న్యూఢిల్లీ: నేతాజీ మరణానికి సంబంధించిన ఫైళ్లను కేంద్రం ఎందుకు బయట పెట్టడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. అంతేకాదు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ బూడిదను డీఎన్‌ఏ విశ్లేషణకు పంపాలని తృణమాల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
ఈ మేరకు నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ...నేతాజీ ఆచూకీ గురించి నేటికీ మాకు తెలియదు. తాము అధికారంలోకి రాగానే దానిపై పని చేస్తామని కేంద్రం చెప్పింది. పైగా నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను విడుదల చేసి, వర్గీకరించాం అని కేంద్రం పేర్కొంది. కానీ వాస్తవానికి అవి ఏం జరగలేదు. అని అన్నారు.
అయితే నేతాజీ మరణానికి సంబంధించిన వివాదం బెంగాల్‌లో తీవ్ర భావోద్వేగ సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదని చాలామంది ఇప్పటికీ నమ్ముతుండటం విశేషం. అయితే 2017లో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆగస్ట్ 18, 1945న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు కేంద్రం ధృవీకరించింది. పైగా నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను నిర్వీర్యం చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
కానీ ఇంకోవైపు నేతాజీకి సంబంధించిన ఇంటెలీజెన్స్ బ్యూరో ఫైల్స్ ఇప్పటికీ ప్రజా బాహుళ్యంలో లేవని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రే "నేతాజీ ఫైల్స్" వర్గీకరణను డి-క్లాసిఫికేషన్ చేయాలని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాము తీసుకువచ్చిన ఒత్తిడి మేరకు మన్‌కీ బాత్‌లో ఇండియా గేట్‌కి సమీపంలో దిగ్గజ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మోదీ హామీ ఇచ్చారంటూ మమతా బెనర్జీ ఆరోపించారు.
(చదవండి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం)
Comments
Please login to add a commentAdd a comment