అనూహ్య అంత్యక్రియలు పూర్తి
విజయవాడ : ముంబయిలో దారుణంగా హత్యకు గురైన అనూహ్య భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు మచిలీపట్నంలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనూహ్య తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ ఈ కేసులో ముంబయి పోలీసుల నిర్లక్ష్యం స్ఫష్టంగా కనిపించిందన్నారు. తాము ప్రయత్నించి ఉండకపోతే మృతదేహం కూడా తమకు దక్కేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనూహ్య ఫోన్కు సిగ్నల్స్ ఉన్నాయనే మాట అవాస్తవమన్నారు. అదృశ్యమైన రోజు మధ్యాహ్నం వరకే ఫోన్ పని చేసిందని ప్రసాద్ తెలిపారు. మృతదేహం వద్దే సెల్ఫోన్ లభించిందన్నారు. ముంబయి రైల్వేస్టేషన్లో అనూహ్యను రిసీవ్ చేసుకోవటానికి ఎవరూ రాలేదని ఆయన చెప్పారు. కాగా అనూహ్య మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం పూర్తికావడంతో రాత్రి 10 గంటలకు బంధువులు ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్లో మచిలీపట్నం తరలించారు.