సాక్షి, హైదరాబాద్: నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చిన్నారులు తారుమారైన వ్యవహారం సుఖాంతమైంది. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా ఎవరి చిన్నారులను వారి తల్లిదండ్రులకు అధికారులు బుధవారం అప్పగించారు. ఈ వ్యవహారంలో ఎవరి పోలికలు ఉన్న పిల్లలు వారికే చెందడం గమనార్హం.
ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు తారుమారు కావడంతో వివాదం తలెత్తింది. చిన్నారులు తారుమారు కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తమ బిడ్డను తమకు అప్పగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వివాదానికి తెరదించేందుకు ఆస్పత్రి అధికారులు డీఎన్‌ఏ పరీక్షలను ఆశ్రయించారు. డీఎన్‌ఏ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు చిన్నారులను ఈఎస్‌ఐ ఆస్పత్రి సంరక్షణలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు డీఎన్‌ఏ పరీక్ష ఫలితాలు వచ్చాయి. వీటి ఆధారంగా తారుమారైన ఇద్దరు శిశువుల తమ తల్లుల ఒడికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment