
నేతాజీ మృతిపై వైస్రాయ్ దర్యాప్తు !
లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి దారితీసిన పరిస్థితులపై పరిశోధన చేస్తున్న బ్రిటన్ వెబ్‌సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. తైపీలో విమానప్రమాదంలో బోస్ చనిపోయాడని భావిస్తున్న 9 రోజుల తర్వాత.. 1945 ఆగస్టు 27న ఆయన మృతిపై అప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్ తన మంత్రివర్గ సభ్యులకు తెలియజేశారని పేర్కొంది. యూకే మాజీ విదేశాంగ కార్యదర్శి రిఫ్‌కిండ్ 1995 నవంబర్‌లో లార్డ్ సాండ్‌వెల్‌కు రాసిన లేఖను వెబ్‌సైట్ ప్రచురించింది. ఈ లేఖలో బోస్ మృతి నిజం అని ఉంది. ఈ లేఖను 2015లో బ్రిటిష్ విదేశాంగ, కామన్వెల్త్ కార్యాలయం యూకే సమాచార స్వేచ్ఛ కింద ‘మహారాష్ట్ర టైమ్స్’మాజీ ఎడిటర్ గోవింద్‌కు పంపింది.