నేతాజీ అదృశ్యంపై 'సిట్'
కోల్కతా: స్వాతంత్ర్య సమయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. నేతాజీ అదృశ్యంపై కొనసాగుతున్న మిస్టరీని ఛేదించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ ఆదేశాలకు అనుగుణంగా సిట్ ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు.
ఈ దర్యాప్తు బృందంలో హెం, సీబీఐ, నిఘా, విదేశాంగ, చరిత్ర, పరిశోధక రంగాలకు చెందిన నిపుణులు ఉండాలని సూచించారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను, పత్రాలను మరోసారి పరిశీలించాలన్నారు. ఈ విషయంపై త్వరలో మోడీని కలుస్తామని నేతాజీ ముని మేనల్లుడు చంద్రకుమార్ బోస్ తెలిపారు.