
పోసాని కృష్ణమురళి
‘‘బిల్డప్ కృష్ణ’ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర చేశా. అప్పట్లో కొన్ని సినిమాల్లో ఐదారు కుటుంబాల మధ్యలో ముఖ్యమైన పాత్రలో గొల్లపూడి మారుతీరావుగారు ఎలా నటించేవారో.. ఈ సినిమాలో నాది అలాంటి పాత్ర’’ అని నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. సరీష్, గీత జంటగా పోసాని కృష్ణ్ణమురళి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బిల్డప్ కృష్ణ’. విన్సెంట్ సెల్వ దర్శకత్వంలో లక్ష్మీ టాకీస్ సమర్పణలో నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘ఇప్ప టి వరకు ఎన్నో పాత్రలు చేశాను. ‘బిల్డప్ కృష్ణ’లో ఏడ్చే పాత్ర చేశా.
సన్నివేశాలు చూసి నేనే కన్నీళ్లు పెట్టుకున్నా.ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు కూడా కన్నీళ్లు వస్తాయి. విన్సెంట్ నాకు మంచి పాత్ర ఇచ్చారు. అందుకే టైటిల్ కూడా ‘బిల్డప్ కృష్ణ’ అని పెట్టాం. రైటర్‌గా ఉన్నప్పుడు కూడా నాకు నేను ఇలాంటి పాత్ర రాసుకోలేకపోయా, ఎవరికీ రాయలేకపోయా. ఈ సినిమాలో నా పాత్ర చూస్తుంటే గొల్లపూడి మారుతీరావుగారే కనిపిస్తారు’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. పోసానిగారితో చేయడం సంతోషాన్నిచ్చింది’’ అన్నారు విన్సెంట్ సెల్వ. ‘‘నా మొదటి చిత్రంతోనే పోసానిగారితో కలిసి నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’’ అని సరీష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment