భారత జాబితాలో మోస్ట్ వాంటెడ్ టెర్రిరిస్ట్ యాసిన్ భత్కల్ కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
యాసిన్ భత్కల్ ను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు!
Published Thu, Aug 29 2013 7:08 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM
భారత జాబితాలో మోస్ట్ వాంటెడ్ టెర్రిరిస్ట్ యాసిన్ భత్కల్ కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భత్కల్ ఐడెంటిటీని ధృవీకరించడానికి బీహార్ పోలీసులు కర్నాటక పోలీసులను సంప్రదించినట్టు తెలిసింది. భత్కల్ ను అరెస్ట్ చేసిన వెంటనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి ఓ టీమ్ ను పంపించాలని విజ్క్షప్తి చేసినట్టు తెలుస్తోంది.
అరెస్ట్ అయిన వ్యక్తి భత్కలేనా కాదా అని ధృవీకరించడానికి కర్నాటక పోలీసు విభాగానికి చెందిన ఓ టీమ్ బీహార్ కు వెళ్లినట్టు సమాచారం. కర్నాటకలోని తీరపాంత్రమైన భత్కల్ గ్రామానికి యాసిన్ భత్కల్ చెందినవాడని అధికారులు తెలిపారు. మభ్యపెట్టే విషయంలో భత్కల్ ఆరితేరిన వాడు కావడంతో అతని కుటుంబ సభ్యులతో జీవసంబంధమైన అంశాన్ని పోలీసులు సరి చూడటానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించానున్నారు.
Advertisement
Advertisement