కేజీబీ రికార్డులను బహిర్గతం చేయలేం | Can't disclose any KGB records on Netaji: Govt | Sakshi
Sakshi News home page

కేజీబీ రికార్డులను బహిర్గతం చేయలేం

Published Mon, Aug 17 2015 2:45 AM | Last Updated on Sat, Oct 20 2018 7:32 PM

కేజీబీ రికార్డులను బహిర్గతం చేయలేం - Sakshi

కేజీబీ రికార్డులను బహిర్గతం చేయలేం

స్వాతంత్య్ర సమరయోదుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై రష్యా సోవియట్ యూనియన్ గూఢచర్య సంస్థ కేజీబీ రికార్డులను ఏవైనా సమాచారంకోసం..

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోదుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై రష్యా సోవియట్ యూనియన్ గూఢచర్య సంస్థ కేజీబీ రికార్డులను ఏవైనా సమాచారంకోసం పరిశీలించారా అన్న అంశాన్ని వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. 70 ఏళ్ల క్రితం విమాన ప్రమాదంలో నేతాజీ మృతిపై  అనుమానాలకు సంబంధించి కేజీబీ సంస్థ రికార్డులను పరిశీలించాలంటూ 19 ఏళ్ల క్రితం నాటి విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్‌ఎల్ నారాయణ్ చేసిన ప్రతిపాదనపై తీసుకున్న చర్యలను తెలియజేయటానికి కూడా నిరాకరించింది.

నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేస్తామని పదేపదే ఎన్డీఏ హామీ ఇస్తున్నప్పటికీ, విదేశాంగ శాఖ మాత్రం ఎలాంటి సమాచారాన్ని దేశ సమగ్రత, విదేశీ సంబంధాల దృష్ట్యా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement