ఘాజీ దర్శకుడి మరో పరిశోధన | Ghazi Director movie on Subhash Chandra Bose | Sakshi
Sakshi News home page

ఘాజీ దర్శకుడి మరో పరిశోధన

Oct 10 2017 3:45 PM | Updated on Oct 20 2018 7:32 PM

Sankalp Reddy Netaji - Sakshi

ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. భారత్, పాక్ ల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో మునిగిపోయిన ఓ జలాంతర్గామి కథతో ఘాజీ సినిమాను తెరకెక్కించాడు సంకల్ప్. రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఆకట్టుకుంది. ఘాజీ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంకల్ప్ తన తదుపరి చిత్రం విషయంలో కూడా ప్రయోగానికే సిద్ధమవుతున్నాడు.

ఘాజీ కథ కోసం ఎంతో పరిశోదన చేసిన సంకల్ప్, త్వరలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. అయితే గతంలో వచ్చిన బోస్ సినిమాల మాదిరిగా కాకుండా ఆయన జీవితంలో వెలుగులోకి రాని ఎన్నో సంఘటనలపై సుధీర్ఘ పరిశోధన చేసి ఈ కథను తయారుచేస్తున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నేతాజీకి సంబంధించి సరికొత్త కోణం ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement