
కేప్‌టౌన్ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన ఓ విదేశీయుడు కరోనా వైరస్ సోకి మృతి చెందారు. దక్షిణాఫ్రికాకు చెందిన మౌలానా యూసఫ్ టుట్లా (80) ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్‌కు హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్లిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కాగా మర్కజ్‌కు వెళ్లిన వారికి కరోనా సోకడం భారత్‌లోనూ తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసింది. ఇప్పటికే అనేక పాజిటివ్ కేసులతో పాటు మరణాలూ సంభవించాయి. (భారత్ సహాయాన్ని కోరిన ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment