
నేతాజీని ఎప్పుడూ అలా చూడలేదట
కోల్ కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి నెత్తురు ఉప్పొంగుతుంది. బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడూ నేతాజీని యుద్ద నేరస్తుడిగా చూడలేదట. నేతాజీ జీవితానికి సంబంధించి చివరిగా బయటకు వచ్చిన 24 ఫైళ్లు ఈ విషయాన్ని చెబుతున్నాయి. న్యూయార్క్ లోని పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా, విదేశీ వ్యవహారాల శాఖ ఈ ఫైళ్లను సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ వార్ క్రిమినల్స్ అండ్ సెక్యూరిటీ సస్పెక్ట్స్ (సీఆర్ఓడబ్ల్యూసీఏఎస్ఎస్) నుంచి తీసుకున్నట్లు తెలిపింది.
ఇందులో ఏప్రిల్ 6, 1999 తేదీతో రాసిన లేఖలో నేతాజీ పేరు యుద్ధ క్రిమినల్స్ లిస్టులో లేదు. దీనిపై మరింతగా విచారణ జరిపేందుకు ఈ ఆధారాలు ఉపయోగపడతాయని నేతాజీ ముని మేనల్లుడు చంద్రబోస్ తెలిపారు. ఇవే నేతాజీకి సంబంధించిన పత్రాలని చెప్పడాన్ని తాను అంగీకరించడం లేదని అన్నారు. ఇవి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి నేషనల్ అఫైర్స్ కు ఇచ్చినవి మాత్రమే కావొచ్చని అన్నారు. ఎటు వెళ్లారో కూడా తెలియని నేతాజీని గుర్తించే కార్యక్రమం ఇంకా తొలి అడుగులోనే ఉన్నట్లు వివరించారు.