వరుణ్ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ | Varun Tej and Sankalp movie title Aham Brahmasmi | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 21 2018 12:17 PM | Last Updated on Wed, Feb 21 2018 3:07 PM

Varun Tej - Sakshi

వరుణ్‌ తేజ్‌

ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ హీరో వరుణ్ తేజ్‌, తన తదుపరి చిత్రం పనులు మొదలుపెట్టాడు. ఇటీవల ప్రయోగాలను పక్కన పెట్టి విజయాలు సాధించిన ఈ మెగా హీరో మరోసారి ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. భారతీయ సినీచరిత్రలో తొలి అండర్‌ వాటర్‌ వార్‌ డ్రామాగా తెరకెక్కిన సినిమా ఘాజీ. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ నటించనున్నాడు.

అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో గ్రహాంతరవాసుల ప్రస్థావన కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమా తన కెరీర్‌లోనే స్పెషల్‌ మూవీగా పేరు తెచ్చుకుంటుందన్న నమ్మకంగా ఉన్నాడు వరుణ్‌. త్వరలోనే చిత్రయూనిట్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement