ఫేస్‌బుక్... ప్రపంచం దాసోహమైన సోషల్ హబ్. డీఎన్‌ఏ... ప్రపంచంలోని జీవరాశిని నడిపిస్తున్న ఓ నిర్మాణం.
ఫేస్‌బుక్... ప్రపంచం దాసోహమైన సోషల్ హబ్. డీఎన్‌ఏ... ప్రపంచంలోని జీవరాశిని నడిపిస్తున్న ఓ నిర్మాణం. ఈ రెంటినీ ఏకం చేసింది యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ‘జీన్స్ ఫర్ గుడ్’. వారసత్వంగా ఆస్తులొస్తాయో లేదో కానీ.. పూర్వీకుల లక్షణాలు, వారికున్న జబ్బులు మాత్రం వస్తాయి. వంశపారంపర్యంగా ఏయే జబ్బులు వచ్చే అవకాశముందో తెలుసుకోవాలనుకునేవాళ్ల కోసం ఓ ఫేస్‌బుక్ యాప్‌ను క్రియేట్ చేసింది. దీని ద్వారా 20,000 మంది ఆరోగ్య వివరాలను సేకరించడం కోసం ఓ ప్రశ్నావళిని తయారు చేసింది.
వారిచ్చే సమాధానాల ఆధారంగా ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్రను, అలవాట్లను, జీవన విధానాన్ని తెలుసుకుని.. ఆ హెల్త్ ప్రోగ్రెస్‌ని గ్రాఫికల్ టూల్స్ ద్వారా ప్రజెంట్ చేయనుంది. వారికి ఏయే జబ్బులు రావొచ్చో సమాచారంతో పాటు.. ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇలా సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.