నేతాజీ 1945లో చనిపోయారు: ప్రభుత్వం
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం స్పష్టం చేసింది. నేతాజీ మృతిపై కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి కేంద్ర హోం శాఖకు సమాచార హక్కు కింద గతంలో దరఖాస్తు చేశారు. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ల నివేదికల్లోని సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నేతాజీ చనిపోయారనే నిర్ధారణకు వచ్చామని హోం శాఖ తెలిపింది.
నేతాజీ కొన్ని రోజులపాటు గుమ్నమి బాబాగా మారువేషంలో జీవించారనే వాదనననూఅధికారులు కొట్టిపారేశారు. కేంద్రం సమాధానాన్ని నేతాజీ కుటుంబ సభ్యులు ఖండించారు. ‘సరైన సాక్ష్యాలు లేకుండానే నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయారని ప్రభుత్వం ఎలా చెబుతుంది?’ అని నేతాజీ మునిమనవడు చంద్రబోస్ ప్రశ్నించారు.