తిరువనంతరపురం : ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతంలో కోత విధించడానికి ఆర్డినెన్స్ జారీచేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఇది వరకే ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఉద్యోగసంఘాలు పిటిషన్ దాఖలుచేశాయి. దీన్ని విచారించిన హైకోర్టు రెండునెలల స్టే విధించింది.
జీతాల కోతకు సంబంధించి అంటువ్యాధుల చట్టంలో కాని, విపత్తు నిర్వహణ చట్టంలో కానీ ఎలాంటి చట్టబద్దమైన ఆధారం లేదని తేల్చిచెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులందరి జీతాల్లో ఐదు మాసాలపాటు వారి నెల జీతంలో 6రోజుల వేతనంలో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ డెడక్షన్ డబ్బును ఒక నిర్దిష్ట కాల పరిమితి అనంతరం తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. (నెల జీతం కట్..వారికి మినహాయింపు)
తాజా హైకోర్టు ప్రకటనతో ఆర్డినెన్స్ జారీ చేయడం అత్యవసరం అని భావించినట్లు వెల్లడించింది. దీంతో కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు జీతాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆర్డినెన్స్‌తో మార్గం సుగుమమైంది. అంతేకాకుండా మంత్రులు, శాసనసభ్యుల నెలవారీ జీతంలో 30 శాతం కోత విధించేలా ఆర్డినెన్స్ జారీ చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫారసు చేస్తామని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment