
నేతాజీకి భారతరత్న అవసరంలేదు
నేతాజీకి భారతరత్న అవార్డు అవసరం లేదని ఆయన బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్పేయితో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు దేశ అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై బోస్ బంధువులు స్పందించారు. నేతాజీకి భారతరత్న అవార్డు అవసరం లేదని ఆయన బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ప్రతిపాదనకు తాము మొదట్నుంచి వ్యతిరేకమని, బంధువుల్లో అత్యధికమంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని బోస్ మునిమనవడు చంద్ర కుమార్ బోస్ అన్నారు. నేతాజీ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని, ఇదే తాము కోరుకుంటున్నామని చెప్పారు.