న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను శనివారం బహిర్గతం చేయనున్నారు. బోస్ జయంతి సందర్భంగా ఈ రోజు నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ 100 డిజిటల్ కాపీలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బోస్ కుటుంబ సభ్యులు 20 మంది పాల్గొంటారు. నేతాజీ జయంతిని పురష్కరించుకుని పార్లమెంట్ వద్ద జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అనంతరం నేతాజీ ఫైళ్లను విడుదల చేస్తారు.
గత అక్టోబర్లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా నేతాజీ రహస్య ఫైళ్లను వెల్లడిస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మమతా బెనర్జి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. నేతాజీ విమాన ప్రమాదంలో మృతిచెందినట్లు తాజాగా వెల్లడైన పత్రాలు చెబుతున్నాయి. బోస్ మిస్టరీ ఛేదించేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో వీటిని బయటపెట్టింది. నేతాజీ తైపీలో 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదం తర్వాత అదే రోజు నగర శివారులోని ఆస్పత్రిలో చనిపోయినట్లు ఇవి చెబుతున్నాయి.
నేడు నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్న మోదీ
Published Sat, Jan 23 2016 9:17 AM | Last Updated on Sat, Oct 20 2018 7:32 PM
Advertisement