
గుమ్నానీ బాబా.. నేతాజీయేనా?!
సాక్షి, లక్నో : నేతాజీ సుభాస్ చంద్రబోస్.. స్వంతత్ర పోరాటంలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన పేరు. ఇండియన్ ఆర్మీ వ్యవస్థాపకుడిగా.. చరిత్రలో నిలిచినపేరు. ఫ్రీడమ్ ఫైట్ లో ఆయనదంటూ ప్రత్యేక శైలి. జపాన్ వెళ్లినా.. జర్మనీ స్నేహం చేసినా అంతా కొత్త పంథానే. ఆయన జీవితం ఎంత రహస్యంగా గడిచిందో.. ఆయన మరణం కూడా అంతే నిగూఢంగా మిగిలిపోయింది.
గుమ్నానీ బాబానే నేతాజీ అని నమ్మేవాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ తాజాగా జస్టిస్ విష్ణు సాహి తన నివేదికను ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ కు సమర్పించారు.స్వతంత్రానంతరం నేతాజీ గుమ్నానీ బాబాగా రహస్యంగా జీవించారని స్థానికులు నమ్ముతున్నట్లు ఆయన తన నివేదికలు వెల్లడించారు. మెజారిటీ సాక్షులు ఇదే విషయాన్న ధృవీకరిస్తున్నారని చాహల్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
గుమ్నానీ బాబానే నేతాజీ అంటూ గత ఏడాది అలహాబాద్ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై స్పందించింన హైకోర్టు.. గుమ్నానీ బాబా విషయాన్ని తేల్చేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ విష్ణు సాహి నేతృత్వంలో ఒక కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ ఏడాదిపాటు పూర్తిగా విచారణ చేసి విలువైన సమాచారాన్ని సేకరించింది.