హత్య కేసులో ఇద్దరు జవాన్ల అరెస్టు
కేరళలో తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన కేసు
పుదుచ్చేరిలో 19 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు జవాన్లు
ఏఐ సాంకేతికతతో కనుగొన్న సీబీఐ
సేలం: కేరళ రాష్ట్రం కొల్లం అంజల్ ప్రాంతానికి చెందిన రంజనికి మదన్‌కోట్ ఇండియా మిలటరీ దళం విభాగంలో పని చేసిన కుమార్‌కు సంబంధం ఏర్పడింది. దీంతో రంజనికి 2006లో కవల పిల్లలు పుట్టారు. అయితే ఆ పిల్లలు తనకు పుట్టలేదని కుమార్ పిల్లలను అంగీకరించలేదు. దీంతో రంజని డీఎన్‌ఏ పరీక్షలు చేయడానికి మహిళా సంఘాల సాయం కోరింది. దీంతో తీవ్ర ఆవేశం చెందిన కుమార్ తన స్నేహితుడు, మిలటరీ జవాన్ కన్నూర్ రాజేష్ సాయంతో రంజనిని, ఆమెకు పుట్టిన ఇద్దరు కవల పిల్లలను హత్య చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో వారిద్దరిని అధికారులు మిలటరీ నుంచి తొలగించారు. పోలీసులు వారి కోసం గాలిస్తూ వచ్చారు.
పట్టించిన ఏఐ సాంకేతికత
2010లో ఈ కేసు సీబీఐకి అప్పగించారు. ఈ స్థితిలో వారిని పట్టుకోవడం కోసం సీబీఐ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. రాజేష్ అప్పటి చిత్రం మేరకు ఇప్పుడు ఎలా ఉంటాడో చిత్రాన్ని రూపొందించారు. అదే ఛాయలు ఉన్న వ్యక్తి పుదుచ్చేరిలో తిరుగుతున్నట్టు పోలీసులు కనుగొన్నారు. అక్కడ వారు ఆస్తులను సైతం కొనుగోలు చేసుకున్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు పుదుచ్చేరిలో కుమార్, రాజేష్‌లను ఆదివారం అరెస్టు చేశారు. అనంతరం వారిని కేరళకు తరలించి సోమవారం ఎర్నాకుళం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment