నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైవాన్‌లో విమాన ప్రమాదంలో చనిపోయినట్టు డాక్యుమెంట్లు బయటపెట్టిన బోస్‌ఫైల్స్. ఇన్ఫో వెబ్‌సైట్..
లలండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైవాన్‌లో విమాన ప్రమాదంలో చనిపోయినట్టు డాక్యుమెంట్లు బయటపెట్టిన బోస్‌ఫైల్స్. ఇన్ఫో వెబ్‌సైట్.. ఆయన చితాభస్మం తైపీ నుంచి టోక్యోలోని రెంకోజీ ఆలయానికి వెళ్లిన క్రమాన్ని సోమవారం వెల్లడించింది. 1945 ఆగస్టు 22 నేతాజీ అంత్యక్రియలు జరగ్గా మరుసటి రోజు ఆయన సహాయకుడు కల్నల్ రెహ్మన్, జపాన్ ఆర్మీ అధికారి మేజర్ నగటోమోల, జపాన్ దుబాసీ నకమురాలు చితాభస్మాన్ని తైవాన్‌లోని నిషి హాంగాజీ ఆలయానికి తీసుకెళ్లారు.
తర్వాత విమానంలో తైపీ నుంచి విమానంలో జపాన్ తీసుకెళ్లారు. జపాన్ ఆర్మీ అధికారి చితాభస్మం ఉన్న ప్యాకెట్‌తో ఫుకువోకాకు, తర్వాత రైల్లో టోక్యో చేరుకున్నారు. తొలుత ఆర్మీ ఇంపీరియల్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంచారు. మరుసటి రోజు జపాన్‌లోని ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ చీఫ్ రామమూర్తి, ఎస్ ఏ అయ్యర్(నేతాజీ ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ మంత్రి) టోక్యో చేరుకున్నారు. చితాభస్మాన్ని మూర్తి ఇంటికి తీసుకెళ్లారు. 1945, సెప్టెంబర్‌లో బహుశా 18వ తేదీన చితాభస్మాన్ని ఊరేగింపుగా రెంకోజీ ఆలయానికి తీసుకెళ్లారు.