Esther Anuhya
-
మరే తల్లి, తండ్రికీ ఈ వేదన మిగలకూడదు
నిర్భయకు ముందు .. తర్వాతా ఎలాంటి మార్పూ రాలేదు అమ్మాయిల గౌరవ మర్యాదలకు సంబంధించి! నిర్భయ తాలూకు ప్రకంపనలు పార్లమెంట్ ఆవరణను తాకినా ఇంటా, బయటా ఎక్కడా మహిళలకు భద్రత లేదు! ముంబైలో తెలుగు అమ్మాయి ఎస్తర్ అనూహ్య, హాజీపూర్‌లో అక్కాచెల్లెళ్లు, వరంగల్‌లో తొమ్మిదినెలల పాప, నిన్నటికి నిన్న మానస, టేకుల లక్ష్మి, దిశ.. పసిపిల్ల దశ నుంచే రక్షణ కరువు! తన బిడ్డను పోగొట్టుకున్న బాధ తెలిశాక ఇంకే బిడ్డా ఇలాంటి ఘోరానికి బలికావద్దు.. మరే తల్లి, తండ్రికీ ఈ వేదన మిగలకూడదు అనుకున్నాడు ఎస్తర్ అనూహ్య తండ్రి.. ఎస్.జి.ఎస్ ప్రసాద్. దిశ సంఘటన నేపథ్యంలో తాము మింగిన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ.. సమాజానికి ఈ విశ్రాంత అధ్యాపకుడు చేస్తున్న విన్నపం ఆయన మాటల్లోనే... ‘‘దిశ ఇన్సిడెంట్ గురించి కంప్లయింట్ ఇవ్వడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు స్టేషన్ కు వెళ్లడం, పోలీసుల ప్రవర్తన అన్నీ మా అమ్మాయి ఇన్సిడెంట్‌నే గుర్తుచేశాయి. 2014లో మాదీ ఇలాంటి విషాదమే. మా అమ్మాయి ముంబైలో టీసీఎస్‌లో వర్క్ చేసేది. సెలవుమీద డిసెంబర్లో మచిలీపట్టణం వచ్చిన.. జనవరి 4న (2014) మళ్లీ ముంబైకి బయలుదేరింది. అయిదో తారీఖు ఉదయం కల్లా చేరుకోవాలి. ఏడుగంటలకు తన సెల్‌కి కాల్ చేశా. రింగ్ అవుతోంది కాని రిప్లయ్ లేదు. అమ్మాయి రూమ్మేట్కీ ఫోన్ చేశా. ఇంకా చేరుకోలేదని చెప్పింది. మనసు కీడు శంకించి వెంటనే ముంబై వెళ్లాం. రైల్వే పోలీసులు.. ట్రాక్‌కి అవతల ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లమన్నారు. వెళ్లి కంప్లయింట్ ఇచ్చాం. ‘మిస్సింగ్ కేస్’గా నమోదు చేసుకొని.. ‘‘కనపడితే ఇన్ ఫామ్ చేస్తాం’’ అని చాలా నింపాదిగా చెప్పారు. పోలీసుల నుంచి దిశ పేరెంట్స్ ఎదుర్కొన్న ప్రశ్నలనే నాడు మేమూ ఎదుర్కొన్నాం. ‘‘ఏ ఫ్రెండ్‌తోనో వెళ్లుంటుంది’’ అని, ‘‘కంగారు పడకండి.. రెండు రోజుల్లో అమ్మాయి నుంచి మీకుఫోన్ వస్తుంది పెళ్లి చేసుకున్నట్టుగా..’’ అంటూ కామెంట్స్ చేశారు. ‘‘మా అమ్మాయితో మేం చాలా ఫ్రెండ్లీగా ఉంటామండీ.. అలాంటిదేదైనా ఉంటే మాతో చెప్పేంత చనువు తనకు ఉంది’’ అని చెప్పినా వాళ్ల తీరు మారలేదు. మా టెన్షన్ , భయాన్ని అర్థంచేసుకోలేదు, పట్టించుకోలేదు. టీసీఎస్‌లోని హయ్యరఫీషియల్స్ ఇన్వాల్వ్ అయితేనే రెస్పాన్స్ వచ్చింది. అప్పటికీ మా బంధువులు, స్నేహితులు అందరూ రంగంలోకి దిగి మా అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేశారు. ఇలా అన్ని వైపుల నుంచి అన్నిరకాల సమాచారం తీసుకొని పోలీసులకు అందిస్తే అప్పుడు దాన్ని పట్టుకొని వాళ్లు ముందుకెళ్లారు. పదో రోజుకి మా అమ్మాయి దొరికింది! అప్పటికే మీడియా ప్రచారం, పొలిటికల్ ప్రెజర్ పెరిగి ఉండడం వల్ల ట్రయలప్పుడు మాత్రం చురుగ్గా కదిలారు. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్ప ఏమీ లేదు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు అయింది. యేడాదిలోగా నేరస్తుడికి శిక్ష పడింది. ఇంకా అమలు కాలేదు. స్టేషన్‌లోని ఎస్తర్ సీసీ ఫుటేజ్ దృశ్యం ►2014, జనవరి అయిదో తారీఖు తెల్లవారు జామున ముంబై, కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్‌లో దిగిన ఎస్తర్ అనూహ్య ఒక టూ వీలర్ ట్యాక్సీలో తన రూమ్‌కి బయలుదేరింది. పదో రోజున ముంబై శివార్లలో అస్థిపంజరమై కనిపించింది. డ్రాప్ చేస్తానని చెప్పిన ఆ టూ వీలర్ రైడర్ చంద్రభాన్ సానప్ ఆమె మీద లైంగిక దాడి, హత్య చేశాడని రుజువైంది. అతనికి మరణ శిక్ష ఖరారైంది. సున్నితంగా ఆలోచించరు ఎందుకు? పోలీసులు ఇంట్రెస్ట్ పెడితే తప్పకుండా చేయగలరు. అమ్మాయి కనపడట్లేదు అని తల్లిదండ్రులు కంప్లయింట్ ఇస్తే ఈ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ అని తప్పించుకోవడం ఎందుకు? ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా.. జ్యురిస్ సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా రిపోర్ట్ తీసుకోవాలి అని స్పష్టంగా ఉంది కదా! సుప్రీం కోర్టే ఆర్డర్ ఇచి్చంతర్వాత కూడా ఈ కాలయాపన ఎందుకు? ఆడపిల్ల కనిపించకుండా పోయింది అనేది చాలా సీరియస్, సెన్సిటివ్ విషయం. ‘‘మీ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?, లవ్ మ్యాటరా?, రెండ్రోజులాగి తనే వస్తుందిలెండి, పెళ్లిచేసుకొని మీకు ఫోన్ చేస్తుంది..’’ లాంటి ప్రశ్నలు అడగొచ్చా? బాయ్‌ఫ్రెండే ఉన్నాడనుకోండి, పెళ్లిచేసుకోవడానికే వెళ్లిందనుకోండి. పోలీసులు ముందు ప్రమాదాన్నయితే శంకించి జాడ తీయాలి కదా! సున్నితంగా ఆలోచించరెందుకు? ఫ్రెండ్లీ పోలీసే కాదు.. బాధ్యత గల పోలీసులూ కావాలి. ఏమైంది ఈ రోజు? మరో తల్లికి, తండ్రికి శోకం తప్ప ఏం మిగిలింది? నా బిడ్డ పోయినప్పుడు అనుకున్నాను.. ఇంకే పేరెంట్స్‌కీ ఇలాంటి అనుభవం ఎదురుకావొద్దు. మరే తల్లిదండ్రులకూ మా బాధ రాకూడదు అని. ఇప్పుడు దిశ వాళ్ల అమ్మానాన్నా అదే అనుకుంటున్నారు. నాడు నిర్భయ తల్లిదండ్రులూ అదే కోరుకున్నారు. కాని ఆగలేదు. దిశను తిరిగి తేలేం. ఆ అమ్మాయి తల్లిదండ్రుల బాధనూ తీర్చలేం. నిబ్బరంగా ఉండండి అని చెప్పడం తప్ప ఏం చేయగలుగుతున్నాం? కోపంగా, ఆవేశంగా కాదు... మాకు జరిగిన దారుణం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఇలాంటివెన్నో వింటున్నాం. అమ్మాయిలు బాగా చదివి, జీవితంలో చక్కగా స్థిరపడాలని కోరుకోవడం తప్పు కాదుకదా! ఆడపిల్లలు మగపిల్లలతో పోటీపడి ముందుండాలనుకోవడమూ పొరపాటు కావొద్దు కదా! ఇవన్నీ చూస్తుంటే ఆడపిల్లలను మళ్లీ గడపకే పరిమితం చేస్తారేమోననే దిగులు. ఓ బిడ్డను పోగొట్టుకున్న తండ్రిగా ఈ సమాజానికి నాదొక్కటే విన్నపం.. ఆడపిల్లల్ని బతకనిద్దాం. మనం సంట్రేట్ చేయాల్సింది ఆడపిల్లల మీద కాదు. మగపిల్లల మీద, వాళ్ల పెంపకం, ప్రవర్తన మీద. మగపిల్లాడు ఏం చేసినా చెల్లుతుంది అనే భావన పెంచొద్దు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమే. ఇద్దరికీ ఒకే రెస్పెక్ట్ ఉండాలని తెలియచేయాలి. బాధను అనుభవించిన వాళ్లు చెబితే అర్థం అవుతుందని, అర్థం చేసుకుంటారని ముందుకొచ్చాను. ఒక అమ్మాయిని కోల్పోవడం ఆ కుటుంబానికే కాదు సమాజానికీ లోటే. ఒక అబ్బాయి నేరస్తుడవుతే ఇంటికే కాదు సమాజానికీ ప్రమాదమే! ఇలాంటి సంఘటనలు జరగగానే కోపం,ఆవేశం రావడం సహజమే. ఆ భావోద్వేగంలో నేరస్తులను పట్టుకొని నడిరోడ్డుమీద కొట్టాలి, చంపాలి అంటారు. నా బిడ్డ పోయినప్పుడు నాకూ అలాగే అనిపించింది. కాని ఇలాంటి ఆటవిక న్యాయం మరెన్నో ఘోరాలకు కారణమవుతుంది. మనకు చట్టాలున్నాయి. ఇలాంటి దారుణాలు మళ్లీ జరక్కుండా చూసే తీర్పులు కావాలి. అలాంటి చట్టాలు రావాలి. సత్వరంగా న్యాయం అందేలా ఉండాలి’’ అంటున్నారు మచిలీపట్టణంలోని నోబుల్ కాలేజ్ పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా రిటైరైన ఎస్.జి.ఎస్.ప్రసాద్. -
ఉరిశిక్షే సరియైనది ..
-
ఎస్తేరు అనూహ్య కేసులో నేడు తుది వాదనలు
-
ఎస్తేర్ అనూహ్య కేసు విచారణలో జాప్యం
* ఘటన జరిగి ఏడాది పూర్తి * నిందితునికి టీబీ వ్యాధి సాక్షి ముంబై: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసు విచారణ జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సంఘటన జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయింది. మరోవైపు కేసుకు సంబంధించి ప్రధాన ఆధారాలుగా భావించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ఇంతవరకు లభించలేదు. ఇక ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాకు టీబీ వ్యాధి సోకిందని వె ళ్లడైంది. ఈ నేపథ్యంలో కేసు విచారణ జాప్యం కానుందని తెలుస్తోంది. ఎస్తేర్ అనూహ్య కేసు ముంబైతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గత ఏడాది జనవరి అయిదవ తేదీన విజయవాడలో రెలైక్కిన అనూహ్య కుర్లా నుంచి అదృశ్యమై కంజూర్‌మార్గ్-భాండూప్ రోడ్డుపక్కన పొదలలో 16న శవమైతేలిన సంగతి తెలిసిందే. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని అక్కడ లభించిన బట్టల ఆధారంగా గుర్తించారు. ఈ సంఘటనతో ముంబైలో మహిళల భద్రతపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగు సంఘాలతోపాటు అనేక స్వచ్ఛంద, రాజకీయ సంస్థలు నిరసనలను వ్యక్తం చేస్తు ర్యాలీలు నిర్వహించాయి. ఎట్టకేలకు నిందితుడు చంద్రబాన్‌ను మార్చి రెండవ తేదీన పట్టుకున్నారు. ఘటన జరిగిన 85 రోజులకు మే 26వ తేదీన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తి అయినప్పటికీ కేసు విచారణ మాత్రం కొనసాగుతోంది. నిందితుడు చంద్రబాన్ సానప్కు టీబీ సోకిందని తెలియడంతో, అతడిని విచారణ కోసం కోర్టులో హాజరుపరచవద్దని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో 2014 డిసెంబరు 22వ తేదీ నుంచి నిందితున్ని కోర్టులో హాజరుపరచడంలేదు. -
అనూహ్య కేసులో కీలక మలుపు
సాక్షి ముంబైః ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసుపై ఎట్టకేలకు చార్జిషీట్ దాఖలయింది. ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయం సోమవారం విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సదానంద్ ధాతే ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన అనూహ్య కేసును సవాల్‌గా తీసుకుని నిందితుడిని అరెస్టు చే శామన్నారు. లభించిన ఆధారాలకు అనుగుణంగా 542 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో 76 మంది సాక్షులున్నట్టు చెప్పారు. ప్రధాన నిందితుడు చంద్రభాన్ సానప్ ఎలియాస్ చౌక్యా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. కళ్లద్దాలు, ఐడీ కార్డుతో సరిపోలిన డీఎన్ఏ... కేసు దర్యాప్తునకు అవసరమైన ఎన్నో ఆధారాలను పోలీసులు సేకరించారు. అనూహ్య నుంచి దొంగిలించిన బ్యాగ్, దుస్తులు, ఐడీకార్డు తదితరుల వస్తువుల్లో లభించిన డీఎన్ఏను గుర్తించేందుకు ప్రయత్నించారు. నిందితుడి నుంచి సేకరించిన అనూహ్య కళ్లద్దాలు, ఐడీ కార్డు నుంచి లభించిన డీఎన్ఏ అనూహ్య డీఎన్ఏతో సరిపోలింది. ఏసీపీ ప్రఫుల్ మీడియా సమావేశం అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినట్టు చెప్పారు. ‘డీఎన్ఏతోపాటు అనేక ఆధారాలను సేకరించాం. 76 మంది సాక్షులనూ ప్రశ్నించాం. ఈ ప్రక్రియ అనంతరం చార్జిషీట్ దాఖలు చేశాం. అనూహ్య మృతదేహం కుళ్లిపోవడంతో అనేక ఆధారాలకు నష్టం వాటిల్లింది. అయినా శ్రమించి చంద్రభానును పట్టుకోవడంతోపాటు పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నాం. అనూహ్యను మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్తుండగా కూడా చూసిన ప్రత్యక్ష సాక్షులనూ గుర్తించాం. వీరితోపాటు అనేక మందిని విచారించాం. అనంతరం నిర్వహించిన పరేడ్‌లో కూడా నిందితున్ని సాక్షులు గుర్తుపట్టారు’ అని ఆయన వివరించారు. అత్యచారం జరిగింది...! అనూహ్య మృతదేహం కుళ్లిపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం వైద్యపరీక్షల్లో తేలలేదు. అత్యాచారం జరిగినట్టు తమ దర్యాప్తులో తేలిందని ప్రఫుల్ బోస్లే పేర్కొన్నారు. దీంతో నిందితునిపై 302, 364, 366, 376(2)(ఎస్), 376ఎ, 397, 210, 170 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. లభించని ల్యాప్‌ట్యాప్... అనూహ్య వస్తువుల్లో కీలకమైన ల్యాప్‌టాప్ ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీనికోసం ఇప్పటికీ గాలిస్తున్నామని ప్రఫుల్ తెలిపారు. దానిని ఆంబివలి, షాహాడ్ సమీపంలోని క్రీక్నదీలో పడేసినట్టు నిందితుడు పేర్కొన్నాడు. దీంతో గజ ఈతగాళ్ల సహకారంతో ల్యాప్‌టాప్ కోసం గాలింపు చేపట్టారు. ఏసీపీ ప్రఫుల్ నేతృత్వంలోని 20 మంది అధికారులు, 85 మంది పోలీసుల బృందాలు పరిసరాలను జల్లెడపట్టాయి. అయినప్పటికీ ల్యాప్‌టాప్ ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉంటే అనూహ్య కేసులో ప్రభుత్వం తరఫున వాదించేందుకు అడ్వకేట్ రాజన్ ఠాక్రేను ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా నియమించాలని కోరినట్టు జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సదానంద్ దాతే తెలిపారు. ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్టు ఆయన చెప్పారు. స్వగ్రామం నుంచి జనవరి ఐదున ముంబైకి వచ్చిన అనూహ్య అదృశ్యం కావడంతో కేసు నమోదయింది. కుళ్లిపోయిన ఈమ మృతదేహం 16న భాండుప్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో దొరికింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె ముంబై టీసీఎస్‌లో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసేది. అనూహ్య కేసు పూర్వాపరాలు 2014, జనవరి 4: క్రిస్మస్ సెలవులు స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో గడిపిన అనూహ్య తిరిగి ముంబైకి 5: విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి తెల్లవారుజాము ఐదు గంటల ప్రాంతంలో కుర్లా టెర్మినస్‌లో రైలు దిగింది. 6: అపహరణకు గురైనట్లు ఆమె బంధువులు హైదరాబాద్ , విజయవాడలో కేసు నమోదు చేశారు. 7: అనూహ్య బంధువులు కూడా కుర్లా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8: కుర్లా రైల్వే పోలీసులతోపాటు రైల్వే నేర శాఖ, ముంబై పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. 16: కంజూర్‌మార్గ్ ప్రాంతంలో ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వే పక్కనున్న చెట్ల పొదల్లో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం 20: మొబైల్ ఫోన్, కాల్ హిస్టరీ వివరాలు పోలీసులకు లభ్యం, రక్తంతో తడిసిన దుప్పటి లభ్యం. 21: హత్యకు గురైన చోటికి కొద్దిదూరంలో దుస్తులతో కూడిన బ్యాగు లభ్యం. 22: బంధువులు, స్నేహితులతో విచారణ జరిపి వివరాలు సేకరణ 23: ఘటనా స్థలం వద్ద క్రైస్తవుల శాంతి ర్యాలీ 30: సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు 31: అనూహ్య సన్నిహితులను విచారించిన పోలీసులు ఫిబ్రవరి 2: కేసు దర్యాప్తు కోసం అనూహ్య స్వస్థలానికి పోలీసులు 3: కుర్లా టెర్మినస్‌లోని సీసీ టీవీలకు మరమ్మతులు, మరిన్ని సీసీ టీవీలు ఏర్పాటుచేయాలని పోలీసుల ప్రతిపాదన 4: దర్యాప్తు కోసం ముంబైలోని ఆర్టీఓ సాయం 5: అనుమానితులుగా కనిపిస్తున్నవారి వివరాల సేకరణ 24: అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు 26: సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తిచేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించిన పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా మార్చి 2: నిందితుడు సానప్ అరెస్టు మే 26: అభియోగపత్రం దాఖలు -
కొత్త మలుపు తిరిగిన 'అనుహ్య' హత్య కేసు
ముంబైలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తర్ అనుహ్య కేసు కొత్త మలుపు తిరిగింది. అనుహ్య హత్య కేసులో అరెస్ట్ అయిన చంద్రబాన్ సనప్ డీఎన్ఏకు, మృతురాలి శరీరంలో లభించిన డీఎన్ఏకు సరిపోలడం లేదు. అత్యాచారం జరిగినప్పుడు నిందితుడి వీర్యం బాధితురాలి శరీరంలో ఉంటుంది. దాని ఆధారంగా ఫోరన్సిక్ నిపుణులు పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలలో మృతురాలి శరీరంలోని డిఎన్ఏతో నిందితుడి డిఎన్ఏ సరిపోలడంలేదు. ఈ మేరకు మహారాష్ట్ర ఫోరన్సిక్ నివేదిక మంగళవారం స్పష్టం చేసింది. దాంతో అనుహ్య కేసు మరో సారి మరో మలుపు తిరగటంతో ముంబై పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుందోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంకి చెందిన ఎస్తర్ అనుహ్యా ముంబైలోని టీసీఎస్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తుంది. గతేడాది డిసెంబర్లో క్రిస్టమస్స్ సెలవులకు ఇంటి వచ్చిన అనుహ్య... జనవరి మొదటి వారంలో ముంబై తిరుగు ప్రయాణమైంది. ఆ క్రమంలో ముంబైలో దిగిన అనుహ్య ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. అనుహ్య ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి హరి ప్రసాద్ కంగారుపడి ముంబై పోలీసులను ఆశ్రయించారు. అయిన ఫలితం కనిపించకపోవడంతో హరిప్రసాద్ ఆయన బంధువులు ముంబై నగరంలో అనుహ్య కోసం జల్లెడ పట్టారు. నగరంలోని కంజూర్‌మార్గ్ ప్రాంతంలో కాలిపోయి ఉన్న మృతదేహన్ని అనుహ్యదిగా ఆమె తండ్రి గుర్తించారు. అనుహ్య మృతిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో అనుహ్య తండ్రి హరిప్రసాద్ కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఫిర్యాదు చేశారు. దాంతో ముంబై పోలీసులు చంద్రభాన్ సనప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనుహ్యపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు చంద్రభాన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. అయితే అనుహ్య మృతదేహంలోని డీఎన్ఏకి చంద్రభాన్ డీఎన్ఏ సరిపోలకపోవడంతో ముంబై పోలీసులకు అనుహ్య కేసు పెద్ద మిస్టరీగా మారింది. -
అనూహ్య బ్యాగ్, లాప్టాప్ ఎత్తుకెళ్లాలనుకున్నాడు
-
బ్యాగ్, లాప్టాప్ ఎత్తుకెళ్లాలనుకున్నాడు
* అనూహ్య హంతకుడిమొదటి ఉద్దేశం ఇదే * సామగ్రితో బైక్‌పై ఉడాయించాలనుకున్నాడు * అవకాశం లేకపోవడంతోనే ఆమెను ఎక్కించుకున్నాడు ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్య కేసులో నిందితుడైన చంద్రభాన్ సనప్ పోలీసుల విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్లు ఓ జాతీయ ఆంగ్ల చానల్ తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ముంబై క్రైం బ్రాంచికి చెందిన ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం...వాస్తవానికి చంద్రభాన్ అనూహ్య బ్యాగ్, ల్యాప్‌టాప్‌ను చోరీ చేయాలనే పథకం వేసుకున్నాడు. ఆమెపై అత్యాచారయత్నం లేక హత్య చేయాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదు. ప్లాట్ఫారం నుంచి బైక్ ఉన్న చోటుకు ఆమెను తీసుకొచ్చాక వస్తువులతో అతను ఉడాయించాలనుకున్నాడు. ఆమె బ్యాగ్‌ను లాక్కొని పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకొని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. దీంతో అతను సామానుతో ఉడాయిస్తాడని కంగారుపడిన అనూహ్య వెంటనే బైక్‌పై ఎక్కి కూర్చుంది. ఆమె స్పర్శ తగలడంతో చంద్రభాన్కు అనూహ్యను రేప్ చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. ట్యాక్సీలో తీసుకెళ్తానన్న చంద్రభాన్ చివరకు బైక్‌పై తీసుకెళ్తాననేసరికి అనూహ్య అవాక్కైందని అధికారి చెప్పారు. విచారణలో చంద్రభాన్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది. చంద్రభాన్: మేడం...మీరు ఎక్కడకి వెళ్లాలి?. అతని మాటలను అనూహ్య తొలుత పట్టించుకోలేదు. చంద్రభాన్: మేడం...ఎక్కడికి వెళ్లాలో చెప్పండి? నేను ట్యాక్సీ డ్రైవర్‌ను. చౌకగానే తీసుకెళ్తా అనూహ్య: అంధేరీ వెస్ట్ చంద్రభాన్: మంచిదైంది. నేను కూడా అంధేరీ వెళ్తున్నా. నా ట్యాక్సీ కూడా అక్కడిదే. 300 తీసుకుంటా. చంద్రభాన్ మాటలకు అనూహ్య స్పందించేలోగానే అతను ఆమె ట్రాలీ బ్యాగ్‌ను లాక్కుంటూ నడవడం మొదలుపెట్టాడు. దీంతో అనూహ్య అతని వెంట నడవడం మొదలుపెట్టింది. సెల్ఫోన్లో కుటుంబ సభ్యుడితో మాట్లాడుతూ అతని వివరాలు చెబుతున్నట్లు నటించింది. వారిద్దరూ స్టేషన్ బయటకు వచ్చాక ట్యాక్సీ బదులు బైక్ వద్ద చంద్రభాన్ నిలబడటం చూసి అనూహ్య అవాక్కైంది. ‘‘ట్యాక్సీ అని చెప్పావు ఇది బైక్ కదా’’ అంది. అందుకు చంద్రభాన్ స్పందిస్తూ ‘‘మేడం...ఇంత చౌకగా ట్యాక్సీలో ఈ వేళ ఎవరు దింపుతారు. పదండి. నా దగ్గర పెట్రోల్ కొట్టించేందుకు డబ్బులు కూడా లేవు. అందుకే ప్రయాణికుల కోసం వెతుకుతున్నా’’ అన్నాడు. అయితే ఆటో లేక ట్యాక్సీ కోసం అనూహ్య కాసేపు చూసినా ఏదీ కనిపించలేదు. దీంతో చంద్రభాన్ ఆమె బ్యాగ్‌ను వాహనంపై పెట్టుకున్నాడు. దీంతో ఆమె అతని బైక్ ఎక్కి కూర్చుంది. ఆ తర్వాత ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్‌పై కంజూర్‌మార్గ్ వద్ద చంద్రభాన్ బైక్‌ను ఎడమ వైపు మలుపు తిప్పకపోవడంతో కంగారుపడిన అనూహ్య అతన్ని ప్రశ్నించింది. ‘‘ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తన్నావు? దీనికి చంద్రభాన్ బదులిస్తూ ‘‘మేడం ఇది షార్ట్‌కట్. మిమ్మల్ని 10 నిమిషాల్లో అంధేరీకి చేరుస్తా’’ అన్నాడు. అనూహ్య తండ్రిని కలిసిన ముంబై పోలీసు అధికారి మచిలీపట్నం, న్యూస్‌లైన్: అనూహ్య హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ముంబై కుర్లా పోలీస్‌స్టేషన్ క్రైం బ్రాంచ్ సీనియర్ ఇన్స్పెక్టర్ రాణే బుధవారం మచిలీపట్నం వచ్చారు. అనూహ్య తండ్రి ప్రసాద్‌ను కలిసి తమ వద్ద ఉన్న సమాచారాన్ని తెలిపి, ఫొటోలను చూపారు. అనూహ్య రైల్వే స్టేషన్లో దిగిన సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఆమె పక్కనే నడుస్తున్న చంద్రభాన్ ఫోటోను చూపారు. అనూహ్య హత్య తర్వాత చంద్రభాన్ గడ్డం పెంచుకుని, వేషం మార్చుకుని తిరిగిన విధానాన్ని వివరించారు. అనూహ్య మృతదేహం లభ్యమైన రెండో రోజునే చంద్రభాన్‌ను అదుపులోకి తీసుకున్నామని, అప్పటికి అతను గడ్డం పెంచుకుని ఉండటంతో గుర్తించలేకపోయామని వివరించారు. -
కోర్టుకి అనూహ్య హత్యకేసు నిందితుడు
-
లోక్‌సభలో ‘అనూహ్య’ కేసు: వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకునేలా ముంబై పోలీసులను ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. గురువారం వైఎస్ జగన్ 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనూహ్య హత్యకు సంబంధించిన వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడంపై ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ‘అనూహ్య హత్య కేసు దర్యాప్తులో ముంబై పోలీసుల తీరు బాధాకరం. సరైన రీతిలో కేసు విచారణ చేపట్టలేదు. దీనిపై విచారణ చేపట్టి నిందితులను పట్టుకోవాలని స్వయంగా వారి కుంటుంబసభ్యులు కేంద్ర హోంశాఖను కోరినా వారు పట్టించుకోలేదు. కేసు విచారణలో వారితీరు బాధాకరం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అనూహ్య కుటుంబ సభ్యులు కనుగొనేంత వరకు ముంబై పోలీసులు శవాన్ని కూడా కనుక్కోలేకపోయారు. దీన్నిబట్టి మహారాష్ట్ర పోలీసులు విచారణలో ఎంత శ్రద్ధ పెట్టారో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ దృష్ట్యా ఇప్పటికైనా హత్య కేసు నిందితులను త్వరగా పట్టుకునేలా ముంబై పోలీసులను ఆదేశించాలి. అనూహ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలి. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
భద్రతపై భరోసా ఏది?
సాక్షి, ముంబై: రోజురోజుకూ ముంబైలో మహిళలపై పెరుగుతున్న దాడులు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏదో ఓ ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనల్లో నిందితులు దొరికినా.. కొన్ని సంఘటనలు పోలీసులకు సవాలుగా మారాయి. దీంతో ముంబైలో మహిళలకు రక్షణ కరువైందని, భద్రత అంశం ఆందోళన కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసు కమిషనర్ పదవిని ఇంత వరకు భర్తీ చేయకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు సవాల్.. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక సంఘటనలు జరిగాయి. గతనెల ఐదో తేదీన తెలుగు అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినల్(ఎల్టీటీ) దిగి అనంతరం కన్పించకుండా పోయింది. 16వ తేదీ కంజూర్‌మార్గ్, బాండూప్ల మధ్య ఆమె మృతదేహం లభించింది. అప్పటి నుంచి ఆమె హత్య కేసు మిస్టరీగానే మిగిలింది. అదేనెల 24న పవాయిలో పార్టీ నుంచి రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగివస్తున్న 25 ఏళ్ల యువతిపై ఆ భవనం సెక్యూరిటీ గార్డు నడిరోడ్డుపై రాత్రి రెండున్నర గంటలకు అత్యాచారం జరిపాడు. 27న బాంద్రా రైల్వేస్టేషన్లో వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని ఉన్న 25 ఏళ్ల జర్మనీ యువతితో కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు. నిందితులను నిర్మల్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. 28న అంధేరిలో కొత్తగా వివాహం చేసుకొని కాపురానికి వచ్చిన ఓ మహిళపై గ్యాస్ మెకానిక్‌లు ఇంట్లో చొరబడి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 30న ఫోర్ట్ ప్రాంతంలో 50 ఏళ్ల మహిళపై తాగుబోతులు దాడి చేశారు. ఇలా ప్రధాన నగరంతోపాటు ఉప నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అనేక సంఘటనలను పరిశీలిస్తే నగరంలో మహిళలకు భద్రత కరువవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనలపై ఇప్పటికే ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అనూహ్య సంఘటన అనంతరం తెలుగు సంఘాలతోపాటు క్రైస్తవ సంఘాలు, ఇతర సంఘాల ప్రతినిధులు మహిళలకు భద్రత కల్పించాలంటూ ఆందోళనలు చేశారు. హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, ముంబై పోలీసు అధికారులందరికీ వినతి పత్రాలు సమర్పించారు. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా వారం రోజులుగా ఖాళీగా ఉన్న ముంబై పోలీసు కమిషనర్ పదవిని ఇంకా భర్తీ చేయకపోవడం చూస్తుంటే భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అనూహ్య మలుపులు
-
'అనూహ్యతో కలిసి ట్రైన్లో ప్రయాణించలేదు'
-
అనూహ్య హత్యకు సుపారీ ఇచ్చారా?
సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్యను తెలిసినవారే హత్య చేశారా? అందుకు సుపారీ (డబ్బులు) కూడా ఇచ్చారా? ముంబై పోలీసులు ఈ దిశగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య మృతదేహం లభించి 18 రోజులు అవుతున్నప్పటికీ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో పెద్దగా పురోగతి సాధించలేదు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోయినా అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జనవరి 4న అనూహ్యకు భోజనం అందించిన ఆమె స్నేహితుడు హేమంత్ పాత్రతోపాటు ఆమెకు తెలిసినవారి గురించి ఆరా తీస్తున్నారు. అనూహ్యను తెలిసినవారే నేరుగా హత్య చేయనప్పటికీ ఎవరికైనా డబ్బులిచ్చి చేయించారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్టేషన్లో దిగిన తర్వాత ఎవరైనా దుండగులు అపహరించి తీసుకువెళ్లారా.. అనూహ్య ప్రతిఘటించడంతో చంపేసి, రోడ్డు పక్కన పొదల్లో వదిలేసి పారిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అనూహ్య కుర్లా రైల్వేస్టేషన్ లో దిగిన తర్వాత ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్లింది. ఆ సమయంలో ఎవరితో మాట్లాడిందో తెలి స్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు లు చెబుతున్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే కీలక ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. -
అనూహ్య హత్య.. తెలిసినవారి పనేనా ?
-
అనూహ్య హత్య.. తెలిసినవారి పనేనా ?
అనూహ్య హత్య కేసులో పురోగతి కుర్లా రైల్వే స్టేషన్లో ఆమెతోపాటు మరో వ్యక్తిని గుర్తించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు అనుమానితుడి కోసం కొన సాగుతున్న వేట సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్యను తెలిసినవారే హత్య చేశారా..? ముంబై పోలీసులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతదేహం లభించిన 16 రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతి కనబరిచారు. జనవరి 5న కుర్లా రైల్వే స్టేషన్లో అనూహ్యతోపాటు మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఆరోజు అనూహ్య ప్రయాణించిన రైలు మూడో నంబరు ప్లాట్‌ఫాంపై ఆగింది. అక్కడ ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు ఇప్పటికే పరిశీలించినా అందులో పోలీసులకు ఆమె కనిపించలేదు. దీంతో నాలుగు, ఐదో నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్న కెమెరాలను పరిశీలించగా అందులో అనూహ్య కన్పించిందని కుర్లా రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ శివాజీ దుమాల్ తెలిపారు. ఆమెతోపాటు ఓ వ్యక్తి మాట్లాడుతున్నట్లు కెమెరాలో రికార్డ్ అయినట్లు వివరించారు. వారిద్దరూ టాక్సీ స్టాండ్ వైపు వెళ్తున్నట్టు కన్పించింది. తర్వాత ఎటు వెళ్లారన్నది తెలియడం లేదు. ఎవరు ఆ వ్యక్తి..? అనూహ్యతో ఉన్న ఆ వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. సీసీటీవీ ఫుటేజీలతో రైల్వే, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లినట్టు శివాజీ దుమాల్ తెలిపారు. బంధువులకు కెమెరాల్లోని దృశ్యాలను చూపించగా వారు అనూహ్యను మాత్రమే గుర్తించారని, ఆమెతో ఉన్న వ్యక్తిని మొదటిసారిగా చూసినట్టు చెప్పారు. దీంతో అతడు ఎవరన్న విషయంపై ముంబైతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో గాలింపు చేపట్టారు. అతడు ముం బైలో అనూహ్య నివాసం ఉండే ప్రాంతానికి చెందిన వ్యక్తా లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తా అన్న విషయం తేల్చుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్య వెనుక ఈయన హస్తం ఉండవచ్చా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. నేడు ఫోరెన్సిక్ నివేదిక! అనూహ్య హత్య కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదిక శనివారం వెలుగుచూసే అవకాశం ఉంది. ఇక్కడి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరెటీస్ డెరైక్టర్ డాక్టర్ మాల్వే మాట్లాడుతూ.. అతి త్వరలోనే నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ నివేదికతో అనూహ్య హత్య ఎలా జరిగింది, దేనితో హత్య చేశారు.,? ఎప్పుడు జరిగింది..? తదితర వివరాలు తెలియనున్నాయి. బాంబే హైకోర్టులో పిటిషన్ అనూహ్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై బాంబే హైకోర్టులో అభాసింగ్ అనే అడ్వొకేట్ పిటిషన్ దాఖలు చేశారు. అనూహ్య రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైనప్పట్నుంచీ శవం దొరికే వరకు పోలీసులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారని, దీనిపై సీఐడీతో విచారణ జరిపించాలని ఆమె తన పిటిషన్లో కోరారు. ఈ కేసులో సరైన చర్యలు తీసుకోలేని పోలీసులపై కేసు పెట్టేలా ఆదేశించాలని విన్నవించారు. -
అనూహ్యతో ఆరోజు ఉన్నదెవరు?
-
మలుపు తిరుగుతున్న అనూహ్య కేసు!
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య (23) హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ముంబయి లోక్మాన్య తిలక్ టెర్మినల్ సీసీ ఫుటేజీ దర్యాప్తులో కీలకంగా మారింది. అనూహ్యతో ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైలు దిగిన తర్వాత ఆమె ఓ వ్యక్తితో కలిసి వెయిటింగ్ రూమ్‌లోకి వెళ్లినట్టు గుర్తించారు. అతను అనుహ్యకు తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇంత వరకూ అతన్ని అదుపులోకి తీసుకోలేదని అంటున్నారు. అతన్ని పట్టుకుంటే హత్యకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుందని ముంబయి పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు, ముంబయు క్రైమ్ బ్రాంచ్ ప్రతినిధులు హైదరాబాద్ బయల్దేరినట్టు తెలుస్తోంది. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సింగవరపు ఎస్తేర్ అనూహ్య ఈనెల 5న అదృశ్యమైన 11 రోజుల తర్వాత కంజూర్‌మార్గ్‌కు సమీపంలో శవమై లభించిన విషయం విదితమే. హత్యకు ముందు ఆమెను ఐదు రోజుల పాటు లైంగిక దాడికి గురిచేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. కాగా ఈ కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్‌మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వాకులు ఉన్నారు. అయితే విచారణ అనంతరం వారిని విడిచి పెట్టారు. అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. -
‘అనూహ్య’కు మద్దతుగా ర్యాలీ
సాక్షి, ముంబై: ముంబైలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్యకు మద్దతుగా కుర్లా నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. హార్మోని ఫౌండేషన్‌తోపాటు నగరంలోని వివిధ క్రిస్టియన్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ర్యాలీలో తెలుగు క్రైస్తవ బాంధవులు కూడా పాల్గొన్నారు. హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకుని అనూహ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసుల వైఖరిపై కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కుర్లా నుంచి మధ్యాహ్నం మూడు గంటల ప్రారంభమైన ఈ ర్యాలీ సాయంత్రం ఆరు గంటల ఎల్టీటీ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో అనూహ్య మేనమామ అరుణ్‌కుమార్, తుశార్ గాంధీలతోపాటు ‘ఇండియన్ క్రిస్టియన్ వాయిస్’ అధ్యక్షుడు అబ్రహం మఠాయి, ‘తెలుగు ఫాస్టర్స్, లీడర్ అసోసియేషన్’ అధ్యక్షులు డాక్టర్ జీవీఎస్ శెట్టి, ‘ది బాంబే తెలుగు క్రిస్టియన్ సోసైటీ’ అధ్యక్షులు ఐ.కుమార్దాస్, ఎం విజయ్‌కుమార్, ముంబై తెలుగు ఫాస్టర్స్ ఫెలోషిప్’ అధ్యక్షుడు ఫాస్టర్ స్టీఫెన్ గాంధీ, కార్యదర్శి ఫాస్టర్ సుందర్రావ్, సభ్యులు ఫాస్టర్ ఆనంద్ జైకుమార్ తదితరులతోపాటు ఇతర తెలుగు క్రిస్టియన్ అసోసియేషన్స్ ప్రముఖులు పాల్గొన్నారు. అనూహ్యకు తెలుగు క్రైస్తవుల నివాళి నగరంలో ఇటీవల హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజినీర్, తెలుగు అమ్మాయి అనూహ్యకు ది బాంబే తెలుగు క్రిష్టియన్ సొసైటీ నివాళి ఆర్పించింది. సోమవారం సాయంత్రం సంతాప సభను ఏర్పాటుచేసింది. తూర్పు పరేల్‌లోని సెయింట్ మేరీ చర్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ డొల్లా స్టీఫెన్ బైబిల్ నుంచి ఆధ్యాత్మిక విషయాలను వివరించారు. అనూహ్య కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని సొసైటీ అధ్యక్షుడు ఐ.కుమార్ దాస్ హామీ ఇచ్చారు. నేరస్తులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి దుర్ఘటనల వల్ల జాగ్రత్తగా ఉండాలని సభికులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి బి.సదానంద, కోశాధికారి ఏబేలు, సొసైటీ సభ్యులు ఇమ్మానుయేలు శెట్టి, కె.విజయ్ కుమార్, సంజీవరావు, ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్ సంజీవ్, జయంతి, అనూహ్య బంధువులు అరుణ్ కుమార్, రాజ్‌మోహన్, పాస్టర్లు ఎస్.డానియేలు, జోయెల్, సలోమెన్ తదితరులు పాల్గొన్నారు. అనేకమంది తెలుగు పాస్టర్లు, తెలుగు క్రైస్తవ సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. -
అనూహ్య కేసు.. పోలీసుల అదుపులో నలుగురు
అనూహ్య కేసుపై ముంబై పోలీసు కమిషనర్ వెల్లడి సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు శనివారం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించామని, వాటి ఫలితాలు రావాల్సి ఉందని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని, వారిలో కొందరికి నేర చరిత్ర ఉందన్నారు. ఆమెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నామని, అయితే దీనిపై ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే స్పష్టత వస్తుందని ఓ పోలీసు అధికారి చెప్పినట్లు ఎన్డీటీవీ తెలిపింది. -
‘అనూహ్య’ కేసులో నిర్లక్ష్యం తగదు
సాక్షి, ముంబై: తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవులు గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘బాంబే క్యాథలిక్ సభ’ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ర్యాలీకి విక్రోలి విభాగం అధ్యక్షుడు రాబర్ట్ డిసౌజా నేతృత్వం వహించారు. విక్రోలి నుంచి నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మీదుగా ముందుకు సాగింది. సుమారు 300 మందితో శాంతియుతంగా ముందుకు సాగిన ఈ ర్యాలీ సుమారు 45 నిమిషాల అనంతరం కాంజూర్ మార్గ్-భాండూప్ మధ్యలో సర్వీస్ రోడ్డుకు పక్కనే అనూహ్య మృతదేహం లభించిన ఘటనాస్థలికి చేరుకుంది. అనంతరం అక్కడ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడంతోపాటు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అనూహ్య కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వీరు ఆరోపించారు. మృతదేహం లభించి వారం రోజులుగా గడుస్తున్నా ఇప్పటివరకు నిందితుల ఆచూకీ కూడా పోలీసులు తెలుసుకోలేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళన మరింత ఉధృతం చేస్తాం... అనూహ్యను హత్య చేసిన నిందితులను తొందరగా పట్టుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని బాంబే క్యాథలిక్ సభ విక్రోలి విభాగం అధ్యక్షుడు రాబర్ట్ డిసౌజా పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వేమంత్రికి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. ర్యాలీలో రాబర్ట్ డిసౌజాతోపాటు ఫాదర్ సైమన్ లాఫీస్, ములూండ్ విభాగం అధ్యక్షుడు రానీ టెస్లర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే పోలీసుకు వినతిపత్రం... నిరసన ర్యాలీ అనంతరం కుర్లా రైల్వే పోలీసు సీని యర్ ఇన్స్పెక్టర్ శివాజీధుమాల్‌కు సభ ప్రతినిధుల బృందం ఓ వినతి పత్రాన్ని అందచేసింది. దర్యాప్తును వేగవంతం చేయడంతోపాటు వెంటనే నింది తులను అరెస్టు చేయాలని అందులో పేర్కొన్నారు. -
ఎల్టీటీ.. లోపాల పుట్ట!
సాక్షి, ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య ముంబైలో రైలు దిగిన అనంతరం ఎటువైపు నుంచి వెళ్లిందనేది పోలీసులకు ఇంతవరకు తెలియరాలేదు. ఎంతో కీలకంగా భావించే సీసీటీవీ కెమెరాల్లో అనూహ్యకు సంబంధించిన ఎలాంటి ఫుటేజ్‌లు లభించలేకపోవడం గమనార్హం. అత్యాధునిక సాంకేతిక పరి/ా్ఞనం వినియోగిస్తున్నామని పేర్కొనే పోలీసులకు ఇంత వరకు ఒక్క ఆధారం కూడా సేకరించకపోవడంపై అనూహ్య బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంతోపాటు దేశంలోని ప్రముఖ రైల్వేస్టేషన్లలో ఒక్కటైన ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), దాదర్ టర్మినస్లపై కొంత భారాన్ని తగ్గించేందుకు లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీ టీ)ను నిర్మించారు. అనంతరం దీన్ని అత్యాధునిక పరి/ా్ఞనంతో ఆధునికీకరించారు. అయినప్పటికీ రైలు దిగిన అనూహ్య గురించి సీసీటీవీలో ఎలాంటి సమాచారం లభించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్లా టర్మినస్‌లో భద్రతా ఏర్పాట్లపై ‘సాక్షి’ దృష్టి పెట్టగా పలు లోపాలు బయటపడ్డాయి. ఇక్కడ మెటల్ డిటెక్టర్లున్నప్పటికీ ప్రయాణికులు నేరుగా వెళ్లడం విశేషం. మరోవైపు ఫ్లాట్ ఫారం ముందు నుంచి వెళితే అక్కడ పోలీసుల జాడ లేదు. ఈ టర్మినస్‌లో మొత్తం అయిదు ఫ్లాట్ ఫారాలున్నాయి. ఒకటో ఫ్లాట్‌ఫారం విడిగా ఉండగా రెండు, మూడు ఫ్లాట్‌ఫారాలు, నాలుగు, అయిదు ఫ్లాట్ ఫారాలు కలిసి ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫారాలన్నింటిపై నుంచి బయటికి వెళ్లేందుకు ఒకే ఒక్క పాదచారుల వంతెన ఉండగా ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారంపై ప్రధాన ద్వారం ఉంది. అయితే ముందువైపు నుంచి మాత్రం నేరుగా వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఇక అనూహ్య రైలు దిగిన మూడవ నెంబరు ఫ్లాట్ ఫారాాన్ని పరిశీలించినట్టయితే నాలుగు సీసీ టీవీలున్నాయి. ఫ్లాట్‌ఫారం మధ్యలో ఉన్న పాదచారుల వంతెన వరకు నాలుగు సీసీటీవీలు సుమారు 40 నుంచి 50 అడుగుల దూరంలో అమర్చి ఉన్నాయి. అయితే ఇవన్నీ డౌన్ వైపు చిత్రీకరించేవిధంగా ఉన్నాయి. దీంతో వీటిలో అనూహ్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ శింతే తెలిపారు. దీంతో రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంలోని సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై కూడా కేవలం ఆరు సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిలో మొదటి మూడు ఫ్లాట్ ఫారం మూడుపై ఉన్నట్టుగానే దిగువ వైపు చిత్రీకరించే విధంగా ఉండగా, తర్వాత కెమెరా ఎగువ వైపు, మరొకటి దిగువ దిశగా ఉన్నాయి. అయితే ఇవన్ని కూడా పాదచారుల వంతెన తర్వాత మరో రెండు మూడు బోగీలు కనిపించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. కాని ఇంజిన్‌వైపు నుంచి వెళితే మాత్రం ఎవరూ కన్పించే అవకాశంలేదు. దీంతో అనూహ్య అటునుంచి వెళ్లిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ముందువైపు ఎగ్జిట్, ఎంట్రెన్స్‌లో కూడా సీసీ టీవీలున్నట్టయితే అనూహ్య కన్పించి ఉండడంతోపాటు ఆమెను కాపాడుకునేందుకు కూడా ఆస్కారం ఉండేదని భావిస్తున్నారు. అయితే ఊరినుంచి వెళ్లిన ప్రతిసారీ అటోలోనే ఇంటికి వెళ్లే అనూహ్య ఈసారి కూడా ఎటువైపు నుంచి అటోలో వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇప్పటి వరకు పలువురిని విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుపుతున్నారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని వైపుల సీసీటీవీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. -
పురోగతి లేని ‘అనూహ్య’ కేసు
సాక్షి, ముంబై: అనూహ్య అదృశ్యమైంది ఈనెల 5న.. శవమై తేలింది 11 రోజుల తర్వాత.. ఇప్పుడు మరో ఐదు రోజులు గడిచిపోయాయి. అయినా ఈ హత్య కేసులో పురోగతి ఏమాత్రం కనిపించడం లేదు. హత్యకు పాల్పడ్డవారిని పట్టుకోవడం కాదు కదా.. వారికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించలేకపోయారు. ఓవైపు రైల్వే పోలీసులు.. మరోవైపు కంజూర్ మార్గ్ పోలీసులు.. ఇంకోవైపు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నా మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోతున్నారు. మృతదేహం లభిం చిన ఐదు రోజుల తర్వాత అనూహ్య పాదరక్షలు, దుప్పటిని గుర్తించారు. ఆమె మృతదేహం లభించిన చోటు నుంచి సుమా రు కిలోమీటరు దూరంలో ఈ వస్తువులు ఆదివారం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి స్నేహితుడు హేమంత్పై ఇంకా ఆరా తీస్తున్నారు. ఆమె ముంబైలో దిగిన రోజు హేమంత్ సెల్‌ఫోన్ షిర్డీలో ట్రేస్ అయిందని, తర్వాత అతను హైదరాబాద్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. కాగా, అనూహ్య మృతదేహం బయటపడ్డ కం జూర్మార్గ్ ప్రాంతంలో సోమవారం ‘సాక్షి’ పర్యటించింది. అనూహ్య కేసు దర్యాప్తు చేస్తున్న కంజూర్ మార్గ్ పోలీసు ఇన్స్పెక్టర్ నిశికాంత్ తుంగారేతోపాటు స్థానికులను కేసు గురించి అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించింది. సాక్షి పరిశీలనలో వెల్లడైన విషయాలివీ.. - అనూహ్య భౌతికకాయం లభించిన ప్రాంతం కంజూర్ మార్గ్ పోలీస్ స్టేషన్ నుంచి సుమారు ఒకటి, ఒకటిన్నర కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది. - ఈ ప్రాంతాన్ని కంజూర్-భాండూప్గా చెప్పుకుంటారు. కొందరు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇక్కడ నివసిస్తున్నారు. - ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన నిర్మానుష్యంగా ఉన్న చెట్లపొదల్లో అనూహ్య శవం దొరికింది. ఇక్కడ ఆకతాయిలు, నేరచరిత్ర కలిగినవారు మద్యం తాగుతుంటారు. అప్పుడప్పుడు అక్కడ గొడవలు జరిగేవి. - ఈ ప్రాంతం గురించి తెలిసినవారే అనూహ్యను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసి ఉండొచ్చని అనుమానం. -
మిస్టరీగానే అనూహ్య హత్య
దర్యాప్తులో కానరాని పురోగతి ఒక్క ఆధారాన్నీ సేకరించని మహారాష్ట్ర పోలీసులు అనూహ్య హత్యపై ఎన్నో సందేహాలు ముంబైకి చేరిన రోజే హత్యకు గురైందన్న అనుమానాలు సాక్షి, ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య(23) కేసులో ఇంతవరకూ ఎలాంటి పురోగతీ లేదు. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు ఎలాంటి ఆధారాలూ సంపాదించలేదు. దీంతో ఈహత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ నెల 4న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన అనూహ్య.. 16న ముంబైలోని కంజూర్ మార్గ్-భాండూప్ మధ్యలో ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన శవంగా కనిపించిన విషయం తెలిసిందే.అయితే, నాలుగురోజులు కావస్తున్నా పోలీసులు ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయారు. దీంతో అనూహ్య కుటుంబీకులు ఆరోపిస్తున్నట్టుగా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కుర్లా-భాండూప్ మధ్యలోనే?: అనూహ్య హత్య కుర్లా-భాండూప్ మధ్యలోనే జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. విశాఖ నుంచి బయల్దేరిన అనూహ్య ఈ నెల 5న తెల్లవారుజామున 4.55 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్(ఎల్టీటీ)కుర్లాలో రైలు దిగింది. అక్కడి నుంచి ఏమైందనే విషయంపై ఇప్పటివరకు ఏ విధమైన వివరాలూ తెలియలేదు. అనూహ్య అంధేరీలో తానుంటున్న హాస్టల్‌కు వెళ్లేందుకు ఎప్పుడూ కుర్లా నుంచి ఘట్కోపర్ పవాయి మీదుగా వెళ్తుందని కుటుంబీకులు చెబుతున్నారు. ఎల్టీటీనుంచి ఆమె ఉండే హాస్టల్‌కు చేరుకోవాలంటే ఎటునుంచి వెళ్లినా 20 నుంచి 30 కిలోమీటర్లకు మించదు. అయితే ఆమె అంధేరీ చేరుకోకముందే మార్గమధ్యంలోనే శవంగా మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేరోజున హత్యకు గురైందా?: కాగా శవపరీక్షలు నిర్వహించిన జేజే ఆసుపత్రి డీన్ డాక్టర్ తాత్యా లహానే అనూహ్య మృతదేహం బాగా కుళ్లిపోయిందని తెలిపారు. ఆమె హత్యకు గురై ఎన్నిరోజులై ఉంటుందన్న విషయాన్ని ఆయన కచ్చితంగా చెప్పలేకపోయినా.. వారం పదిరోజులు అయిఉండే అవకాశాలను కాదనలేదు. అనూహ్య ముంబైకి చేరినరోజే హత్యకు గురై ఉంటుందన్న అనుమానాలకు ఇది బలం చేకూరేలా చేసింది. మరో విషయం ఏమిటంటే.. ఆమె రైల్వేస్టేషన్ నుంచి అంధేరీ వెళ్లేందుకు కుర్లా-భాండూప్ మార్గంలో వెళ్లవచ్చు. అయితే అంధేరీ వెళ్లేందుకు కంజూర్‌మార్గ్ వద్ద మలుపు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆమె మృతదేహం భాండూప్ వెళ్లే మార్గంలో.. సర్వీస్ రోడ్డు పక్కన లభించింది. దీనినిబట్టి ఆమె ఎక్కిన ఆటో లేదా క్యాబ్ మలుపు తీసుకోకుండా భాండూప్ వైపునకు సాగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్టీటీ నుంచి ఆమె వెళ్లిన ఆటో లేదా క్యాబ్లోనివారు మార్గమధ్యలో ఆమెను హత్యచేసి అనంతరం అక్కడ పడేసి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితులు ఆమెను హత్య చేసిన అనంతరం తగులబెట్టి ఉండవచ్చని కుటుంబీకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇదేం దర్యాప్తు: అనూహ్య కన్పించకుండా పోయినప్పటినుంచి ఇటు రైల్వే, అటు మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై అనూహ్య కుటుంబీకులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగా లేదని ముంబైలో ఉంటున్న అనూహ్య బంధువు సునీత ‘సాక్షి’కి తెలిపారు. ‘‘ఈ నెల ఐదవ తేదీ తెల్లవారుజామున 4.55 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో దిగినమాట వాస్తవమైనప్పటికీ దర్యాప్తు సక్రమంగా ఎందుకు కొనసాగడంలేదు?. అనూహ్య కన్పించడంలేదని ఫిర్యాదు అందగానే ఈ విషయాన్ని ఇతర పోలీస్స్టేషన్లకు పోలీసులు ఎందుకు తెలుపలేదు?’’ అని ఆమె ప్రశ్నించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ సీసీటీవీలోనూ ఆధారాలు లభించడంలేదా? అని నిలదీశారు. మృతదేహం అనూహ్యదేనా?: గుర్తుపట్టలేని స్థితిలో లభించిన యువతి మృతదేహం అసలు అనూహ్యదేనా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఆమె బంధువు సునీత మాట్లాడుతూ అనూహ్య కోసం వెదుకుతున్న సమయంలో తమకు గుర్తుపట్టలేని స్థితిలో మహిళ శవం లభించిందని, ఆమె వేలుకున్న ఉంగరాన్నిబట్టి అనూహ్య అనినిర్ధారణకు వచ్చామని, నిందితులు ఆ శవానికి అనూహ్య ఉంగరం తొడిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. డీఎన్ఏ పరీక్షల అనంతరమే అన్ని విషయాలూ తెలుస్తాయన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.. అనూహ్య కేసుకు సంబంధించి అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. దీనిపై భాండూప్ ఏసీపీ శేజ్వాల్ను ‘సాక్షి’ ప్రశ్నించగా.. దర్యాప్తు కొనసాగుతోందని మాత్రమే తెలిపారు. అన్ని వివరాలు తొందర్లోనే తెలుపుతామని చెప్పారు. అండగా ఉంటాం: వైఎస్ విజయమ్మ మచిలీపట్నం, న్యూస్‌లైన్: అనూహ్య తండ్రి ప్రసాద్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ఫోన్లో పరామర్శించారు. ఘటన వివరాలను ప్రసాద్నడిగి తెలుసుకున్నారు. ‘మీ కుటుంబానికి అండగా ఉంటాం’ అని ఆయనకు భరోసా ఇచ్చారు. న్యాయం జరిగేవరకూ వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తామని హామీఇచ్చారు. అనూహ్య తండ్రికి సీఎం పరామర్శ అనూహ్య తండ్రి ప్రసాద్‌ను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. మంత్రి పార్థసారథి సీఎంకు ఫోన్‌చేసి ప్రసాద్‌తో మాట్లాడాలని కోరగా.. ఆయన ఫోన్లో అనూహ్య తండ్రిని పరామర్శించారు. మహారాష్ట్ర సీఎంతో స్వయంగా మాట్లాడానని, అనూహ్య కేసును త్వరితగతిన పరిష్కరించాలని కోరానని కిరణ్ చెప్పారు. -
నేడు ఆజాద్ మైదాన్‌లో నిరసన
సాక్షి, ముంబై: నగరంలో హత్యకు గురైన తెలుగమ్మాయి ఎస్తేర్ అనూహ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు ప్రజలు మంగళవారం నిరసనకు దిగనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆజాద్ మైదాన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాదిరెడ్డి కొండారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ కేసును త్వరితగతిన విచారించి నిందితులకు శిక్ష వేయాలన్నారు. భారీగా తెలుగు ప్రజలు పాల్గొనాలని కోరారు. ఘననివాళి పింప్రి, న్యూస్‌లైన్: పుణే సాక్షి మీడియా బృందం దేహూరోడ్డులోని ‘ట్రైజీసస్ మినిస్ట్రీస్’ తెలుగు చర్చిలో ఆదివారం సాయంత్రం ఘననివాళి అర్పించారు. చర్చి పాస్టర్ జాకప్ వీరప్ప సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగువారి కోసం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని సూచించారు. ఏదైనా ఘటన జరిగితే రాష్ర్టంలోని తెలుగువారంతా కుల మతాలకు అతీతంగా ఏకం కావాలన్నారు. కార్యక్రమంలో స్థానిక తెలుగు సమాజ సభ్యులు శివప్రసాద్, దేహూరోడ్ తెలుగు పాఠశాల ఉపాధ్యాయులు వీరేష్, రమాంజనేయులు, భీంసింగ్ తల్వాది,టీసీఎస్ కంపెనీకి చెందిన ఉద్యోగులు లక్ష్మీ సుధీర్, గంగా తల్వాది, దీపా, ప్రియాంక తదితరులు హాజరయ్యారు. -
అనూహ్యకు కన్నీటి వీడ్కోలు
మచిలీపట్నం/ కోనేరుసెంటరు,న్యూస్‌లైన్ : ముంబయిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శింగవరపు ఎస్తేర్ అనూహ్య (23)కు మచిలీపట్నంలో శనివారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులతో పాటు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. అనూహ్యను అంతమొందించిన మానవ మృగాలను శిక్షించాలని, ఉరిశిక్ష విధించాలని పలువురు గొంతెత్తి నినదించారు. పట్టణంలోని ఇంగ్లీషు చర్చి (అరబెల్లా) ప్రాంగణంలో అనూహ్య తాతయ్య ఎస్ఐవీడీ ప్రసాద్, నానమ్మ లలితమ్మ సమాధి పక్కనే క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. అంతకుముందు నోబుల్ కాలనీకి చెందిన సీఎస్ఐ చర్చి పాస్టర్లు సుధాకర్ తదితరులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉద్విగ్న క్షణాలు... అనూహ్య మృతదేహాన్ని శనివారం ఉదయం ఆరు గంటలకు మచిలీపట్నం తీసుకొచ్చారు. అప్పటికే పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున నోబుల్కాలనీలోని ఆమె ఇంటికి తరలివచ్చారు. అనూహ్య మృతదేహాన్ని ఉంచిన శవపేటికను దించే సమయంలో అక్కడ ఉద్విగ్న వాతావరణ నెలకొంది. అనూహ్య తల్లిదండ్రులు జ్యోత్స్న, జోనాతన్ ప్రసాద్, వారి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ముంబయిలో స్థిరపడిన కూతురు విగతజీవిగా మారి ఇంటికి రావడంతో ఆమె తల్లిదండ్రులు ‘భగవంతుడా... మాకు ఎంత కష్టం తెచ్చిపెట్టావ’ంటూ భోరున విలపించారు. కుమార్తె శవ పేటికపై పడి విలపిస్తున్న అనూహ్య తల్లిదండ్రులను మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో పాటు పలువురు ఓదార్చారు. భారీ ర్యాలీగా అంతిమయాత్ర... అనూహ్య అంతిమయాత్ర నోబుల్కాలనీలోని వారి నివాసం నుంచి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత స్థానిక చర్చిలో మృతదేహాన్ని ఉంచి ప్రార్థనలు చేశారు. అక్కడినుంచి ప్రభుత్వాస్పత్రి సెంటరు మీదుగా మాచవరం లోని ఇంగ్లీషు చర్చి వరకు యాత్ర సాగింది. అనూహ్య మరణానికి కారణమైన నిందితులను శిక్షించాలని కోరుతూ పలువురు ప్లకార్డులు చేతబూని, నల్ల రిబ్బన్లు ధరించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనూహ్య మృతి కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, అనూహ్య మరణంపై మిస్టరీని ఛేదించాలని, ముంబయి పోలీసుల నిర్లక్ష్యవైఖరి నశించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ అంతిమ యాత్రలో బందరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని), పీసీసీ కార్యదర్శి బూరగడ్డ వేదవ్యాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, టీడీపీ బందరు నియోజకవర్గ ఇన్చార్జి కొల్లు రవీంద్ర, వైఎస్సార్ సీపీ నాయకులు మాదివాడ రాము, బొర్రా విఠల్, థామస్ నోబుల్, టీడీపీ నాయకులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, లంకిశెట్టి వనజ, కాంగ్రెస్ నాయకుడు చిలంకుర్తి పృద్వీప్రసన్న, న్యాయవాది సోడిశెట్టి బాలాజీ, మారుమూడి విక్టర్‌ప్రసాద్, సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, బీజేపీ నేత దూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, ఆర్డీవో పి.సాయిబాబు, బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఏఎస్పీ వి ప్రేమ్‌కుమార్, నోబుల్ కళాశాల ప్రిన్సిపాల్ పీవీ అనీల, క్రైస్తవ సంఘాల మత పెద్దలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అనూహ్య మృతదేహాన్ని ఖననం చేసిన అనంతరం ఆమె సమాధిపై పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనూహ్య హత్యను నిరసిస్తూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనూహ్య దారుణ హత్యను నిరసిస్తూ బందరు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పలు విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. వైఎస్సార్సీపీ నేతల పరామర్శ అనూహ్య కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు, పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు తాతినేని పద్మావతి శనివారం పరామర్శించారు. వారు మచిలీపట్నం నోబుల్ కాలనీలోని అనూహ్య తల్లిదండ్రులను కలిసి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇటువంటి దుర్ఘటన జరిగి ఉండేది కాదంటూ అనూహ్య తండ్రి ప్రసాద్ వారి ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన కల్పన, పద్మావతి.. అనూహ్య హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ కేసును సుమోటోగా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్ల ప్రసాద్ కుటుంబానికి కడుపుకోత మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్భయ, అభయ, అనూహ్య వంటి ఎంతోమంది అమాయక యువతులు కామాంధుల పైశాచిక చర్యలకు బలైపోతున్నారన్నారు. ఇటువంటి సంఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటే న్యాయస్థానాలు మరిన్ని కఠినమైన చట్టాలను అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముంబయి పోలీసులు తక్షణమే స్పందించి నేరస్తులను కఠినంగా శిక్షించేలా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
అనూహ్య అంత్యక్రియలు పూర్తి
విజయవాడ : ముంబయిలో దారుణంగా హత్యకు గురైన అనూహ్య భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు మచిలీపట్నంలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనూహ్య తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ ఈ కేసులో ముంబయి పోలీసుల నిర్లక్ష్యం స్ఫష్టంగా కనిపించిందన్నారు. తాము ప్రయత్నించి ఉండకపోతే మృతదేహం కూడా తమకు దక్కేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనూహ్య ఫోన్‌కు సిగ్నల్స్ ఉన్నాయనే మాట అవాస్తవమన్నారు. అదృశ్యమైన రోజు మధ్యాహ్నం వరకే ఫోన్ పని చేసిందని ప్రసాద్ తెలిపారు. మృతదేహం వద్దే సెల్‌ఫోన్ లభించిందన్నారు. ముంబయి రైల్వేస్టేషన్లో అనూహ్యను రిసీవ్ చేసుకోవటానికి ఎవరూ రాలేదని ఆయన చెప్పారు. కాగా అనూహ్య మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం పూర్తికావడంతో రాత్రి 10 గంటలకు బంధువులు ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో మచిలీపట్నం తరలించారు. -
ముంబైలో ‘అనూహ్య’ హత్య
-
‘అనూహ్య’ దారుణం
సాక్షి, మచిలీపట్నం/విజయవాడ: ముంబయిలో ఉద్యోగం చేస్తూ క్రిస్మస్ వేడుకలకు సొంతూరు బందరు వచ్చిన కూతురుతో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా గడిపారు.. చర్చిలో జరిగిన వేడుకల్లోను ఆమె ఎంతో చురుగ్గా పాల్గొంది.. తిరిగి ఈ నెల నాలుగున ముంబయి వెళ్లింది. ఆ ఆనందపు క్షణాలు ఇంకా బంధుమిత్రుల కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.. ఇంతలోనే ఆమె ‘అనూహ్య’గా దారుణ హత్యకు గురైందన్న వార్త కలవరపాటుకు గురిచేసింది.. ముంబయిలో బందరు యువతిపై జరిగిన ఘాతుకం తెలుసుకున్న జిల్లా తల్లడిల్లుతోంది. ముంబయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య (23) అత్యంత దారుణ స్థితిలో మృతిచెందిన వైనం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. క్రిస్మస్ కోసం వచ్చిన ఆమె తిరిగి ముంబయికి పయనమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న శవమై కనిపించింది. ఆమె మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. తండ్రి రిటైర్మెంట్ రోజునే ఉద్యోగం... తన తండ్రి ఉద్యోగ విరమణ రోజునే అనూహ్య ఉద్యోగం చేపట్టిందని సన్నిహితులు చెబుతున్నారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన శింగవరపు జోనతమ్ సురేంద్రప్రసాద్, జ్యోత్స్నలకు ఎస్తేర్ అనూహ్య (23), లావణ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానిక నోబుల్ కాలేజీలో పాలిటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేస్తూ ఏడాది క్రితం ఆయన రిటైరయ్యారు. పెద్ద కుమార్తె అనూహ్య ఒకటి నుంచి ఏడు వరకు షారన్ స్కూలులో చదువుకోగా ఎనిమిది నుంచి పదో తరగతి వరకు అమలేశ్వరి విద్యానికేతన్‌లో చదివింది. శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. అనంతరం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చేసింది. రెండో కుమార్తె లావణ్య గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. అనూహ్య జేఎన్టీయూ (కాకినాడ) ఆఖరి ఏడాది చదువు పూర్తవుతున్న తరుణంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో ముంబయిలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఏడాది క్రితం ప్రసాద్ నోబుల్ కాలేజిలో ఉద్యోగ విరమణ చేసిన రోజునే టీసీఎస్‌కు ఎంపికైన అనూహ్య విధుల్లో చేరినట్టు చెబుతున్నారు. అనంతరం ఆరు నెలల పాటు కేరళలో శిక్షణ పొందగా కంపెనీ ముంబయిలో పోస్టింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి అనూహ్య ముంబైలోని వైఎంసీఏ హాస్టల్లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. అనూహ్యంగా దూరమైంది... అయినవారి మధ్య క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడిపిన అనూహ్య ఈ నెల నాలుగున ముంబయికి తిరిగి బయల్దేరింది. తండ్రి ప్రసాద్ విజయవాడ రైల్వేస్టేషన్‌కు కారులో తీసుకెళ్లి తగిన జాగ్రత్తలు చెప్పి రెలైక్కించారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె ఫోన్ చేసి సోలాపూర్ వరకు వెళ్లినట్టు చెప్పింది. తన ఫోన్ చార్జింగ్ అయిపోయిందని తరువాత మాట్లాడతానని తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. మరుసటి రోజు ఉదయం వరకు వేచిచూసిన ప్రసాద్ అనూహ్యకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. స్విచాఫ్ అని సమాధానం రావటంతో అనుమానం వచ్చిన ఆయన హాస్టల్‌కు ఫోన్ చేశారు. ఆమె ఇంకా రాలేదని సమాధానం రావటంతో కంగారుపడి ఆరోజు సాయంత్రం వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సాయంత్రానికి చేరలేదని తెలియటంతో ముంబయిలోని తన బంధువులకు విషయం చెప్పగా వారు అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు విజయవాడలో ప్రసాద్ బావమరిది ఫిర్యాదు అందించారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ముంబయికి బయలుదేరి వెళ్లారు. విజయవాడ పోలీసులు ముంబయిలోని రైల్వే పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించగా, వారు దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు కూడా ఆచూకీ కోసం రోజులతరబడి గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గాలింపు ముమ్మరంగా చేయగా బంధువులకు ముంబయిలోని కుంజూర్‌మార్గ్ అనే ప్రాంతంలోని ఓ చెరువు గట్టు పక్క నుంచి భరించలేని దుర్గంధం వస్తుండటంతో అనుమానం వచ్చిన ప్రసాద్ అక్కడికివెళ్లి చూడగా ఒంటిపై యాసిడ్ పోసిన విధంగా దాదాపు 70 శాతం వరకు కాలిపోయిన గాయాలతో గుర్తుపట్టలేని విధంగా ఓ యువతి మృతదేహం కనిపించింది. చేతికున్న ఉంగరాన్ని చూసి ప్రసాద్ అది అనూహ్య మృతదేహంగా గుర్తించి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముంబయి పోలీసుల తీరుపై బంధువుల ఆగ్రహం... అనూహ్య మరణవార్త తెలుసుకున్న బంధువులు ముంబయి పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. యువతి అదృశ్యంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా దురుసుగా వ్యవహరించటాన్ని తప్పుపడుతున్నారు. ఈ ఘటనకు ముంబయి పోలీసుల వైఫల్యమే కారణమని, అందుకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని మండిపడుతున్నారు. అంతుచిక్కని అనుమానాలెన్నో.. టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న అనూహ్య మృతిపై బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న ముంబయి చేరిన అనూహ్య అక్కడి నుంచి ఎక్కడికెళ్లి ఉంటుందనే విషయాన్ని ముంబయి పోలీసులు ఇంతవరకు తేల్చలేకపోయారు. అనూహ్యపై గుర్తుతెలియని దుండగులు లైంగికదాడి చేసి హత్య చేసి ఉంటారా? లేక డబ్బు కోసం ఈ హత్య చేసి ఉంటారా? సహోద్యోగుల నుంచి ఏదైనా ఆపద వచ్చిందా? స్నేహితులెవరైనా ఈ అకృత్యానికి ఒడిగట్టారా? అనే అనుమానాలు బంధువులను దహించివేస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తయితే ఏం జరిగిందనేది తెలిసే అవకాశముంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. అనూహ్య మృతిపై కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బంధువులు చెబుతున్నారు. ముంబయి నుంచి శుక్రవారం రాత్రి 8 గంటలకు విమానంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు బంధువులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు మచిలీపట్నంలో అనూహ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేను దేవుడ్ని నమ్ముకున్నా.. నా బిడ్డ చనిపోదు.. నేను దేవుడ్ని నమ్ముకున్నా.. నా బిడ్డకు ఏం కాదు.. ఆమె చనిపోలేదు.. ఇది గుండె వ్యాధితో బాధపడుతున్న అనూహ్య తల్లి జ్యోత్స్న ఆవేదన. కూతురి ఆచూకీ కోసం గాలిస్తూ ముంబయికి వెళ్లిన తండ్రి ప్రసాద్‌కు అనూహ్య మృతదేహం కన్పించడంతో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన భర్త వెళ్లి కూతురు ఎక్కడ ఉందో తెలుసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్న జ్యోత్స్నకు అసలు సంగతి చెప్పేందుకు మొదట ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఆమెకు గుండె వ్యాధి కారణంగా బంధువులు వచ్చిన అనంతరం కాస్త గుండె దిటవు చేసుకుని చెప్పారు. అయినా తన బిడ్డ తిరిగి వస్తుందన్న ఆశతో ఆ తల్లి ఎదురు చూస్తోంది. -
ముంబైలో ‘అనూహ్య’ హత్య
* సంచలనం సృష్టిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి * పదకొండు రోజుల తర్వాత కనిపించిన మృతదేహం * బలమైన ఆయుధంతో కొట్టి చంపారంటున్న పోలీసులు * రైలు దిగిన తర్వాత ఎక్కడికి వెళ్లింది? * ఎవరు హత్యకు పాల్పడ్డారు? సాక్షి, విజయవాడ/ముంబై: ‘నాన్నా.. పొద్దున ట్రెయిన్ దిగగానే ఫోన్ చేస్తా..!’ తెల్లారింది కానీ ఫోన్ రాలేదు.. గంటలు గడిచిపోయాయి.. తల్లిదండ్రుల్లో టెన్షన్! అమ్మాయి ఎక్కడుందోనన్న ఆందోళన.. ఏమైపోయిందోనన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు.. 11 రోజులు గడిచిపోయాయి.. అయినా కూతురు క్షేమంగానే ఉంటుందని తల్లిదండ్రుల్లో ఆశ.. ఇంతలోనే షాక్.. దారుణ హత్యకు గురై, గుర్తుపట్టేందుకు వీల్లేని స్థితిలో ముంబైలో అమ్మాయి మృతదేహం!! కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య(23) హత్య సంచలనం సృష్టిస్తోంది. ఆమె ముంబైలో రైలు దిగిన తర్వాత ఏం జరిగింది? ఎక్కడికి వెళ్లింది? ఎవరు హత్య చేశారు? చంపేసి ఎందుకు తగులబెట్టారు? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఈ నెల 4న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన అనూహ్య.. 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. ప్రయాణికులు ఏం చెప్పారు? గత ఏడాది క్యాంపస్ సెలక్షన్లో ఎంపికైన అనూహ్య ముంబైలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి అంధేరీలోని వైడబ్ల్యూసీఏ హాస్టల్లో ఉంటోంది. క్రిస్మస్ సెలవుల కోసం మచిలీపట్నానికి వచ్చిన ఆమె ఈనెల 4న ముంబై బయల్దేరింది. నాలుగో తేదీ రాత్రి 10 గంటల సమయంలో మహారాష్ట్రలోని షోలాపూర్ చేరుకున్నానని, ఉదయం హాస్టల్‌కు వెళ్లగానే ఫోన్ చేస్తానని తండ్రి జోనతమ్ సురేంద్రప్రసాద్కు చెప్పింది. అయితే తెల్లారి ఆమె నుంచి ఫోన్ రాకపోవడంతో తల్లిదండ్రులు ప్రసాద్, జ్యోత్స్న కంగారు పడ్డారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని రావడంతో అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె మేనమామ విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ప్రసాద్ కూడా ముంబై వెళ్లి కుర్లా రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెతో పాటు ప్రయాణించిన వారి వివరాలను తెప్పించి వారితో మాట్లాడారు. అనూహ్య ఎస్-5 బోగీ లో 47వ బెర్త్‌లో ప్రయాణం చేసినట్లు తేలింది. బెర్త్ నం 41, 43, 45లలో ప్రయాణించిన వారితో పోలీసులు మాట్లాడారు. 45వ నంబర్ బెర్త్‌ల్లో ప్రయాణించిన హరిబాబు పుణేలో దిగిపోయారు. ఆయన రైలు దిగే సమయానికి అనూహ్య తన బెర్త్‌లో నిద్రపోతోందని చెప్పారు. మిగిలిన బెర్త్‌లలో ప్రయాణిస్తున్న రఘునాథ్, సుహాసిని దంపతులు అనూహ్యతోపాటు ముంబై వరకూ ప్రయాణించారు. ఉదయం 5.30 గంటలకు రైలు ముంబైలో అగినపుడు అనూహ్య కూడా దిగిందని వారు చెప్పారు. ‘అమ్మా నీ కోసం ఎవరైనా వస్తున్నారా? మాతో వస్తావా’ అని అడిగితే తనకు అలవాటేనని, వెళ్లిపోతానని అనూహ్య సమాధానం చెప్పిందని రఘునాథ్ పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత ఏమైందన్నదే మిస్టరీగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హేమంత్ అనే స్నేహితుడు అనూహ్యకు ఆహార ప్యాకెట్స్ తెచ్చి అందించారు. ఆ తర్వాత అతను సికింద్రాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడం, ఫోన్ చేసినా సరిగ్గా స్పందించకపోవడంతో అతని పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముంబైలో కూడా అనూహ్యతో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బలమైన ఆయుధంతో కొట్టి చంపారు.. అనూహ్యను దుండగులు బలమైన ఆయుధంతో కొట్టి హత్య చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఆమె దేహం, మర్మావయవాలపైనా గాయాలున్నట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు చెప్పారు. లైంగిక దాడికి గురైనట్లు అనుమానిస్తున్నారా అని అడగ్గా.. ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే ఈ విషయం తేలుతుందన్నారు. ముంబై పోలీసుల నిర్లక్ష్యం.. కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారని అనూహ్య తండ్రి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపూ అమ్మాయికి ఎవరితో పరిచయాలు ఉన్నాయన్న అంశంపైనే వారు దృష్టి పెట్టారని, ముంబైలో అసాంఘిక శక్తుల బారిన పడిందన్న కోణంలో దర్యాప్తు చేయలేదని చెప్పారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఈ దిశగా విచారణ జరిపి ఉంటే అనూహ్య తమకు దక్కేదని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ముంబై పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని హుజూర్‌నగర్‌లో ఉంటున్న అనూహ్య మామ బీఎస్జే మనోహర్ తెలిపారు. విషయం తెలియగానే తాము తొలుత ముంబైలోని ఎంఐడీసీ పోలీసుస్టేషన్‌కు వెళ్లామని, అయితే వారు కుర్లా స్టేషన్‌కు వెళ్లమని సూచించారని, అక్కడికి వెళ్తే వారు చాలా తేలిగ్గా తీసుకొని, ముందుగా విజయవాడ రైల్వే స్టేషన్లో కేసు పెట్టాలని చెప్పినట్లు ముంబైలో ఉంటున్న సునీత వివరించారు. రాష్ట్ర డీజీపీని కలిసి ముంబై పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని, అంధేరి పోలీసులు ఎలాంటి సహకారం అందించలేదని, స్థానిక ఆటోడ్రైవర్ల సహాయంతో అనూహ్య మృతదేహాన్ని కనుగొన్నామని సికింద్రాబాద్‌లో ఉంటున్న ఆమె చినతాత ఇమ్మానుయేల్ చెప్పారు. నేడు అంత్యక్రియలు అనూహ్య మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం పూర్తికావడంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు అనూహ్య మృతదే హాన్ని బంధువులు ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. శనివారం మచిలీపట్నంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.