సాక్షి, ముంబై: ముంబైలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్యకు మద్దతుగా కుర్లా నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ) వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. హార్మోని ఫౌండేషన్‌తోపాటు నగరంలోని వివిధ క్రిస్టియన్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ర్యాలీలో తెలుగు క్రైస్తవ బాంధవులు కూడా పాల్గొన్నారు. హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకుని అనూహ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పోలీసుల వైఖరిపై కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కుర్లా నుంచి మధ్యాహ్నం మూడు గంటల ప్రారంభమైన ఈ ర్యాలీ సాయంత్రం ఆరు గంటల ఎల్‌టీటీ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో అనూహ్య మేనమామ అరుణ్‌కుమార్, తుశార్ గాంధీలతోపాటు ‘ఇండియన్ క్రిస్టియన్ వాయిస్’ అధ్యక్షుడు అబ్రహం మఠాయి, ‘తెలుగు ఫాస్టర్స్, లీడర్ అసోసియేషన్’ అధ్యక్షులు డాక్టర్ జీవీఎస్ శెట్టి, ‘ది బాంబే తెలుగు క్రిస్టియన్ సోసైటీ’ అధ్యక్షులు ఐ.కుమార్‌దాస్, ఎం విజయ్‌కుమార్, ముంబై తెలుగు ఫాస్టర్స్ ఫెలోషిప్’ అధ్యక్షుడు ఫాస్టర్ స్టీఫెన్ గాంధీ, కార్యదర్శి ఫాస్టర్ సుందర్‌రావ్, సభ్యులు ఫాస్టర్ ఆనంద్ జైకుమార్ తదితరులతోపాటు ఇతర తెలుగు క్రిస్టియన్ అసోసియేషన్స్ ప్రముఖులు పాల్గొన్నారు.
అనూహ్యకు తెలుగు క్రైస్తవుల నివాళి
నగరంలో ఇటీవల హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, తెలుగు అమ్మాయి అనూహ్యకు ది బాంబే తెలుగు క్రిష్టియన్ సొసైటీ నివాళి ఆర్పించింది. సోమవారం సాయంత్రం సంతాప సభను ఏర్పాటుచేసింది. తూర్పు పరేల్‌లోని సెయింట్ మేరీ చర్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ డొల్లా స్టీఫెన్ బైబిల్ నుంచి ఆధ్యాత్మిక విషయాలను వివరించారు. అనూహ్య కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని సొసైటీ అధ్యక్షుడు ఐ.కుమార్ దాస్ హామీ ఇచ్చారు.
నేరస్తులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి దుర్ఘటనల వల్ల జాగ్రత్తగా ఉండాలని సభికులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి బి.సదానంద, కోశాధికారి ఏబేలు, సొసైటీ సభ్యులు ఇమ్మానుయేలు శెట్టి, కె.విజయ్ కుమార్, సంజీవరావు, ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్ సంజీవ్, జయంతి, అనూహ్య బంధువులు అరుణ్ కుమార్, రాజ్‌మోహన్, పాస్టర్‌లు ఎస్.డానియేలు, జోయెల్, సలోమెన్ తదితరులు పాల్గొన్నారు. అనేకమంది తెలుగు పాస్టర్లు, తెలుగు క్రైస్తవ సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.
‘అనూహ్య’కు మద్దతుగా ర్యాలీ
Published Tue, Jan 28 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement