సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు శనివారం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
అనూహ్య కేసుపై ముంబై పోలీసు కమిషనర్ వెల్లడి
సాక్షి, ముంబై: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు శనివారం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించామని, వాటి ఫలితాలు రావాల్సి ఉందని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని, వారిలో కొందరికి నేర చరిత్ర ఉందన్నారు. ఆమెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నామని, అయితే దీనిపై ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే స్పష్టత వస్తుందని ఓ పోలీసు అధికారి చెప్పినట్లు ఎన్‌డీటీవీ తెలిపింది.