add a commentAdd a comment