గీత మృతదేహం
సంగం: ఎంసీఏ పూర్తి చేసిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలోని ఉడ్‌హౌస్‌పేటలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉడ్‌హౌస్‌పేట గ్రామానికి చెందిన దొడ్ల శ్రీనివాసులుకు గీత (24) రెండో సంతానం. గతేడాది ఎంసీఏ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తోంది. శుక్రవారం గీత తల్లి బయటకు వెళ్లగా అన్న గిరీష్ ఎదురింట్లో నిద్రిస్తున్నాడు. తండ్రి కూలి పనికి వెళ్లాడు. ఏమైందో గానీ గీత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లి గీతను చూసి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న సంగం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెం తరలించారు. గీత మృతితో ఉడ్‌హౌస్‌పేట గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment