
'మోగ్లీ గర్ల్ మా పాపే'
లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్ లోని ఓ అడవిలో కోతులతో పాటు జీవిస్తూ పోలీసుల కంటపడిన ఎహ్సాస్ అలియాస్ 'మోగ్లీ గర్ల్' తమ బిడ్డేనంటూ ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. ఎహ్సాస్ అసలు పేరు లక్ష్మీ అని 2012లో ఆమె తప్పింపోయిందని వారు చెబుతున్నారు. ఈ మేరకు 2012 నవంబర్ లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని ఆధారంగా చూపారు.
తమకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి లక్ష్మీని అప్పగించాలని కోరుతున్నారు. రోటిన్ పెట్రోలింగ్ కు వెళ్లిన పోలీసులకు అడవిలో కోతులతో ఆడుకుంటూ ఓ అమ్మాయి కనిపించింది. దీంతో ఆమె కాపాడి స్ధానిక ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. ఇందుకు సంబంధించి ఓ కేసును కూడా నమోదు చేశారు. అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కలేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కాగా, మోగ్లీ గర్ల్ తమ బిడ్డేనని జంట చూపుతున్న ఫిర్యాదు పత్రాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.