ఆ ఎంపీని పార్లమెంటు నుంచి పంపేయండి!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైపీ విమాన ప్రమాదంలో మరణించారంటూ ప్రచారం చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుగతో బోస్ను పార్లమెంటు నుంచి పంపేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యం స్వామి డిమాండ్ చేశారు.
సోవియట్/ నెహ్రూ ప్రచారాన్ని ఆయన బలపరిచారని, ఇప్పుడు అదంతా అసత్యమని తేలిపోయినందున సుగతో బోస్ను పార్లమెంటు నుంచి ఒక తీర్మానం ద్వారా తీసేయాలని స్వామి డిమాండ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన కొన్ని ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన విషయం తెలిసిందే. దాన్నిబట్టి, నేతాజీ 1964 వరకు బతికే ఉన్నారని చెబుతున్నారు.
Sugato Bose TMC MP be sacked from Parliament by a Resolution for mouthing the Soviet / Nehru propaganda that Netaji died in Taipeh crash
— Subramanian Swamy (@Swamy39) September 18, 2015