
తిరువనంతపురం: భార్యాభర్తల మధ్య వివాదంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. అసలు భార్యకు పుట్టిన బిడ్డ తనకు పుట్టలేదని ఓ భర్త కోర్టులో సరికొత్త వాదనకు తెరలేపాడు. అందరికీ డీఎన్‌ఏ పరీక్ష చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. అతడికి 2006 మే 5వ తేదీ వివాహమైంది. వివాహమైన 22 రోజులకే లడ్డాఖ్‌కు వెళ్లాడు. అయితే 2007 మార్చి 9వ తేదీన భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
చదవండి: ఏసీ హాల్‌లో ఎందుకు? గ్రౌండ్‌లో కూడా పెళ్లి చేసుకోండి
అయితే పెళ్లయినప్పటి నుంచి అతడు భార్యతో కలవలేదు. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా కలవకపోయినా బిడ్డ పుట్టడంపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ కేసు ఇప్పుడు హైకోర్టుకు చేరింది. కోర్టు వాదనల సమయంలో ఆయన మరికొన్ని విస్తుగొల్పే విషయాలు తెలిపారు. తనకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని వైద్యులు చెప్పారని, అందుకే తనకు పిల్లలు కలగరని చెప్పినట్లు తిరువనంతపురం వైద్య కళాశాల ఇచ్చిన సర్టిఫికెట్ కోర్టుకు చూపించారు.
చదవండి: బెడ్రూమ్‌లోకి వెళ్తే వద్దంటుండు: భర్తపై భార్య ఫిర్యాదు
ఈ సందర్భంగా భార్యపై ఆరోపణలు చేశాడు. ‘నా భార్యకు ఆమె సోదరి భర్తతో వివాహేతర సంబంధం ఉందని, అతడి వలన నా భార్యకు కొడుకు పుట్టాడు’ అని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలోనే డీఎన్‌ఏ పరీక్ష చేయాలని విజ్ఞప్తి చేశాడు. అతడి వాదనలు విన్న న్యాయస్థానం డీఎన్‌ఏ పరీక్షకు అనుమతి ఇచ్చింది. ఈ కేసు విచారణ సాగుతోంది. మరి డీఎన్‌ఏ పరీక్షలో ఏం తేలుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment